sri Shankara chidvilasamu    Chapters   

శ్రీశంకరన చిద్విలాసము

శంకరస్మృతి

గ్రంథము నిర్విఘ్నముగ పరిసమాస్తి నొందుటకును, ఏతద్గ్రంథ పాఠకుల కభ్యుదయ నిశ్శ్రేయసరూపమగు సమస్త మంగళములు చేకూరు టకును, శిష్ట సంప్రదాయము ననుసరించి శ్రీ శంకర భగవత్పూజ్యపాద సంస్మరణరూప మంగళ మిచట గావింపబడుచున్నది.

1. శ్రుతిస్మృతీతిహాస పురాణాది సమస్త వాఙ్మయములకు నిలయము

దయాగుణమునకు నివాసస్థానము. సర్వజగజ్జాలములకు హితోవ

దేష్టయై, ఏకైక గురువును నైన శ్రీ శంకర బగవత్పూజ్యపాదులను

నేను స్మరింతును.

2. లోకసిద్ధమును, అజ్ఞాన కలుషితము నగు వర్తనముతో గూడి చిర

కాలము నిరంతరము నసద్విషయకీర్తనముచేయుచున్న మా వాక్కు

లకు సంప్రాప్తమైన మాలిన్యమును, పావనమగు శ్రీ జగద్గురు

శంకర భతవత్పూజ్యపాదుల చరితమును కీర్తించుటయను జలమున

నే నిపుడు కడిగివేయుదును.

3. ఈ లోకముననెవరికైనను అసద్విషయాదులకీర్తించుటచే వాక్కుల

కును, వాగ్వ్యవహారమున కుపయోగింపబడిన జిహ్వ(నాలుక) కును

సంక్రమించిన మాలిన్యమును పూర్తిగ సంక్షాళనము చేయుటకు శ్రీ

గురుస్తోత్రమను జలిముకంటె మరియొక సాదనము లేనేలేదు. కాన

శ్రీ సద్గురు స్తుతి యవశ్యము చేయదగినది.

4. అచార్యేంద్రులగు శ్రీ శంకరవత్పూజ్యపాదులకుకృప, కామథేను

కల్పవృక్షాదులను మించిన మహామహిమ కలది. శ్రీ ఆచార్యేంద్రుల

కృపమూగి వానిపై ప్రసరించిన నతకు వాగ్మి ప్రవరుడు కాగలడు.

మూఢునిపై ప్రసరించిన పండితోత్తముడు కాగలడు. అట్టి శ్రీ

శంకరాచార్యులకు నా నమస్కారము.

5. యస్యానుగ్రహ మాత్రేణ, మూలావిద్యా వినశ్యతి

జగద్గురు మహం వన్దే, శంకరం లోకశంకరం||

కథాప్రారంభః

శ్రీశంకరస్యావతరణం

1. యదా జ్ఞానస్యగ్లాని స్స్యా, దజ్ఞానస్య విజృంభణం,

తదాజ్ఞానం సమద్ధర్తు, మహతారా భవన్తిహి||

2. కృతే శ్రీదక్షిణామూర్తి, స్త్రేతాయాందత్త యోగిరాట్‌

ద్వాపరే వ్యాసభగవాన్‌, పూజ్య శ్రీ శంకరః కలౌ||

3. మౌనేన దక్షిణామూర్తి, ర్దత్తో బోధేన చర్యయా

సూత్రైశ్చ వ్యాస భగవాన్‌, భాషై#్యశ్శంకర ధీనిధిః||

4. జ్ఞానస్య బోధనే నైవమేతే యుగ చతుష్ఠయే

జ్ఞానావతారాః ప్రఖ్యాతా, లోకస్య గురవో7భవన్‌||

5. ఇంతియేకాదు-శ్రీవారియను గ్రహము కలిగినంత మాత్రమున సర్వసంసార మూలబీజమగు మహామాయము వినాశము నొందగలదు. అట్టి సమస్తలోక కళ్యాణ సంథాయకుడగు జగద్గురు శ్రీ శంకరా

చార్యులకు నా నమస్కరము.

కథాప్రారంభము

శంకరు లవతరించుట:-

1. విశుద్ధము, సర్వప్రమాణ సమ్మతము సర్వోపనిషత్సార భూతము

నగు తత్త్వజ్ఞానముయొక్క ప్రచారమున కెపుడు హానికలుగునో,

ఎప్పుడజ్ఞానమునకు వృద్ధియేర్పడుచుండునో అప్పుడప్పుడు తత్త్వ

జ్ఞానసందప నభివృద్ధి పరచుటకు శ్రీభతవానుడు లోకమున నవతరించుచుండును.

2. భగవానుడు జ్ఞానమార్గ సముదర్ధరణముకై కృతయుగమున శ్రీ

దక్షిణామూర్తి స్వరూపమునను, త్రేతాయుగమున యోగీంద్రుడౌ

దత్తాత్రుయుని స్వరూపమునను, ద్వాపరయుగమున వేదవ్యాసస్వరూ

పమునను ఈ కలియుగమున సర్వజగత్పూజ్యమగు శ్రీ శంకరాచార్య

రూపమునను ఈ లోకమున నవతరించెను.

3. వారిలో శ్రీదక్షిణామూర్తిమౌన వ్యాఖ్యానముతోను శ్రీ దత్తా

త్రేయులవారు స్వకీయాచరణమునను, సదుపదేశమువలనను, శ్రీ

వేదవ్యాసులు బ్రహ్మసూత్ర రచనమునను, విజ్ఞానఖనియగు శ్రీ

శంకరులు ప్రస్థానత్రయాభాష్యాది గ్రంథప్రణయనమునను విమల

మగుతత్త్వజ్ఞానమును విస్తరింపజేసిరి.

4. ఇట్లీ నలుగురును, నాలుగు యుగములయం దవతరించి, జ్ఞానమార్గ

సముద్ధరణము గావించిన కతమున జ్ఞానావతార మూర్తులనియు,

జగద్గురువులనియు విఖ్యాతినొందిరి.

5. శంకరాచార్య చరితం, సర్వపాప ప్రణాశకం

జ్ఞాపదం మోక్షదం చేతి వర్ణ్యతే తన్మయా7ధునాళి

6. వర్షేభ్య స్త్రిసహస్రేభ్యః ప్రాజ్ఘనాః కర్మఠా భువి

అజ్ఞాత్వా వైదికం మార్గం, పశుహింసాం యధేచ్ఛయా||

7. కుర్వాణా ధర్మనామ్నా చ, భ్రష్టమార్గాశ్చ తే7భవన్‌

ఏతాన్‌ త్సర్వాన్‌ త్సముద్ధర్తుం, బుద్ధో7భూ దీశ్వరో

హరిః||

8. మాహింస్యాత్సర్యభూతానీ, త్యాద్యా

న్యామ్నాయగాని సః

వాక్యాన్యుద్ధృత్య బోధం చ, బుధ్ధ శ్చ క్రేసయుక్తి కం||

9. బోధేనానేన తాన్‌ సర్వాన్‌, విముఖాన్‌ యజ్ఞకర్మసు

కృతా తద్దుష్టహ స్తేభ్యో, వేదఖడ్గం గృహీతవాన్‌||

10. కింతు బుధ్ధస్య శిష్యాస్తే, నాస్తికాలోకకంటకాః

ప్రావర్తయుం శ్చ నాస్తిక్య, ముకుర్వస్‌ వేదదూషణం||

11. ఏవం భరతఖండే7స్మిన్‌ ప్రాచలన్నా స్తికం మతం

ఆసన్‌ తదానీ మన్యాని, నాస్తికాని మతాన్యపి||

12. తదానీం దేవతా స్సర్వా, ఈశ్వరం ప్రాప్య సత్వరం

అవతర్తుం తమభ్యర్థ్య, ప్రాపుస్తస్మాతథావరం||

5. శ్రీ శంకరాచార్య చరితము సర్వపాపప్రణాశకమై జ్ఞానవైరాగ్యది

సంపాదకమై, మోక్షసాధకము కాగలదు. కాన నేనిపుడీ శంకర

చిద్విలాసమను గ్రంథరూపమున శ్రీ శంకర చరిత్రమును వర్ణించు

చుంటిని.

6.7 ఇప్పటికి మూడువేల సంవత్సరములకు పూర్వము ఈ లోకమున

ప్రజలెల్లరు, వేదోక్తధర్మస్వరూప విశేషమును గుర్తెరుగక యమ

నియమాది శూన్యవర్తనము గలవారై కామప్రేరణమును కర్మఠులై

యథేష్టముగ వేదోక్తధర్మమను పేర పశహింసల బహుళముగ

నాచరించుచు, వైదిక మార్గమునుండి భ్రష్టులు కాజొచ్చిరి. అట్టి

వారల నుద్ధరించుటకు లోకనియంతయగు శ్రీహరి బుద్ధరూపమును

ధరించెను.

8.9 అంత నాబుధ్ధభగవానుడు ''మా హింస్యాత్సర్యాభూతాని''-ఏ ప్రాణి

నైనను హింసింపరాదు-అను నర్థమును బోధించు వేదరాస్యంతర్గత

వాక్యముల నుద్ధరించి తదర్థములను సయుక్తికముగ నిరూపించి

బోధించుచు, వేదములకు అహింసయందే తాత్పర్యమని నిరూపించి

దుష్టులగు నాకర్మఠులను యజ్ఞకాండకు విముఖులనుగాజేసి, వారి

హస్తములనుండి వేదఖడ్గమును గ్రహించివేసెను.

10. గురూక్తుల తాత్పర్యమును సరిగ గ్రహింపజాలక వారి శిష్యులు

నాస్తికులై. పేదనిందాతత్పరులై లోకకల్యాణ పరిపంథియగు

నాస్తిక్యమును బముముఖముగ లోకమున విస్తరింపిజేసిరి

11. ఇట్లు పవిత్రమగు నీభరతఖండమున ప్రచారమునొందిన ఈ నాస్తిక

మతము జైనచార్వాకాది ఇతర నాస్తికమతములు తనకు తోడు

కాగా విశేష వ్యాప్తిఒనొందెను

12. అప్పుడు దేవతలు నాస్తికత్వము సర్వధా శ్రేయఃపరిపంథి యగుటచే

తన్నిర్మూలనము వెంటనే కావింపవలయునని యెంచి వేగముగ

13. ఈశ్వరో మానుషం రూపం, ధర్తు మిచ్ఛన్‌ స్వమాయయా

బ్రహ్మాణం భారతీమిన్ద్రం, కుమారాదీన్‌ త్సమాదిశత్‌||

14. యూయుం సర్వేజైరం శై ర్జాయుధ్వం

మర్తయోనిసు

కర్మమార్గ స్థాపయుతుం, జ్ఞానమార్గస్య సాధనం||

15 తతోహం మానుషోభూత్వా, బ్రహ్మజ్ఞానం చ భూతలే

అద్వైతస్థాపనద్వార, స్థిరీకుర్యాం సహస్రః||

16. ఈశ్వరోక్తప్రకారేణ, కుమారో7 భూత్కుమారిలః

బ్రహ్మమండ నమిశ్రశ్చ, వాణీచో భయభారతీ||

17 ఇన్ద్రస్సుధన్వభూపాలో, విష్ణుశ్చాసీ త్సనందనః

నందీశస్తోటకాచార్య, ఏవం దేవా అవాతరన్‌||

18. తతఃకర్మప్రచారార్థం, దీక్షతో7 భూత్కుమారలః

మండనస్తస్య శిష్యో7భూ, త్తద్భా ర్యోభయభారతీ||

కైలాసమునకేగి పరమేశ్వరు దరిజేరి ''సక్రమ వేదమార్గ ప్రతి

ష్ఠాపనము గావింప తాము భూలోకమున నవతరింపవలయు''నని

యభ్యర్థనము గావింప నా పరమేశ్వరుడు 'తథాస్తు' అని యంగీక

రించిరి

13. 14 అంత స్వాధీనమాయుడగు పరమేశ్వరుడు తన మాయచే మానుష

రూపమును ధరింప నిశ్చయించి, సృష్టి కర్తయగు బ్రహ్మ

దేవుని, వాగ్దేవిని, తన కుమారుడగు కుమారస్వామిని, తన పరి

వారమును, ఇంద్రుని, ''మీమీ యంశములతో మీరు మర్త్యరూప

ముల నవతరింపుడు; జ్ఞానమార్గమునకు సాధనమగు కర్మమార్గమును

క్రమబద్ధముగను, శాస్త్రసమ్మతముగను స్థాపింపుడు'' అని యాదే

శించెను.

15. మీరట్లు గావించిన పిమ్మట నేను మానుషరూపమును దాల్చి

అద్వైతమతమును స్థాపించుచు పరిశుద్ధమగు జ్ఞానమార్గమును ననేక

విధములుగ స్థిరపరుప గలననియు ననెను.

16. 17 పరమేశ్వరు నాదేశము ననుసరించి శ్రీకుమారస్వామి కుమారిల

భట్టుగను, బ్రహ్మదేవుడు మండన మిశ్రుడుగను. వాగ్దేవి ఉభయ

భారతి [మండనమి శ్రుని భార్య]గాను, ఇంద్రుడు సుధన్వ భూపా

లుడుగను, శ్రీ మహావిష్ణువు ననందనుడుగను, నందీశ్వరుడు

తోటకాచార్యుడుగను, నిట్లు దేవతలు భూమండలమున నవతరించిరి.

18. పిమ్మట కుమారిలభట్టు శాస్త్రసమ్మతమగు విమల కర్మమార్గమును

ప్రచారము నొనరింప దీక్షబూనెను. మండనమిశ్రుడు కుమారిల

భట్టు శిష్యుడయ్యెను. పూర్వ మీమాసంసా శాస్త్రరహస్యముల నాతనికి

కుమారిలుడు క్షుణ్ణముగ బోధించెను. ఇంక నెందరినో అతడు

కర్మమీమాంసా శాస్త్ర నిష్ణాతుల గావించెను. మండనమిశ్రుని భార్య

ఉభయభారతి. వా రుభయులు కర్మనిష్ఠాగరిష్ఠులై లోకమున

బ్రఖ్యాతి నొందిరి.

19. మీమాంసా శాస్త్రమర్యాదాం మాహాత్మ్యంచ

ప్రదర్శయన్‌

కుమారిలస్థ్సిరం చక్రెకర్మ, మార్గం తదాభుమి||

శ్రీశంకరర జననం

20. ఏవంస్థితేచ కాలట్యాం, జాత శ్శ్రీశంకరస్సుదీః

వంశేవిద్యాది రాజానాం, విదుషాం ధీమతాం సతాం||

21. పితాశివగురు ర్నామ్నా, వేదశాస్త్రశారదః

యజ్ఞాదికర్మ నిష్ణాత, స్సతా మాదర్శపూరుషః

22. మాతా చార్యాంబికా సాధ్వీ, విదుషీ ప్రియభాషిణీ

పండితాన్వయసంభూతా, సర్వసద్గుణశోభితా||

23. అన్వర్థరాధే¸° తా. వుభౌ సర్వజనై స్మ్సృతౌ

కింతు సంతత్యభావేన, దీర్ఘకాలం చ బాధితౌ

24. తత శ్శివగురు ర్వజ్వా, పుత్రార్థం తప అచరత్‌

వృషాద్రా వీశ్వర స్తుష్టో ముతా పుత్రవరం దదౌ|

25. ఏకమల్పాయుషం కింతు సర్వజ్ఞం లోకశంకరం

ఏవం శివగురుః ప్రాప్య, వరం దివ్యం య¸°గృహం||

19. పూర్వ మీమాంసా శాస్త్రమర్యాదలను కర్మమార్గము నందలి

మాహాత్మ్యములను లోకము నెల్లడలను బహుళముగ ప్రదర్శించుచు

వేదప్రామాణ్యమును యుక్తిప్రయుక్తులతో నిరూపించుచూ, కుమా

రిల భట్టు భూమండలమున నాస్తిక్యమును పారద్రోలి వేదసమ్మత

మగు కర్మమార్గమును సుప్రతిష్ఠిత మొనర్చెను.

శంకరాచార్యజననము

20. తరువాత కొంతకాలమునకు జ్ఞానధియు, శిషాగ్రేసరుడు శ్రీ

విద్యాధిరాజు అనువారి వంశమునందు కాలటియును నగ్రహారమున

శ్రీ శంకరు లవతరించిరి.

21. శ్రీశంకరుల పితృపాదులు శివగురువని ప్రసిద్ధినొందిన వేదశాస్త్ర

విశారదుడగు పండితోత్తముడు. యజ్ఞాది సత్కర్మనిరతుడై ఆయిన

శిష్టా గ్రేనరులగు వారికిగూడ లక్ష్యభూతమగు సద్వర్తనముతో

నొప్పారు. చుండెను.

22. శ్రీశంకరుల గన్నతల్లి ఆర్యాంబిక పతివ్రాతా శిరోమణి. విద్యాధికు

రాలు. ప్రియభాషిణి, పండితోత్తముల యన్వయమున నవతరించిన

పూతచరిత్ర. సర్వసద్గుణము లామోయందుమూర్తీభవించియుండెడివి

23. సుగృహీత నామధేయులు, జగత్ప్రసిద్ధులు నగు నా దంపతులు

చిరకాలము సంతతి కలుగక మిగుల భాదనొందిరి.

24. 25 యాగాది సత్కర్మానుష్ఠాన పరుడగు నా శివగురువు పుత్రకాంక్ష

తన్ను ప్రేరేపింప తపస్సు సర్వార్థసాధకమని యెంచి, వృషాద్రీశ్వ

రుని గూర్చి యధిక దీక్షతో తపము నాచరించెను. కృషాద్రీశ్వరు

డాతని తవమునకు మెచ్చి ''నీ తపమునకు మెచ్చి తమి; నీ మనో

రథము సిద్ధించును. సర్వలోక శ్రేయఃప్రదుగు శ్రీ శంకరుడు

సర్వజ్ఞమూర్తి నీకు పుత్రుడు కాలగడు; కాని అత డల్పాయుష్కు

డగును'' అని వరమిచ్చి పంపెను.

26. తత శ్చేశ్వరసంతుష్టై, కృత్వా సంత్పరణం సతాం

ద్విజభుక్తావశిష్ఠాన్నం, భుక్తవంతౌ చ దంపతీ||

27. తదానీ మైశ్వరం తేజ, ఆర్యాంబాయాశ్చ భోజనే

ప్రవివేశ ముఖం తస్యా, ఈశ్వరస్య ప్రసాదతః||

28. తత్ప్రసాదేన చార్యాంబా, హ్యస్తర్వత్నీ బభూవ సా

దధార గర్భేసాదేవి, శంకరం లోకశంకరం||

29. సర్వేష్వప్యవతారేషు, చైవ మేవ ప్రదృశ్యతే

స్త్రీపుంసంయోగో గర్భో, న భవత్యేవ తాదృశః ||

30. తతస్సాదశ##మే మూసే, సంపూర్ణశుభలక్షణ

షడ్విం శేశతకే శ్రీమ, ద్యుధిష్ఠిరశకస్యవై||

31. ఏకత్రింశే7ధ వర్షేతు, హాయనే నందనే శుభే

మేష రాశిం గతే సూర్యే, వైశాఖే మాసి శోభ##నే|

32. శుక్లపక్షే చ పంచమ్యాం, తిథ్యాం భాస్కర వాసరే

పునర్వసు గతే చంద్రే, లగ్నె కర్కట కాహ్యయే||

33. మధ్యాహ్నేచాభిజిన్నామ్ని, ముహూర్తేశుభ వీక్షితే

స్వోచ్చస్థే కేంద్ర సంస్థే చ, గురౌ మందే కుజేరవౌ||

34. నిజతుంగ గతే శూక్రే, రవిణా సంగతే బుధే

ప్రాసూత తనయం సాధ్వీ, హ్యదితి ర్వామనం యథా||

35. ఉదయాచలగా77శేవ, భానమంతం మహౌజనం

దుర్నిరీక్ష్యై స్స్వతేజోభి ర్భాసయంతం దిశోదశ||

26. వరలాభమున సంతుష్టుడై శివగురువు గృహునకేగి, పరమేశ్వర

ప్రీతికై బ్రాహ్మణ సంతర్పణముల గావించి, తద్ద్విజభుక్తావ శిష్ఠా

న్నమును దర్మ ప్రత్నీ సమేతుడై ప్రీతితో భుజించెను.

27. ఆ సమయమున వృషాద్రీశ్వర ప్రసాదమున పరమేశ్వరుడగు నా

సదాశివుని తేజస్సు, ఆర్యాంబిక స్వీకరించుచున్న ఆహారముద్వారా

ఆమెయందు ప్రవేశించచెను.

28. ఇట్లీశ్వర ప్రసాదమున ఆర్యాంబ గర్భవతియై, తన గర్భమున నా

లోక శంకరుడగు శంకరుని ధరించెను.

29. ఆవతార ప్రసంగములలో సర్వత్ర ఇట్లే తనంత తానుగ భగవానుడు

మాతృగర్భమున జేరుట తటస్థించునుగాని ప్రాకృత మానవులకు

వలెగాదు.

30. to 35 అనంతరము పదియవమాసము వచ్చిన పిమ్మట నా ఆర్యాబింక

యుద్ధిష్ఠిర శకమున ఇరువది యారువందల ముప్పది యొకటవ సం

వత్సరమునకు సరియైన నందనసంవత్సరమునందలి వైశాఖ శుక్ల

పంచమీ భానువారమున పునర్వసూ నక్షత్రయుక్త కర్కాటక లగ్న

మున మధ్యాహ్న సమయమునందు అభిజిన్నామక శుభముహూర్త

మున దేవమాతయగు నదితి శ్రీవామనమూర్తినిగన్నట్లు, ఉదయాద్రి

యందలి ప్రాచీదిగంగన తేజోరాసియగు సూర్యభగవానుని గన్న

యట్లు, దివ్యమగు తనతేజస్సుతో దిక్కులనెల్ల వెలిగించుచు సర్వ

శుభలక్షణములతో నొప్పారు శ్రీశంకరభగవత్పూజ్యపాదులగనెను

ఆ సమయమున రవి గురు శుక్రర శను లైదుగురును స్వోచ్చస్తాన

ముల నలంకరించియుండిరి. బుధుడు రవితో జేరియుండెను.

36. ఏవం తజ్జన్మకాలశ్చ, చిత్సుఖేన సువర్ణితః

బృహచ్ఛంకర విజయె, తచ్ఛిష్యేణౖవ ధీమతా||

37. తజ్జన్మకాలో7న్యత్రాపి, హ్యేన మేవ సువర్ణితః

తస్మాత్తద్భిన్నవాదాస్తు, ప్రమాణ రహితా నను||

38. ఏవం శ్రీశంకర స్సాక్షా, దాని రాసీ త్కలౌ యుగే

ఆర్యాంబా గర్భ సంభూతః, పరమాత్మాసనాతనః||

39. తదా సర్వగుణోపేతః, కాలః పరమ శోభనః

నద్యః ప్రసన్న సలిలా, వవౌవాయుశ్చ సౌఖ్యదః||

40. అగ్నయ శ్శోత్రియాగారే, జజ్వలు శ్శుభశంసినః

పృథినీ సస్య సంపన్నా చాకాశో నిర్మలో7భవత్‌||

41. మానం స్యాసన్‌ ప్రసన్నాని, సాధూనాం దేవతాను మ దా

వవర్షుః పుష్పవృష్టించ, జాయమానే హి శకరే||

42. వైరం విహాయ సర్పాది, మండూకాదీ సపాలయత్‌

మృగరాజ గజాదీనాం, స్నేహభావస్తదా7జని||

43. భయాది సహితాన్యాసన్‌, మనాంపి ద్వైతవాదివాం

తేషాం కరేభ్య స్సర్యేషాం, పుస్తకాన్యపతన్‌ భూవి||

44. అద్వైత వాదీ వ్యాసస్తు, చకా రానంద తాండమం

వేదాంతేషు విహారం చ, కృతవాన్‌ శంకరోద్భవే||

36.37. శ్రీశంకరుల జననకాలమును గురించి మతభేదము లనేకములు

గలవు. ఇప్పుడు మేము సూచించిన యీ కాలమును సాక్షాత్తుగ శ్రీ

శంకరులకు శిష్యులైనచిత్పుఖులవారు తాము రచించిన ''బృహ

చ్ఛంకర విజయ''మను గ్రంథమున నిరూపించిరి. ఈ పక్షము

ద్వారకా, పూరి మున్నగు పీఠముల వృత్తాంతములను బట్టియు,

కొన్ని యితర గ్రంథములను బట్టియు ధృవపడుచున్నది. ఆ కారణ

ముననే తద్భిన్న పక్షములు ప్రమాణసమ్మతములు కాజాలవు.

38 to 40 కలియుగమున లోకరక్షణార్థమై సనాతనుడును పరమాత్మయు

కైలాసవాసియునగు శ్రీశంకరు డార్యాంబా గర్భమునుండి శుక్తి

గర్భమునుండి యాణిముత్యమువలె నావిర్భవించిన పరమ శోభన

మగు నా సమయమున గాలి చల్లగ వీవసాగెను. నదులు ప్రసన్న

జల సంపన్నములయ్యెను, శ్రోత్రియ గృహముల యందలి

గార్హపత్యాద్యగ్నులు లోకకల్యాన మాసన్నమయ్యెనని సూచించుస

చున్నట్లు మనోహరజ్వాలలతతో ప్రజ్వరిల్లసాగెను. ఆకాశము

నిర్మలమయ్యెను.

41. 42 సాధజనుల మనములు ప్రసన్నతమము లయ్యెను. పరమా

నంద భరితములై దైవతాగణములు ద్యుభాగమునుండి పుష్పధారల

గురిపించిరి. అన్యోన్య వైరములుమాని సర్వ ప్రాణికోటియు పర

స్పర మైత్రితో మెలగసాగెను. సర్పరాజులు మండూకలముకు

గ్రీష్మాతపబాద లేకుండజేయ తమ పడగలవిప్పి కాపాడసాగెను.

మృగేంద్రము లేనుగులతో తమ స్నేహభావమును ప్రకటించినవి.

43. 44. ద్వైతవాదుల మనసులు భయకంపాదుల సముద్విగ్నమలయ్యెను.

వారి కరములనుండి పుస్తకములు తమంత తాము జారి క్రింద

పడెను. అద్వైతతత్త్వ వాదియగు శ్రీ వేదవ్యాసు లద్వైత ప్రతి

ష్టాపనాచార్యుడగు శ్రీశంకరు దవతరించిన ఆ సమయమున

45. అహో శంకరమాహాత్మ్యం, తదుత్పత్తి క్షణ తదా

అద్వైత కిరణౖ సమ్యక్‌, ప్రసన్నా-శ్చ దిశో7భవన్‌||

46 బ్రహ్మైన ఖల్విదం సర్వ, మేక మే వాద్వితీయకం.

ఏవం బ్రహ్మమయం చాభూ, దద్వైతి జననే తదా||

47. సహస్రార్క ప్రతీకాశం, స్మాతాస్యం పద్మలోచనం

కరుణా రస సంపూర్ణ, మద్భుతం చాతి సుందరం||

48. బాల మేతాదృశందృష్ట్యా మాతా మర్షాశ్రు సంప్లుతా

ఆనందావర్ణవ మగ్నాసా, ముహూర్తం విస్మయంయ¸°||

49. పితా పుత్రోద్భవం శృత్వా, దృష్ట్వా రాజీవలోచనం

తేజోమూర్తింఛతం బాలం, శాన్తిదం సర్వదేహినాం||

50. కర్తవ్యాని చకర్మాణి శ్రుత్వా శాస్త్రీయ మార్గతః||

ధన ధాన్యాది సంభారాన్‌, శ్రోత్రియేభ్యోదదౌ ముదా

శ్రీశంకరస్య బాల్యం

51. బాలస్య నామ విషయే, కాలజ్ఞైః పండితైస్సహ

సమాలోచ్య పిరానామ, శంకకాఖ్యం చకార సః||

52. శంకర స్వావతారత్వా, త్సర్వేషాం సౌఖ్యకారణాత్‌

అన్వర్థ నామధేయ శ్చ, శంకరో7భూత్సదా భువి||

వేదాంతవాక్య విచార లక్షణ సలిపి బ్రహ్మానంద

సంభరితుడై యానంద తాండవముజేసెను.

45. 46. శంకర బగవత్పూజ్యపాదుల మాహాత్య మావాఙ్మానస గోచరము.

అద్వైత ప్రతిష్ఠాపనాచార్యులగు వా రుదయించిన ఆ క్షణమున

సర్వత్ర భూమండలమున విద్వాంసుల హృదయములందు ''ఏక

మేవాద్వితీయం బ్రహ్మై వేదం సర్వం'' ఇత్యాది వాక్యకిరణములు

భాసించి, సర్వదిక్కులయందు బ్రహ్మమయ తేజస్సే భాసించినట్లు

చక్కని ప్రసన్నత యేర్పడెను.

47. 48. సహస్ర సూర్యసంకాశమగు కాంతిగలిగి పద్మ మనోహర

ములగు నేత్రములతో అతిలోకసౌందర్య సంపదతో మోమున

చిరునగవుదోప సూతిగృహమున తనకు పుత్రుడుగా జనించిన ఆ

యద్భుత బాలకుని జూచి ఆనందబాష్ప పురిప్లుతాంగియై ఆర్యాంబిక

ఆనందాశ్యర్య తరంగముల నోలలాడెను.

49. 50. తండ్రియగు శివగురువు పుత్రజననమునుగూర్చి విని సంతోష

మున నటకు జని, తేజోమయ మూర్తియు, రాజీవలోచనుడు నగు

నా బాలకుని. సర్వదేహధారులకు శాన్తి ప్రదుడైన వానినిజూచి

బ్రహ్మానంద సంభరితుడై, తత్కాల కర్తవ్యములగు జాతకర్మాది

సంస్కారముల యధావిధి నాచరించి, శ్రోత్రియులగు బ్రాహ్మణు

లకు గోభూహిరణ్యాది బహువిధ దానముల ననంతముగ జేసెను.

శంకరుని బాల్యము

51. 52. పది రోజులు గడచిన పిమ్మట దైవజ్ఞులతో సమాలోచనములు

జరిపి శివగురువు తనకుమారునకు 'శంకరుడ'ను పేరుపెట్టెను.

సాక్షాత్తుగ నీ బాలకుడు శంకరుని యవతారమే యగుటచేతను,

సమస్తలోకముల వారికిని బంధనహేతువగు నజ్ఞానమును నశింప

జేసి పరతత్త్వబోధనముద్వారా శాశ్వత సౌఖ్యమును చేకూర్చు

వాడగుచేతను, 'శంకరుడ'నునామమీతనికి సార్థకమేయయ్యెను.

53. ఈశ్వర స్వావతారస్య, వార్తాం శ్రుత్వా మహర్షయం

అగస్త్య ప్రముఖాస్సర్వే, ద్రష్టుం బాలంసమాయయః||

54. ఆగతాంస్తాన్‌ మునీన్‌ దృష్ట్యా దర్శయిత్వా చ బాలకః0

ఈశ్వరస్య ప్రసాదేన, జాతో7ల్పాయి రసౌసుతః||

55. తతో మే మనసః కించి, ద్వైకల్పముప జాయతే

కతివర్షానయం జీవేత్‌, కధ్యతాంమే మహర్షయః||

56. స్త్రీచాపల్యేన చార్యాంబా, పప్రచ్ఛర్షీన్‌ సమాగతాన్‌

తదా మహర్షయం ప్రోచు, ర్మాతర్ధన్యాసిమా శుచః||

57. కర్తవ్యస్వారతారేస్మిన్‌, పూర్తింకృత్వాకలౌ యుగే

ద్వాత్రింస ద్వర్ష పర్యన్తం, బాలస్థ్సాప్యతి భూతలే||

58. ఏకముక్త్వా చ సంస్తుత్య, బాలరూపక మీశ్వరం

మము ర్యథాగతం సర్వే, మనయో హృష్టమానసాః||

59. ప్రాగేవ త తృతీయబ్దా, ద్బాలోవక్తృత్వమాప్తవాన్‌

స్వభాషాం దేవభాషాం చ, చౌలకర్మతదా కృతం||

60. విద్యాభ్యాసోత్సవం చాస్య, పితా చక్రేతదా ముదా

వత్సరద్వయ కాలే7సౌ సాహిత్య జ్ఞాన మాప్తవాన్‌||

53. శంకర రూపమున పరమేశ్వరుడు శివగురునియింట నవతరించిన

వార్తవిని అగస్త్య ప్రముఖులైన మహామును లందరీ బాలకుని

జూడవచ్చిరి.

54. to 58 ఆ వచ్చిన పెద్దల గౌరవించి, పుత్రుని వారికిజూపి, స్త్రీ స్వభావ

సులభమగు చాపల్యమున నార్యాంబిక యిట్లు ప్రశ్నించెను. ఆయ్యాః

వృషాద్రీశ్వరాను గ్రహమున నల్పాయుష్కుడగు నీ బాలుడు మాకు

లబ్ధమయ్యెను. ఆ కారణమున నా మనసు వికలమగుచున్నది

ఎంతకాల మీతడు జీవించగలడో తమరు సెలవీయవలయును.

అంత నా మహర్షులు''తల్లీ! నీవు ధన్యురాలవు. దుఃకింపకుము

ఈ కలియుగమున నీయవతారముతో సాధింపదగిన కార్యముల

నన్నిటిని నిర్వర్తించుటకై ముప్పది రెండవ సంవత్సరము వరకును

నీ బాలుడు భూమండలమున నుండగలడు'' అని చెప్పి మహర్షులు

బాలరూపమునున్న పరమేశ్వరు ననేకవిధములుగ సంస్తుతించి,

సంతుష్ఠాంత రంగులై స్వస్థానములకు వెడలిపోయిరి.

59. క్రమముగ నా బాలుడు శుక్ల పక్ష చంద్రునివలెవృద్ధినొందుచుండెను

అతడు మూడు సంవత్సరముల నిండకమునుపే మాతృభాష, దేవ

భాషల పరిజ్ఞాన మార్జించి గొప్ప వక్తృత్వము నార్జించెను. ఆ

వయసున చేయదగిన చౌల సంస్కారమును తండ్రి యధావిధిగా

నాతనికి జరిపించెను.

60. బాలుని విజ్ఞానమున కానందించుచు, నాతని తండ్రి మూడవ

సంవత్సరమునను బాలకును విద్యాభ్యాసోత్సవమును మహావైభ

వముగ నడిపి విద్యాసముపార్జనమునకై బాలకకునకు గురువుల

సానిధ్యమును కల్పించెను. అంత నా బాలకుడు అత్యల్పకాలము

లోనే, అనగా రెండు సంవత్సరముల కాలములోనే సాహిత్య

జ్ఞానమును సంపూర్ణముగ సంపాదించెను.

శ్రీశంకరస్యబ్రహ్మచర్యం

61. ఉపనీతి విధానజ్ఞో, వటో, ర్వర్చస్సమృద్దయే

వేదాధ్యాయన సిద్ధ్యర్థం, శంకర స్యోపనాయనం||

62. పంచషేబ్దే పితా చక్రే, స్వసూత్రోక్త విధావతః

పంచమాబ్దా త్ప్రభృత్యేవ, వర్తేతే7ధికృతిర్ననుః||

63. ఏవం స్థితే పితా తస్య, కాలధర్మ ముసాగతః

పితృకర్మాది తన్ముక్త్యై కృతవాన్‌ శంకర స్సుధీః||

64. కదాచిద్గతవత్యం బా, స్నాతుం పూర్ణానదీం తతః

పాత్రేణ జలమాదాయ, న శశా కాగమాయ సా||

65. ఆశక్తాం మాతరం దృష్ట్యా, దూరస్థాం చ తరంగిణీం

పుత్రస్త్పుత్వానదీం భక్త్యా, సమీపస్థాం చకార తాం||

66. శంకరోయం వటుర్భూత్వా, కాలట్యాం ప్రతహంచరన్‌

భిక్షాటనం చ కుర్వానో, గురుసేవాం చకార సః||

67. కాలే నాబద్దద్వయె నాసౌ, వేదాన్‌ సర్వా నధీతవాన్‌

వేదాంగాని చశాస్త్రాని విద్యాస్థానాని వైతదా||

68. సప్తహాయనేవాయం, సర్వవిద్వాసు పండితః||

సర్వతంత్ర స్వతంత్రశ్చ, సర్వజ్ఞో7జని శంకరః||

61. 62. ''పంచమే బ్రహ్మవర్చసకామస్య||-'వటువునకధిక బ్రహ్మపర్చస్సు

కలుగవలయునను కోరికయున్నచో. ఐదవ సంవత్సరముననే

ఉపనయనము చేయవలయును' అను శాస్త్రము ననుసరించి, శివ

గురువు తన కుమారునకు బ్రహవర్చ స్సమృద్ధి కలుగజేయుకును.

వేదాధ్యయనాదికారమును సిద్ధింపజేయుటకును, స్వసూత్రోక్తవిధాన

మున ఉపనయనము సంస్కారను జరిపించెను.

63. కొలదికాలములో, శంకరుని తండ్రి శివగురువు కాలధర్మము

(మరణము) నొందెను. అంత విజ్ఞానవిధియగు నా బాలుడు. తండ్రి

గారికిముక్తిసిద్ధింపజేయు యధాశాస్త్రముగ పితృకర్మలనాచరించెను.

64. 65. తరువాత నొక దినమున నాతని తల్లి స్నానముచేయు తమ

గ్రామము దరినున్న పూర్ణానదికి వెళ్లి, స్నానమాచరించి, సానీయ

పూర్ణపాత్రమును గ్రహించి, యింటికిరా నుంకించెను గాని, వృద్ధ

యగు నామె ఆ పాత్రను తీసుకొని యింటికి రాలేకపోయెను.

అపుడు శంకరుడు ఆ రాలేకపోవుచున్న తన తల్లిని, దూరమున

నున్న ఆ నదిని జూచి, భక్తితో నదీదేవతను స్తోత్రముజేయగా,

నా నదివెంటనే వారి గృహసమీపమునకు వచ్చెను.

66. 68. బ్రహ్మచారియగు నా శంకరుడు కాలట్య గ్రహారమున

భిక్షాచర్యాది బ్రహ్మచారి ధర్మములను యధావిధి ననుష్ఠించుచు,

గురుశుశ్రూషా తత్పరుడై రెండు సంవత్సరముల కాలములోనే

సర్వ వేదములను, వేదాంగములను, తదితర సర్వ విద్యాస్థానము

లను గ్రహించి, యేడేండ్ల వయస్సుననే ఆతడు సర్వ విద్యాకో

విదుడై, సర్వస్వన్తృడై సర్వజ్ఞుడై వెలసెను.

69.ప్రతిభా చాసమానా7స్య, వైదుష్యం చాద్వితీయకం

ఆఖండా చాస్య దీశక్తి, ర్వక్తృత్వం చ విలక్షణం||

70. ఆద్భుతం చరితం దృష్ట్యా,జనా ఏవ మచింతయన్‌

కృష్ణ ఏవ స్వగీతాయా, భాష్యం కర్తు మజాయత||

71. సర్వోపనిషద స్సమ్యక్‌, చింతయామాసు రంజసా

స్వేషాం, భాష్యవిధానే7స్మిన్‌, కోవాదక్షః కలౌయుగేః

72. ఏవం విచార్య నిశ్చత్య దక్షో నా స్తీతి తా స్తథా

మానుషుంరూపమస్థాయ, శంకరో7భూత్కలౌయుగే||

73.వ్యాసోపి ద్యాపరేకృత్వా, బ్రమ్మసూత్రాణిచింతయన్‌

అపశ్యన్‌ భాష్యకర్తారం, శంకరో7భూత్కలౌ యుగే||

74. కృష్ణాఖ్యేతు యజర్వేదే, కాండే చైవ చుతర్థకే

వ్యూప్తకేశాయ చేత్యేత, చ్ఛతరుద్రీయకే శ్రుతం||

75. ఏతద్దృష్ట్వా మహేశానః, కిలౌ సన్యాసిరూపధృత్‌

జజ్ఞేశంకరరూపేణ, వేదా నుద్ధర్తుమిచ్ఛయా||

76. పితృసేవాం మాతృసేవాం గురుసేవాం యథావిది

కృత్వాశ్రీశంకర స్సాక్షా, న్మార్గదర్శీ బభూవసః||

69. 70. ఈ బాలకుని యసదృశమగు నవనవోన్మేషశాలి ప్రతిభావిశేష

మును, అద్వితీయ పాండితీగరిమను, అఖండమును, అమోఘము

నగు ధీశక్తిని, అతిమానుషమగు నక్తృత్వ ప్రజ్ఞను, ఆశ్యర్యకర

ములగు నదీ సమాహరణాది చర్యలను జూచి, జనులిట్లు తల

పోయసాగిరిష:-

''పార్థునకు తానుపదేశించిన శ్రీ మద్శభగవద్గీతా శాస్త్రమునకు

స్వయముగ భాష్యము రచింపబూని యాపార్థసారధియే శ్రీకృష్ణస

పరమాత్మయే యిట్లు శంకర రూపమున అవరతించెనా యేమి?-

యనియు.

71. 72. ''కలియుగమున తమ హృదయములను యధావత్తుగ గుర్గించి

వ్యాఖ్యానించి, తత్ప్రచారమును గావింప సమర్ధులగు జనులు లేరని

నిశ్చయించి, ఆ యుస నిషన్మాతలే స్వయముగ శంకర రూపమున

నిట అవతరించినవా యేమి?'' యనియు,

73. ద్వాపర యుగాన్తమున శ్రీ వేదవ్యాసులు సర్వవేద తాత్పర్య నిర్ణా

యకములగు బ్రహ్మసూత్రముల రచించి, తద్భాష్యరచన కర్హులీ

కలియుగమున నన్యులులేరని నిశ్చయించుకొని, తానే శంకర రూప

మున నిట అవతరించెనా యేమి? యనియు,

74. 75 ''కృష్ణ యజుర్వేద మధ్యమున నాల్గవ కాండముననున్న రుద్రా

ధ్యాయ (నమక)మునందు 'వ్యుప్తకేశాయచ' అను వాక్యముగలదు.

ఈ వాక్యము నందలి 'వ్యూప్తకేశాయచ' అను వాక్యముగలదు.

ఈ వాక్యము నందలి 'వ్యుప్తకేశాయ' అను పదమున సూచితమైన

యతి వేషమును ధరింపబూని, శ్రీ మహేశ్వరుడె వైదిక జ్ఞాన

మార్గోద్ధరణమునకై శంకర రూపమున నవతరించెను.'' అనియ

వనేకవిధముల ననుకొనజొచ్చిరి.

76. మాతా పితరుల సేవలను గురు శుశ్రూషలను చక్కగ నాచరిం

చుచు, శంకరులు సర్వలోకమునకు లక్ష్యభూతులై విలసిల్లిరి.

77. సర్వతంత్ర స్వతంత్రోపి, సర్వజ్ఞోపి స శంకరః

లోకసంగ్రహమేవేచ్ఛన్‌ , చకారైవం సుధీమణిః||

78. ఏకదాశంకరో, గత్వా, వర్ణశాలాం చ కస్యచిత్‌

భిక్షార్థ మేవం ప్రోవాచ- ''మాతర్భిక్షాంప్రదేహిమ్‌||''

79. ఇత్యుదీరిత మాకర్ణ్య, దృష్ట్వా బాలం చ సుందరం||

తేజస్వినం వటుం చాపి, గృహిణీ దుఃఖి7తాభవత్‌||

80. అహో! బత మహత్పాపం కృతం ఖలు మయాపురా

నిర్ధవాహం చనిర్భాగ్య, జాతాస్మ్యస్మిఃశ్చ జన్మని||

81. ధనం విద్యాం చ నారీం చ, పూర్వకర్మానుసారతః

విందంతే మానవా శ్చేతి, నూనం శాస్త్రస్యనిర్ణయః||

82. పటో రేతస్య దానార్థం, నాస్తి కించి ద్గృహే మ

కథ మేతాదృశేషభిక్షా, మదత్వా ప్రేషయా మ్యహం||

83. ఏవం సంచిన్త్య సాసాధ్వీ, శోదయిత్వాగృహం తదా

ఏక మామలకం లబ్ధ్వాదదౌ తసై#్మ హ్రియా భియా||

84. దయాళు శ్శంకర శ్చైనాం, దృష్ట్యాజ్ఞాత్వా చతన్మనః

అస్యాలక్ష్మీకటాక్షార్థం ప్రార్థయామాస సత్వరం||

85. తత్‌క్షణాదేవ శ్రీలక్ష్మీం, దృష్ట్వాతాం సో7బ్రవీద్వచః

దేవి చాసై#్త శ్రియం దేహి, కటా క్ష్యేయం త్యయా ధ్రువం||

77. 78. సర్వజ్ఞుడును, సర్వతంత్రుడును, సాక్షాత్పరతత్త్వ స్వరూపుడును

అగు నా బాలరూపుడగు శంకరుడు లోకసంగ్రహమును కోరి ఇట్లు

బ్రహ్మచర్యాశ్రమ ధర్మముల ననుష్టించు, భిక్షార్థియైయొకనాడు,

ఒకా నొక గృహష్థుని పర్ణశాలకడుకుపోయి ''భవతి! భిక్షాందేహి''

యని పలికెను

79. ఇంటనున్న ఆ సాధ్వి, ఆ బాలకుని పలుకులను విని. గృహ

ద్వారముననున్న తేజస్వియు, సుందరుడునగునాబాలవటువునుజూచి

యాతనికి స్వల్పమునైన భిక్ష నివ్వజాలని తన దారిద్య్రమును

గుర్తించి, చాలదుఃఖితమై యిట్లనుకొనునె :

80. ''ఆహా పూర్వజన్మమున నాచే ఎంతయొ గొప్పగ పాపము లాచ

రింపబడి యుండును. ఆ కారణమున ఇట్లీ జన్మమున నిర్ధను

రాలను, భాగ్యవిహీనురాలైతిని.

81. దనములుగాని, విద్యాసంపదలుగాని, స్త్రీ సౌఖ్యములుగాని మాన

వులకు పూర్వకర్మానుసారముగ లబ్ధిమగుచుండునని శాస్త్రముకదా !

82. ''ఈ వచ్చిన బాల వటువునకు కేమియు భిక్షనిడక యూరకయెట్లు

పొమ్మందును ?''

83. అని యిట్లాలోచించి యా సాధ్వీమణి గృహమెల్ల కలియదిరిగి

యెట్టకేలకొక ఉసిరికపండు దొరక దాని నామె లజ్జాభయములు

తనను కలచి వేయుచుండ నాతని కిచ్చెను.

84. సర్వజ్ఞుడగు నా బాలకు డామె మనోగతమగు భావసంశుద్ధి గుర్తించి

దయామయుడగుట నా సాధ్వికి లక్ష్మీకటాక్షమును కలిగింపనెంచి

మహాలక్ష్మిని స్తుతించెను.

85. తత్‌ క్షణముననే స్తుతిప్రీతయగు నా మహాలక్ష్మి వటువునకు

ప్రత్యక్షమయ్యెను. అంత నాడతా దేవితో ''ఈసాధ్వి నీకటాక్షము

నకు పాత్రమగుగాక-ఈమె కైశ్వర్యమునిమ్ము'' అని అనెనె.

86. ఏవం బ్రువన్తం బాలం, దృష్ట్వా లక్ష్మి స్తదా7బ్రవీత్‌

ఏషా సాద్వీ తధా ప్యత్ర, వక్తవ్యం కించిదస్తిమే||

87. సత్పాత్య్రే నదత్తంహి, తయాకించి త్పురానఘ

జాతా తస్మాదిహైవం సా, పూర్వకర్మానుసారతః ||

88. ఏవం తత్కర్మసిద్ధాన్తో, రక్షితవ్యోమయా త్వయా

తతో మేనాస్తికర్తవ్యం, తస్యా దారిద్య్ర మీచనే|

89. ప్రత్యువాచ తదా బాలో, నను సత్యం త్వయేరితం

థతా ప్యద్యతయా భక్త్వా, మహ్యం దత్తమిదం ఫలం||

90. ఉపనీతవటు శ్చాహం. వేదవేదాంగశాస్త్రవిత్‌

ఏతాదృశేచసత్పాత్రే దత్తం భజ్త్యాయా ఫలం||

91.అత్యుత్కటేన పుణ్యన, సద్యః ఫల మవాప్నుయాత్‌

ఏవం చ శాస్త్రమర్యాదా, నోల్లంఘ్యా భాతి సంశృణు||

92. ఏతాదృశం మహ త్పుణ్యం, కృత మద్యతయా తతః

సంపత్తసై#్య ప్రదాతవ్యా, కటాక్షం కురు సత్వరం||

93. యుక్తియు క్తం చ శాస్త్రీయం, మధురం బాలభాషితం

శ్రుత్వావవర్ష సా దేవీ, సావర్ణామలకాని హి||

94. ఏవం తామనుగృహ్యాథ, బాలరూపం చ శంకరం

స్తుత్వా చా న్తర్దథేలక్ష్మీ, స్తుష్ట శ్శ్రీంకరో7భవత్‌||

86.87.88. ఇట్లు పలుకుచున్న ఆ బాల వటువునుజూచి, లక్ష్మీదేవి, ''ఈమె

మహాసాధ్వియే గాని, ఐశ్వర్యప్రదములగు సత్పాత్రదనముల

వేనిని నీమె పూర్వజన్మమున చేసియుండలేదు. కాన నిపుడిమె

భాగ్యహీనగ జన్మించెను. పూర్వకర్మానుసారముగ జనులకు, భాగ్యా

భాగ్యములు సుఖదుఃఖములు మొదలగునవి వచ్చుచుండును గదా!

ఇట్టిది ¸°కర్మ సిద్ధాంత నిర్ణయము నీచేతను, నాచేతను గూడ

రక్షింపదగినది కాని, యన్యధా చేయదగినదికాదు. కాన నీమె

దారద్య్ర నిర్మూలనముపట్లు నే చేయదగిన దేదియులేదు'' అని పలి

కెను.

89 to 92 ఇట్లు పలుకుచున్న ఆ లక్ష్మీదేవితో నాబాలుడు ''ఓ దేవీ !

నీవు చెప్పినదంతయు నిజమే కాని యీ సాధ్వి యిప్పుడు భక్తి

లజ్జా భయములు ముప్పిరిగొన నాకి ఫలము నొసంగినది. నే నుప

నయనాది సంస్కార సంస్కృతుడ నగు బ్రాహ్మణ వటువును.

వేదవేదాంగాధ్యయన సంపన్నుడను. నా కామె అమలక ఫలభిక్ష

విచ్చెను. ''అత్యుత్కట పుణ్యపాపములు సద్యఃపలదాయమకు''లని

గదా శాస్త్రము. కాన నుత్కటమగు నీమెచే చేయబడిన యీ

సత్పాత్రదానము ననుసరించి, శాస్త్రసిద్ధాంతమునకు భంగము

వాటిల్లదుగనుక, యీమె కిపుడు సంపదల నీయతగును. వేగమే

యీమెను కటాక్షింపుము''

93. అనియుక్తి యుక్తముగ, శాస్త్రసమ్మతముగ, మధురభాషలు పలుక

బడిన యా బాల భాషితముల విని, మహాలక్ష్మి సంప్రీతయై, ఆ

సాధ్విపై అనుగ్రహమూని, ఆమె బాలవటువున కిచ్చినది అమలక

ఫలముగాన, తదను రూపముగ స్వర్ణామలకధారలనట గురిపించెను

94. ఇటుల నా మహాలక్ష్మియా సాధ్వినను గ్రహించి, బాలరూపుడగు

శంకరుని బహువిధములుగా స్తుతించి, యంతర్ధానము నొందెను.

శంకరుడునుఆసాధ్వీమతల్లికి గలిగిన భాగ్యమునకుసంతసమందెను.

శ్రీ శంకరం ప్రతి రాజశేఖరస్య సమాగమః

95.ఏకదా కేరళాధీశో, రాజశేఖర నామకః

మహారాజో7స్య బాలస్య. శ్రుత్వా చరిత మద్భుతం||

96. దర్శనార్థీ వటోరస్య, ప్రేమయామాస మన్త్రిణం

గజాదివాహనై స్సాక, మానేతుం శంకరం ముదా||

97. మంత్రీతు కాలటీం గత్వా, సందేశం తం న్యవేదయత్‌

మంత్రిణో వాక్యమాకర్ణ్య, చైవం శ్రీశంకరో7బ్రవీత్‌

98. నోల్లంఘ్యా భాంతి దర్మాశ్చ, బ్రహ్మచర్వేస్థితస్య మే

భిక్షాటనాదయ స్సర్వే తతో వాగన్తు ముత్సహే||

99. ప్రత్యుత్తరం తదాకర్ణ్య, రాజా విస్మయ మాయ¸°

అహోబాలస్య వైరాగ్య, మహోచాస్తిక్య మీదృశం||

100. కర్తవ్యం దర్శనం సద్భిర్వటో రేతాదృశస్య చ

అహమేవ గమిష్యామి, ద్రష్టుం బాలంవటుం స్వయం||

101. ఇత్యాలోచ్య మహారా, స్మ్వయం గత్వాదదర్శ హ

బ్రహ్మవర్చస్వినం బాలం, శంకర లోకశంకరం||

102. దృష్ట్యా బాల మువాచైవం, తేజస్విన్‌ తవదర్శనాత్‌

ధన్యోస్మి మామకీనం చ, పశ్యై తన్నాటక త్రయం||

103. అపుత్రస్య కథం పుత్ర, లాభో మేస్యా ద్వద ప్రభో

శ్రీ శంకరుల వద్దకు రాజశేఖరుడు వచ్చుట:-

95, 96 తరువాత నొక దినమున కేరళ దేశాధీశ్వరుడగు రాజశేఖర ప్రభువు ఆశ్ఛర్యకరములగునీ బాలుని చరితములను విని. గజతురగాది దివ్యవాహనములతో సహితముగా, ఆబాల వటువును తోడ్కొని రమ్మని యాదేశించి తన ప్రధానమాత్యుని పంపెను.

97, 98 అంత నా మంత్రి కాలటిపురిజేరి రాజశేఖరుని సందేశ మా బాల వటువునకు నివేదించెను. మంత్రి జెప్పిన యా సందేశవాక్కులను విని శ్రీశంకరుడు ''బ్రహ్మచర్యాశ్రమమునున్న నాచే అవశ్యానుష్ఠేయముల్టు. పరిత్యజింపరానివికదా భిక్షాచర్యాద్యా శ్రమధర్మములు. కాన నేను రాజాలన''నెను. గౌరవపురస్సరమగునట్టి మహారాజాజ్ఞ ఆ బాలు నాకర్షింపలేకపోయెను.

99 నుండి 102 మంత్రి తిరిగివచ్చి రాజున కా బాలుని సమాధానమును వినిపించెను. రాజాశ్చర్యచకితుడాయెను- ''ఏమి యీ బాలుని వైరాగ్య సంపద! అసదృశముగదా యీతని యాస్తికత్వము, ఈతని ధర్మ శ్రద్ధ మిక్కిలి కొనియాడతగినది. ఇట్టి యీతడు సత్పురుషులచే నవశ్యము దర్శనము చేయతగినవాడు. నేనే స్వయముగ నాతని దర్శించుటకై వెళ్ళుదును'' అని యాలోచించి, రాజశుఖరుడు వెంటనే పయనించి, కాలట్య గ్రహారమును చేరి యట బ్రహ్మవర్చస్సంపన్నుడును. లోకక్షేమ సంధాయకుడు నగు నా బాలశంకరుని దర్శించి, భక్తినమ్రుడై, ''స్వామీ బ్రహ్మతేజసంపన్నుడవగు నీ దర్శనమున ధన్యుడనైతిని. నన్ననుగ్రహింపుము.'' అని పలికి యిట్లు ప్రార్థించెను.

103. ''ఓ సర్వజ్ఞమూర్తి : భక్త్యుపహృతములగు నీ నా కానుకలను. గ్రహింపుడు. నాచే రచింపబడిన యీ నాటకములను మూడింటిని

ఉపహారాన్‌ గృహాణౖతాన్‌, బ్రహ్మన్‌ సర్వవజ్ఞ రక్ష మాం ||

104. సంస్కృత్య గ్రంథాన్‌ తాన్రాజ్ఞాదత్వా చోపా యనాని చ

పుత్రార్థం పుత్రకామేష్ఠిః కర్తవ్యా శాస్త్రతస్త్వయా ||

105. ఏవం శ్రీశంకరేణోక్తం, శ్రుత్వా, కృత్వాతథా చ సః

పుత్రం లేభే మహారాజ, శ్శిష్యాభూ చ్ఛంకరస్య చ ||

కన్యాదాతృ సమాగమః

106. తేజోరాశిం చ సర్వజ్ఞం, దృష్ట్వైనం సుందరం వటుం

ఆకృష్టా ధనివోనేకే, కన్యాందాతుం సమాయయుః ||

107. అష్టవర్షో ప్యయం బాలో, వాంఛనీయోభవ జ్జనైః

ఉత్కృష్టత్వా చ్చ యోగ్యత్వా, ద్బ్రహ్మలోక జిగీషయా ||

తాము పరిష్కరించియను గ్రహింపుడు. అపుత్రుడనగు నాకు పుత్ర లాభోపాయము నురపదేశించి, మా వంశమును విస్తరింపజేసి నన్ను రక్షింపుడు.''

104. అని యిట్లు రాజు తన్ను ప్రార్ధింప దయాళువగు నా బాల వటువు రాజా నీ తములగు ఉపాయనములనుస్వీకరించి, రాజవిరచితము లగు నా గ్రంథములను తృటికాలములోనే చక్కగ పరిష్కరించి. కానుకలతో సహాయాతని గ్రంథములన నాతని కిచ్చివేసెను. పుత్ర లాభముకొఱకు 'నీవు పుత్రకామేష్కటి చేయు' మని బోధించి, తదను షాన ప్రకారములను శాఏప్రమాణానుసారముగ నుపదేశించి. 'సుపుత్రలాభోస్తు' యని దీవించి యా రాజశేఖరుననుగ్రహించెను.

105. అంత నా రాజు గృహమునుజేరి, శంకరుని యనుగ్రహ లాభమున కానందము నందుచు. శంకరులు తన కుపదేశించిని విధమున పుత్ర కామేష్టి నాచరించి, సత్పుత్రుని పడసెను. అది మొదలు లారాజు శ్రీ శంకరునకు శిష్యుడయ్యెను.

కన్యాదాతల రాక :-

106. తేజోరాశియు. అతి సుందరుడును, సర్వజ్ఞుడును అగు నా వటువును జూచి ఆకృష్టచిత్తులై అనేకులు మహాధనవంతులు కన్‌యలనిత్తుమని రాసాగిరి.

107. బాలుడు ఎనిమిది వత్సరములవాడే యైనను, యోగ్యతచే సర్వోత్కృష్టు డగుటచేతను బ్రహ్మలోక జిగీషువులగు కన్యాదాతల కనేకుల కతడు వాంఛనీయుడయ్యెను. బ్రహ్మలోక జిగీషచేతనే గదా కన్యాపితరులు తమ కన్యలను యోగ్యులగు వరుల నన్వేషించి వారికి నొసగుచుందురు.

108. ఉత్కృష్టా యాభిరూపాయ, వరాయ సదృశాయ చ

అప్రాప్తామపి తాం దద్ద్యా, దిత్యేవం మను రబ్రవీత్‌ ||

109. మాతా వృద్ధా సతీ స్వస్యా, స్సేవార్థం వాంఛతి స్నుషాం

తస్మాత్సాపి వివాహార్థం, పుత్ర మాహూయ చా బ్రవీత్‌

శ్రీ శంకర ప్రతి మాతృవచనమ్‌

110. ధర్మప్రజాది సిద్ధ్యర్థం పితృణామృణముక్తయే

ధర్మశాస్త్ర ప్రబంధేషు, వివాహస్తు విధియతే ||

111. కించ విద్యాధి రాజానాం వంశ సంకీర్తనం సదా

కర్తవ్యం ''మా ప్రజాతంతుం, వ్యవచ్ఛేత్సీ'' రితి శ్రుతి //

112. మమాపి విద్యతే వాంఛా ద్రష్టుం త్వా సం కళత్రకం

వృద్ధాహం స్నుషయా సేవ్యా, తస్మాత్తూర్థగృహీభవ ||

108. మనుస్మృతి యిట్లు చెప్పుచున్నది : 'కులశీల విద్యాప్రాభవాదులచే నుత్కృష్టుడు, సుందరుడు. తమకు సజాతీయుడు నైన వరుడు లబ్ధమైనప్పుడు. తమ కన్యలకు దక్షస్మృత్యాది గ్రంథములలో కన్యలకు వివాహయోగ్య వయస్సుగ నిర్ణయించిన అష్టమ వర్షము [ఎనిమిదివ సంవత్సరము] రాకున్నను ఆ కన్యనిచ్చి వివాహము చేయవచ్చును. అది మహాఫలదాయకము' అని మనువాక్యముకాననే కులశీలాదుల సర్వోత్కృష్టుడు యోగ్యుడు నగు నీతనకికి బాల ప్రాయముననే తమ పసిపాలనైన ఇత్తుమనుచు, ఉత్తమ ఫలార్థులైన గృహస్థులు వచ్చుట తటస్థించెను.

109. శంకరుని తల్లియు వృద్ధయగుటచే కోడలు తొందరలో వచ్చి తన్ను సేవింపగలదను వాంఛగలదియై పుత్రుని పిలచి యిట్లనెను.

శకంకరునితో తల్లి మాట్లాడుట :-

110. ''నాయాన! నీవు వివాహము చేసికొమ్ము. ధర్మప్రజాసంపత్సిద్ధి కొఱకును పితౄణ విముక్తికొఱకును ధర్మశాస్త్రములలోవివాహము విధించబడి యున్నదిగదా''

111. ''మరియు మీ పితామహులు మహాత్ములగు విద్యాధిరాజులు, వారి వంశమును విస్తరింపజేసి వారి విఖ్యాతిని భూమండలమున స్థిరపరుపవలయును. అది అవశ్యకర్తవ్యము. సంతానపరంపరను వృద్ధి పొందింపవలయునేగాని, ప్రజాసాంతత్యమునకు విచ్ఛేదము కలిగింపరాదని శ్రుతియును బోధించుచున్నది గదా!

112. ''నాకును నిన్ను భార్యాసమేతునిగ జూడవలయునని కోరికగలదు. అంతియేకాదు. నేను వృద్ధురాలనైతిని కాన కోడలవచ్చి నాకు

113. యుక్తి యుక్తం వచ శ్రుత్వా, ధర్మయుక్తం చ మాతృతః

మాతరం ప్రత్యువాచైవం, సర్వజ్ఞ శ్శంకర స్సుధీః ||

మాతరం ప్రతి శంకరస్య వచనం

114. ధర్మ జానామి హేమాతః, ధర్మసూక్ష్మం చతత్త్వతః

శృణు వక్ష్యామి తత్సర్యం, యద్‌ జ్ఞాత్వా మోక్ష్యసేశుభాత్‌ ||

115. క్షుత్పిపాసా వ్యవాయాద్యా, నిత్యాః ప్రప్తాశ్చ రాగతః

జంతూనాం చోదనా తత్ర, నక దాపి చ విద్యతే ||

116. స్వేచ్ఛా విహార రోధార్థ, మృషిభి స్సంబ్రవర్తితా

ధర్మానియమరూపా శ్చ, వివాహోపి తధైవహి ||

సేవలొనర్చుటయు నాకపేక్షితమే, కావున నీవు శీఘ్రముగ గృహస్థుడవుకమ్ము'' అని బోధించెను.

113. అంత సర్వజ్ఞుడు సుబుద్ధియునగు శంకరుడు యుక్తియుక్తమలు ధర్మములు నగు నా తల్లి వచనములువిని యిట్ల ప్రత్యుత్తరము చెప్పెను.

శంకరుల సమాధానము :-

114. ''తల్లీ! నేను ధర్మమును ధర్మ సూక్ష్మమును గూడ యధార్థముగ నెరుగుదును. వినుము. నాచే పెప్పబడు నీతత్త్వమును తెలిసికొనిన నీవును అశుభ పరంపరలను దాటగలుగుదువు.

115. ''ఆకలిదప్పికలు, మిధునప్రవృత్తి భయము మొదలగునవి ప్రానిక కోటికిసహజముగనే యేర్పడుచుండును. వానినిశాస్త్రము ఎన్నడును విధింపబూనదు. అనగా 'ఆకలి కలిగినప్పుడు ఆహారమును తీసి కొనుము; దప్పిక కలిగినప్పుడు నీరు ద్రావుము; కామముకలిగినప్పుడు స్త్రీని పొందుము' అని యిట్లు ప్రజలకు విధి శాస్త్రము బోధింపనక్కరలేదు. అట్టి ప్రవృత్తి ప్రజలకు సహజముగనే కలుగుచుండును.

116. ''ఆహారము వివాహము మొదలగువానిని గూర్చిన విధి విషేధ శాస్త్రములు మానవులను స్వేచ్ఛా విహారములనుండి తొలగించటకై ఋషులచే ప్రవర్తింప జేయబడుచున్నవి. అనగా 'ఆహారేచ్చ కలిగిన ఇచ్చ వచ్చిన చొప్పున ప్రతి వస్తువును తినరాదు.

117. వైవాహికో విధి స్త్రిణాం, న తు పుంసా విధి శ్చసః

తేషాం వైవాహికః కామ్యం, ప్రవృత్తిస్తత్ర రాగిణాం ||

118. విరాగిణాం చ ధీరాణా,ం నవివృత్తి శ్చ విధీయతే

నివృత్తి రేవ మోక్షస్య, కారణం ప్రథమం స్మృతం ||

119. ప్రవృత్తి ర్బంధహేతుశ్చ, కారణం జన్మనాం సదా

సంసార కారణం భార్య, తతోజన్మ పరంపరా ||

120. జన్మదుఃఖం జరా దుఃఖం, జాయాదుఃఖం పునః పునః

సంనార నాగరోధుఃఖం, తస్మాత్త్యాజ్యస్సతాం భవః ||

ఈ పదార్థములనే యిప్పుడు ఇట్టి యిట్టి విధానములతో తిన వలసియుండును' అనియు స్త్రీ సంగ్రహేచ్ఛ కలిగినప్పుడు స్వేచ్ఛానుసారముగ గాక ఇట్టి లక్షణములు గల స్త్రీని గ్రహింపుము. ఇట్టి లక్షణములుగల స్త్రీని గ్రహింపకుము. ఈ విధానముననే గ్రహింపుము అని బహువిధ నియమములను బెట్టి, ఆ విధి నిషేద శాస్త్రములు బహుముఖముగ ప్రవృత్తినొందిన మానవుని మన స్సును పరమితములగు విషయములందు మాత్రమే ప్రవర్తింప జేయు తాత్పర్యముతో ప్రవర్తించుచున్నవే కాని 'ఆవశ్యము భుజింపుము! అవశ్యము స్త్రీని సంగ్రహింపుము' అని బోధించుటకు బయలుదేరినవి కావు అని తాత్పర్యము.

117, 118, 119. ''వివాహాము స్త్రీలకు నియతము (అవశ్యకర్తవ్యము): కాని పురుషుకట్లు కాదు. విషయానురాగము కలవారలకుగాని వివాహము- విరక్తులగు ధీరులకు వివాహమవశ్య కర్తవ్యము గానేరదు. అట్టి వారికి నివృత్తిధర్మమాశ్రయణీయము. నివృత్తి మోక్షము నకు ముఖ్యసాధనము. ప్రవృత్తి ధర్మమట్లుగాక బంధమునకు హేతువువగును. ఇష్టనిష్ట-ఉత్తమాధమ జన్మములకును కారణమగును. అట్లే సంసారమునకు మూలకారణము భార్య. సంసారి యగువాడు ప్రకృతికి వశుడై ఎప్పుడును ఎదో ఒక కర్మను చేయుచునే యుండును. ఆ పుణ్యా పుణ్యకర్మల ఫలభోగముకొఱ కతనికి జన్మ పరంపర తప్పదు.

120. ''జన్మ'' గర్భవాసాది క్లేశములతో కూడినదౌటచేత మహాదుఃఖహేతువు. జననాంతర జీవితమును, అత్యంత విరసము-బహువిధ వ్యాధి సంకలితమునైన జర (ముసలితనము) చే నాక్రాంతముకాక మానదు.అట్టి ముసలితనము మరింత దుఃఖహేతువే. అట్లే జాయము నవత్యాదికమును వివేకదృష్టితో నాలోచించిన దుఃఖ

121. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీజఠరే శయనం

ఇహ సంసారో బహుదుస్తారో, బుధజనవేద్య న్తరణో పాయః ||

122. దుఃఖస్య కారణం జన్మ జన్మనః కర్మకారణం

రాగాద్యైర్జాయతే కర్మ, రాగాద్యా శ్చాభిమానతః ||

123. అభిమానోవివేకేన, సోవ్యజ్ఞానా దితిశ్రుణను

ఏవం సంసార ఆయాత, ఇతి వేదాంత డిండిమః ||

124. ఏవం సంసార వృక్షస్య బీజమజ్ఞాన ముచ్యతే

మూలంజాయా, సురాశ్శాఖాః,ఫలం దుంఖమతి ధ్రువం ||

125. స సారేస్మిన్‌ జనైర్యద్యత్‌, సౌఖ్యమిత్యను భూయతే

తత్సర్వం దుఃఖభూయిష్ఠం, సౌఖ్యమాభాసతో భ##వేత్‌ ||

హేతువులేయని తేలగలదు. ఇట్లు దుఃఖహేతువులగు జన్మ జరాజాయాదులవలన నేర్పడుచున్న సంసారసాగరము వివేకి జనులకు బహు జుగుస్సాకరమును, దుఃక కారణమునని స్పష్టపడుచున్నది. కాన జననమరణ పరంపరా లక్షణమగు సంసారము వివేకులకు సర్వధా పరిత్యాజ్యము.

121. ''ప్రవృత్తిమార్గమున నడచువారికి పునః పునః పుట్టుట, గిట్టుట, మాతృగర్భ నివాసాది క్లేశజాలముదాటశక్యముగానిది. కాన పండితుడగావానిచే సంసార తరణోపాయము అన్వేషించి తెలిసికొన దగి యున్నది.

122, 123. ''మరియు తల్లీ! వినుము. దుఃఖమునకు కారణము జన్మ. ఆ జన్మకు జీవానుష్ఠితకర్మకారణము. ఆ కర్మకు రాగద్వేషాదులు హేతువులు. ఆ రాగద్వేషాదులకు హేతువు పాంచభౌతికములౌ దేహాదులయందు ఆత్మత్వాభిమానము. ఇట్టి అభిమానము అవివేకము [వివేకము లేకపోవుట.] వనల సంభవించును. ఆ యవివేకము ఆత్మస్వరూపముయొక్క అజ్ఞానమున నేర్పడును. ఇట్లు ఆలోచించిచూడ సంసారమనునది అజ్ఞానభవము [ఆత్మతత్త్వ సాక్షాత్కారము లేకపోవుటవలన నేర్పడునది] అని స్పష్టపడుచున్నది యని వేదాంతము లుద్ఘోషించుచున్నవి.

124. ''మరియు నో తల్లీ! వినుము. అజ్ఞానమనుబీజము [విత్తనము] అంకురించి సంసారమను వృక్షమేర్పడుచున్నది. ఆ వృక్షమును స్కంథ స్థానీయమైనది భార్య. ఆ స్కంథసముల్లసితములగు శాఖలు సుతులు. ఈ యన్నిటి సారమైనఫలము దుఃఖమే. విజ్ఞానముతో పరికించి చూచిన ఈ సంసారమున సుఖలేశమున్ను కానరాదు.

125. ''సంసారమున సంసారులనుభవించు చున్నామనుకొను సుఖములు. సుఖాభాసములేగాని వాస్తవిక సుఖములుగావు. దుఃఖభూయిష్టములే-

126. మాతస్త్వయోదితం సర్వం, బంధహేతుర్న చాన్యధా;

న్యాసాదేవ మోక్షస్స్యా, దన్యః వన్థాన విద్యతే ||

127. విద్యాధిరాజవంశస్య, కీర్తనం సర్వధా భ##వేత్‌

గ్రన్థైశ్చమను నామ్నాచ, యావచ్చంద్ర దివాకరౌ ||

128. హేమాతః! క్రియతే సేవా, మయైవ తవ మాశుచః

దృష్ట్వా ప్రీతి ర్భవేదేవ. మాం యశశ్చంద్రికాయతంః

129. ఏవం వైరాగ్యయుక్తంమాం, గార్హస్థ్యైమాప్రచోదయ

సన్యాసాశ్రమ సిద్ధ్యర్థ. మనుజ్ఞాందాతు మర్హసి ||

130. సంసార బీజం దగ్ధ్వైవం, జన్మరాహిత్య మాప్నుయాం

పుత్రస్స్యా ద్యది సన్యాసీ, మాతుర్బంధ విమోచనం ||

131. తస్మాదనుజ్ఞాం మే దేహి, సర్యాసార్థంచ ప్రార్థయే

ఏవంపుత్రోదితం తత్త్వం, శ్రుత్వాస్త్రీత్వాద్రురోద సా ||

132. పుత్రాభావాత్సుదీర్ఘేణ, కాలేవాహం చ పీడితా

తతః కష్టేన తపసా, పుత్ర త్వాం ప్రాప్తవ త్యహం! ||

126. ''తల్లీ! నీవు నన్ను 'గృహస్థుడవు కమ్మ'ని యాదేశించితివి. అది యుక్తముకాదు.అట్లగుట బంధహేతువేకాని మోక్షహేతువు కాదు. మోక్షమునకుసన్యాసముకంటె వేరు త్రోవలేదు.'' అని చెప్పి మరియు నిట్లనిరి.

127. 'తల్లీ! నీవు విద్యాధి రాజవంశ ప్రతిష్ఠను గూర్చి పలికితివి. ఆ ప్రతిష్ఠ మద్విరచిత భాస్యాది గ్రంథముల ననుసరించియు, నా ప్రసిద్ధి ననుసరించియు నాచంద్రతారార్కస్థాయి కాగలదు.

128. 'తల్లీ! వృద్ధవగు నీ సేవలను నేనే స్వయముగ జేతును. దుఃఖింపకుము, భార్యాసమేతునిగ నన్ను జూచి యానందింతునంటివి. కాని తల్లీ! దిగంతవ్యాప్త యశశ్చం ద్రికలతో గూడిన నన్ను జూచి నీవు అంతకంటె నధికముగ ప్రీతినందగలవు.

129. 'విరక్తుడనగు నాకు గార్హస్థ్యము నంటకట్ట నుంకింపకుము. సన్యాసాశ్రమ సిద్ధికై అనుజ్ఞనిమ్ము.

130. 'తల్లీ! సంసారబీజమైన అజ్ఞానమును జ్ఞానాగ్నిచే దగ్ధముకావించి జన్మరాహిత్య (మోక్ష) మును పొందగలను. పుత్రుడు సన్యాసియైన తల్లికి బంధవిముక్తి యగునని శాస్త్రము బోధించుచున్నది.

131. 'కాననో తల్లీ! నేను నిన్నుభక్తితో ప్రార్థింతును. నన్ననుగ్రహింపుము సన్యాసాశ్రమ స్వీకరామున కనుజ్ఞనిమ్ము' అని యా బాలుడు తన తల్లికిట్లు తత్త్వమును నుపదేశించుచూ, స్వాభిమతమును వివరింప. విని, ఆమె స్త్రీ యగుటచేత పుత్రవియోగ శంకతో దుఃఖితయై యిట్లనెను.

132. 'నాయనా! పుత్రులు లేకపోవుటచే మొదటచాలాకాలము నేనెంతయో పీడింపబడితిని. తరువాత నెన్నియో క్లేశములకోర్చి వృషాద్రీశ్వ

133. బాల శ్చాష్టవయస్కోద్య, సన్యాసీత్వం భ##వేద్యది

గృహే వాసో నయోగ్యస్తే త్వద్వియోగో7 తిదుస్సహః ||

134. ఆశ్రమార్థమనుజ్ఞాంతే, దాతుం నోత్సహతే మనః

యావజ్జీవామి తిష్టత్వం, గృమేస్మిన్‌ సన్నిధౌమమ ||

135. అశ్రుపూర్ణాంచ దీనాంతాం, ప్రేమపూర్ణాంచ మాతరం

అశ్రుపూర్ణస్సుతః ప్రాహ, గృహే తిష్ఠామి మాశుచః ||

136. మాతునాజ్ఞాం వినా పుత్ర, స్సన్యాసీ న భ##వేదితి

భాతి శాస్త్రస్య మర్యాదా, మాతస్తాం పాల యామ్యహం ||

137. యదా దాస్యస్య నుజ్ఞాం త్వం, తధా న్యాసం కరోమ్యహం

అహో! మాతురిదం ప్రేమ, మాతరః ప్రేమమూర్తయః ||

శ్రీశంకరస్య సన్యసావ్రమ స్వీకారః

138. ఏకదా శంకరో నద్యాం, య¸° స్నాతుం తదా జలే

గ్రాహోగృహీత్వాతత్పాద, మహర్తుముపచక్రమే ||

రుని గూర్చి కష్టసాధ్యములగు ఘోర తపస్సులజేయగా నిన్ను పొందగలిగితిని.

133. నీ వీనాటికి ఎనిమిదియేండ్ల బాలుడవైతివి. ముదుసలివి కావుగదా! నీవు సన్యాసివేయైనచో యీ గృహమున నీవు నివసించుట తగనిపని యగును. అంత నీవునన్ను విడిచపోవుదువు. నీ వియోగము నాకు సహింపరానిదగును.

134. 'కాన సన్యాశ్రమ స్వీకారమునకై నీ కనుజ్ఞనిచ్చుటకు నా మనసు అంగీకరించుటలేదు. కాన, నాయనా! నే నెంతకాలము జీవింతునో అంతకాలము నీవు గృహమున నాయొద్దనే ఉండవలయును.

135 136, 137. అని కంటివెంట దుఃఖాశ్రువులు రాల పలుకుచున్న ప్రేమరస పరిపూర్ణయగు నా తల్లినిజూచి యప్రయత్నముగనే తన కన్నులనుండిగూడ నశ్రువులు రాలుచుండ నా శంకరుడు తల్లితో 'అమ్మా! నే నింటనే ఉందును. నిన్ను నేను సేవించి రక్షించు చుందును. తల్లి ఆజ్ఞ నీయనిది పుత్రుడు సన్యసించరాదని శాస్త్ర సిద్ధాన్తము. ఏనాడు నీవనుజ్ఞనిత్తువో ఆనాడే సన్యసింతును. దుఃఖింపకుము' అని చెప్పి యామె నోదార్చెను. మాతృప్రేమ అసదృశ##మైనది. ప్రేమరస సుధావాహినులుగదా తల్లులు!

శంకరులు సన్యసించుట :-

138. అంత నొకనాడు శంకరుడు స్నానముచేయ నదికిబోయి స్నానము చేయుచుండ, ఆ శంకరుని పాదమును నీటియందున్న ఒక మొసలి పట్టి అతనిని లోపలికి లాగజొచ్చెను.

139. గ్రాహేణ పీడ్యమానం తం, దృష్ట్యా మిత్రాణి మాతరం

ప్రావదన్‌, సాపి దుఃఖార్తా, శీఘ్రం గత్వా దదర్శతం ||

140. రురోద సా తదా బాల ! జీవేయం త్వామృతే కథం

నసన్తికేపి వాత్రాతుం, మత్సుత్రం గ్రాహ పీడితం ||

141. ఏవం రుదంతీం తాం దృష్ట్వా. పుత్రః ప్రాహాంబికే శృణు

మదాయు రష్టవర్షాణి, తానిపూర్ణాని చాధునా ||

142. కింత్వేకో రక్షణోపాయో, భాతి వక్ష్యామి తం శృణు

భ##వేయం యది సన్యాసీ, తన్మే జన్మాంతరంభ##వేత్‌ ||

143. ఏవం యది పునశ్చాహ, మష్టవర్షాణ్యతః పరం

జీవిష్యామి తతోమాత, రంగీకురు మమాశ్రమం ||

144. తదోవాచాం జపా మాతా, స్వీకురుష్వాశ్రమం సుత

యథాకథంవా జీవత్వం, త్వాం సంరక్షన్తు దేవరౌః ||

145. శుత్వానుజ్ఞాం సుతశ్శీఘ్రం, సన్యాసం కృతవాన్‌ తదా

మనసా తత్‌క్షణాదేవ గ్రాహోగంధర్వతాంగతః ||

146. గంధర్వోయ మభూ ద్గ్రాహ, శ్శాసాదాశు వినిర్గతః ||

పాదస్పర్శేన బాలస్య, స్వామిన శ్శంకరస్య చ ||

139-140 మొసలిచే లాగబడుచున్న ఆతనిదురవస్థను సార్శ్వస్థులౌయాతని మిత్రులాతని తల్లికి నివేదించిరి. అంత దుఃఖాక్రాంతయై శీఘ్రముగ నటకు జని, జాపన్నుడైన తన పుత్రునిజూచి ''తండ్రీ నీవు పసివాడవు; నీవులేక నేనెట్లు జీవించగలను, గ్రాహపీడితుడౌ నా పుత్రుని రక్షించు మహాత్ములెవరు నిచటలేరా-రక్షించుడు'' అని మహువిధముల విలపించసాగెను.

141, 142, 143. ఇట్లు విలపించుచున్న తన తల్లితో శంకరు డిట్లనెను. 'ఓ తల్లీ! వినుము. నాకు దైవనిర్ణీతమైన ఆయుర్దాయము ఎనిమిది సంవత్సరములును పరిపూర్ణములయ్యెను. ఇప్పట్టున్న నన్నెవరును రక్షింపజాలరు. దైవము నెదుర్కొన నేరికి సాధ్యమగును. ఐనను తల్లీ నాకొక ఉపాయముతోచుచున్నది. దానిని వివరింతును. వినుము నేనిపుడు సన్యాసాశ్రమమును స్వీకరించినచో అది నాకు జన్మాంతరమే యగును. దానదైవనిర్ణీతమగు నాయువుతో పూన్వజన్ము పూర్తియైనట్లును కాగలదు. అట్లు కాగా నేను మరియొక ఎనిమిది సంవత్సరములు జీవించగలను, కాన తల్లి సన్యాసాశ్రమ స్వీకారమున కనుజ్ఞనిమ్ము'' అనెను.

144. అంత నా తల్లి చేయునదిలేక, పుత్ర జీవితాకాంక్షి యగుటచే ''నాయనా! సన్యసింపుము. ఏవిధముగనైనను నీవుజీవించియుండు టయె నాకభిమతము.'' అని పలికి. ''నీకు క్షేమముగాగాక! సమస్త దేవతలును నిన్ను సదారక్షించుచుందురుగాక'' యనియాశీర్వదించెను.

145. తల్లిముఖమునుండి వెల్వడిన యా యనుజ్ఞావచనములవిని వెంటనే శంకరుడు మానసికముగ సన్యసించెను.

146. అంత నాతని పాదమును గ్రహించిన మొసలి ఆతని పాదములను వదలివేసి గంధర్వుడుగ మారిపోయెను. ఋషిశాపహుతుడగు నొక

147. శంకరో బహి రాగత్య, నమస్కృత్య చ మాతరం

మాతర్గృహే నివాసోమే, త్యాజ్యో గచ్ఛామ్యతో గృహాత్‌ ||

148. వంద్యస్సర్వైశ్చ సన్యాసీ, తేన సన్యాసినా వ్యహో

వంద్యామాతా, తతశ్చోక్తిర్నమాతుః పరదైవతం ||

149. దుస్సహోపి వియోగో7స్య, సహనం చావలంబ్య సా

ప్రాహైవం పుత్ర! గచ్ఛత్వం, కింతుకాచి త్స్పృహాస్తిమే ||

150. మమావ సాన సమయే, భవత్వం మమసన్నిధౌ

కృత్వా మమాంత్య కర్వాణి,సద్గతిం మే ప్రకల్పయ

151. తధైవాహం కరోమ్యంబ, యదాస్మరసి మాంతదా

స్థాస్యామి తవసామీప్యే, మాతర్గచ్ఛామి మాశుచః ||

గంధర్వుడు మొసలియై, తన శాపము సన్యసి¸° శంకరుని పాదస్పర్శమున నివృత్తముకాగలదని తెలిసికొని, యా సమయమునకై నిరీక్షించుచు, ఆ నదియందు నివసించుచుండెను. ఆ మొసలి శంకర పాదస్పర్శమునశాపవిముక్తయై ఇప్పుడు స్వస్వరూపమునుబొందెను.

147. అంత శంకరుడు నదినుండి బయటకువచ్చి తల్లికినమస్కరించి, ''తల్లీ! నేనిపుడు సన్యాసిని.నాకు గృహనివాసము పరిత్యజింప దగినది, కాన గృహమునుండి యెటకేని పోవుచున్నాను. ఇదిగో, నమస్కరించుచున్నాను. నా నమస్కారము నందికొమ్ము.

148. ''తల్లీ! లోకమున నందరిచయేతను నమస్కరింపడగినవాడు సన్యాసి. అట్టి సర్వవంద్యుడౌ సన్యాసిచేతనుగూడ తల్లి నమస్కరింపడగినదై యున్నది కనుకనే ''నమాతుః పరదైవతం''- ''తల్లికంటె నధికమైన దైవము మరేదియునులేదు. అని శ్రుతి నిర్ణయించియున్నది.''

149. అనిచెప్పి తనపాదములకు నమస్కరించుచున్న శంకరునితో నామె, కుమారుని వియోగము సహింప శక్యముకానిదే యైనను, ఎట్లనో ధైర్యము తెచ్చుకొని యిట్లనెను. ''నాయనా! నీ యిష్టము వెళ్ళము. నాదొక కోరిక -

150. నీవు నా అవసానసమయమున నాసన్నిధి నుండవలయును. నా కంతిమ క్రియలనునీవునెరవేర్చి నాకుత్తమగతులను కల్పింపుము.

151. ఇట్లు తల్లి చెప్పగానే ''అమ్మా! అట్లేచేయుదును. సంశయింపకుము నీ వెప్పుడు నన్ను తలచిన నప్పుడు నీ మ్రోల నుండగలను. దుఃఖింపకుము. పోయి వత్తును.''

152. ఏవముక్త్వా పరిక్రమ్య,. త్రిర్నత్వా తాం సభక్తితః

గచ్ఛన్‌ వాణ్యాజ్ఞయా నద్యాఃకృష్ణాలయ మపాలయత్‌ ||

గోవింద భగవత్పాదం ప్రతి గమనం

153. స్వీకర్తుం విధివ స్న్యాసం, గురుభ్యో నర్మదాతటే

గోవింద పూజ్య పాదేభ్యో, గతవానుత్తరాం దిశం

154. నర్మదాం ప్రాప్య తత్రత్యాస్‌,దృష్ట్యా ఋష్యా శ్రమాంస్తదా

గోవిందస్య గుహాం ప్రాప్య, క్షేత్రే తత్రామలేశ్వరే ||

155. గోవింద భగవత్పాదం, సమాధిస్థం గురూత్తమం

దృష్ట్వా77నం దనిమగ్నో7 సౌ, స్తోతుం సముప చక్రమే ||

156. స్తోత్రై రుత్థాయ నిష్ఠాయా దృష్ఠ్వా బాలం యతింపురః

''కస్త్వం బాలేతి'' సంపృష్టః, ప్రత్యువాచేద మర్భకః

157. నాహం దేహో నేంద్రియాణి, మన ఆదీని హేగురో

నపృధివ్యాదయ శ్చాహం, కింతు బ్రహ్మాస్మి నిర్గుణం ||

152. అని పలికి, శకంరుడు తల్లికి ప్రదక్షిణ పురస్సరముగ ముమ్మారు నమస్కరించి, వెళ్ళుచు, మార్గమధ్యమున ఆకాశవాణి పలుకుల ననుసరించి, నదీ ప్రవాహమువలన భంగమునొందిన కృష్ణాలయ మును పునరుద్ధరించి రక్షించెను.

గోవింద భగవత్పాదులను కలిసికొనుట :-

153. తరువాత శంకరుడు గురువులనుండి శాస్త్రసమ్మతమైనరీతిని సంప్రదాయ సిద్ధముగ సన్యాసమును స్వీకరింపదలచి, గోవింద భగవత్పూజ్యపాదులనుతనకు గురువులుగా నిశ్చయించుకొని. వారు నర్మదా తీరమున బ్రహ్మనిష్టులైఔ నివసించుట యెరిగి, అటబోవసమకట్టి ఉత్తరముగ పయనించి-నర్మదా తీరమునకు క్రమముగ జేరెను.

154, 155. అట నా నదీతీరముననున్న ఋష్యాశ్రమముల నాతడు పరికించుచూ. తన్నదీ తీరస్థమగు నమలేశ్వర క్షేత్రమున నున్నగోవిందపూజ్యపాదలు నివసించు గుహనుచేరి, యటబ్రహ్మ నిష్ఠాసమాధి యందున్న యా గురూత్తంసునిజూచి యానందాంబుధి మగ్నుడై బహువిధములుగ నాగురూత్తముని స్తుతింప జొచ్చెను.

156. అస్తోత్రపాఠములతో సమాధినుండి వ్యుత్థానమునొంది యాబ్రహ్మనిష్ఠుడు, యెదుటనున్న యాబాలయతినిజూచి ''ఓయీ! బాలకా! నీవెవరవు?'' అని యడుగగా, నాబాలయతి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

157. హేగురో! నేను దేహమునుకాను, ఇంద్రియములుకాను దేహేంద్రియప్రవర్తకమగు మనోబుద్ధ్యాదులునుకాను, దేహేంద్రియాది మూలమగు పంచభూతములునుకాను, దేశకాలాది పరిచ్ఛేది విరహితమును నిర్గుణమును, సచ్చిత్సుభైకరసమునునైన బ్రహ్మమును.

158. న పితా నచమేమాతా, నామగోగ్రాదికం నమే

నమే వర్ణాశ్రమాదిర్వా కింతు బ్రహ్మాస్మి కేవలం ||

159. శంకరస్య ముఖాదేవం, దశశ్లోకీ వినిర్గతా

కేవలాద్వైత సిద్ధాంత, సారభూతాస్థిరాక్షరా ||

160. శ్రుత్వా తేనోదితం తత్త్వం, దృష్ట్వా దివ్యేనచక్షుషా

జ్ఞాత్వాతం శంకరం సాక్షా, ద్గురుస్తుష్టో7బ్రవీదిదం ||

161. అద్యమే సఫలం జన్మ ప్రాప్తంమే తపసః ఫలం

బ్రహ్మ విద్యా ప్రదానార్థం, శిష్యోలబ్ధో7ద్యమే శివః ||

162. నారాయణ సమారంభా,పరాశరసుమధ్యమా

మత్పర్యంతా గురూణాం, నో, వర్తతే యా పరంపరా ||

163. ఏషా పరంపరా ధన్యా, కృతకృత్యా స్థిరా భ##వేత్‌

శంకరాచార్య వర్యేణ, యావ చ్చన్ద్ర దివాకరౌ ||

164. తతోహృష్టస్తు గోవిందో, దత్వా న్యాసం యధావిధిః

కృత్వా తస్యోపదేశంచ, మహావాక్యాను సారతః ||

158. ''మరియు హేగురో! నేనుతల్లి, దండ్రి, గోత్రము, నామము, వర్ణము ఆశ్రమము మొదలగునవి ఏవియును లేనివాడను. నేను నిర్వికారుడను. కేవలముఅసంగచిన్మాత్రమునగుబ్రహ్మవస్తువును.

159.160. అని యిట్లుసర్వోపనిషత్సార భూతప్రత్యగభిన్న బ్రహ్మతత్త్వావ బోధకములగు పదిశ్లోకములు సమాదానరూపమున నా బాలయతి ముఖమునుండి బయల్వెడలగా, ఆ శ్లోకములనువిని, అతని తత్త్వాను భూతి కానందించి, తన యమోఘమగు దివ్యనేత్రమున నా బాల యతినిజూచి, కైలాసవాసియగు శంకరుడే యీతడని గ్రహించి, సంతుష్టాంతరంగుడై యిట్లనెను.

161. ''ఈనాడుగదా నా జన్మము సఫలమయ్యెను. తా తపస్సులు ఫలించెను. బ్రహ్మవిద్యా ప్రదానముచేయుటకు నాకు తగిన అదనుదొరకెను. సాక్షాత్పరశివుడే నాకిపుడు యీ శంకరరూపమున శిష్యుడుగా లభించెను.

162. శ్రీమన్నారాయణునితో ప్రారంభ##మై, శ్రీ వేదవ్యాసుని తండ్రి యగు పరాశరుడు మధ్యముననుండి ప్రవర్తింపజేయ,నావరకు నవిచ్ఛిన్నముగ వచ్చిన నా యీయద్వైత విద్యాగురు. పరంపర ధన్యము కాగలదు. ఆ చంద్రతారార్కస్థాయియై స్థిరము కాగలదు.''

163, 164, 165. అని తలచి, మహానంద సంభరితులై, గోవింద భగవత్పూజ్య పాదులవారు శంకరునకు యధాక్రమముగ సన్యసము ననుగ్రహించి గురుపరంపరా ప్రాప్తమగు బ్రహ్మవిద్యను ఔపవిషదములౌ మహావాక్యముల ననుసరించి ఉపదేశించి, గురుపరంపరను. తద్గత సంప్రదాయ విశేషములను అద్వైత విద్యారహస్యములను కూలంకషముగ బోధించి, అద్వైతతత్త్వజ్ఞాన సామ్రాజ్యమున నాతని నభిషిక్తుని జేసి, యాశీర్వదించి, యవశ్యానుష్ఠేయములైఔ యతిధర్మములనుగూడ సంపూర్ణముగ నుపదేశించిరి.

165. పరంపరాం బోధయిత్వా,కృత్వా తస్యాభిషేచనం ||

జ్ఞానరాజ్యే, తమాశాస్య, కర్తవ్యం తస్య చాదిశత్‌ ||

166. శంకర శ్చాశ్రమే తత్ర, శుశ్రూషాం శ్రవణాదికం

కుర్వన్‌ భిక్షాటనం భక్త్యా, కంచిత్కాలమువాస సః ||

167. తత్రోషిత దినే ష్వేష, భిక్షార్థంచైకదా చరన్‌

గ్రామే దదర్శ తన్నద్యాః, ప్రవాహ మతిభీకరం ||

168. త్యక్త్వా గృహీణి సర్వాణి, ప్రాణ భీత్యా జనాస్తదా

దృష్ట్వా బాలం యతిం శాంతం, శంకరం శరణం గతాః ||

169. శంకరో గురు మాసాద్య, దృష్ట్యా తం యోగసంస్థితం

స్మృత్వాం తం నర్మదాం థ్యాత్వా, ప్రవాహం కరకే7గ్రహీత్‌

170. అహో! శంకర మాహాత్మ్యం, శంకరః పరమేశ్వరః

నోచేత్కథం నిగృహ్ణీయాత్‌, ప్రవాహమతిభీకరం ||

171. ఏవంతే రక్షితాస్సన్తో వదన్తోవిస్మితా జరాః

గోవింద భగవత్పాదం, దృష్ట్వా తమవదన్‌ ముదా ||

166. అంత శంకరుడు భక్తితో గురు శుశ్రూష గావించుచూ, యథాశాస్త్రముగ శ్రవణ, మనన, విధి ధ్యాసనముల నిర్వర్తించుచున్న వాడై భిక్షాటనమున దేహయాత్ర నడుపుచు, గురువుల యావ్రమము నందే కొంతకాలము నివసించెను.

167. అట్లు నివసించుచున్న రోజులలో నొకనాడు భిక్షార్ధము గ్రామమున తిరుగుచుండగా నర్మదానదిపొంగి యతిభయంకర రూపమున గ్రామమును ముంచునట్లు ప్రవహించుట నా శంకరుడు గాంచెను.

168. అంత నా శంకరుడు గురుసన్నిధికివెల్ళి. సమాధిస్థితుడైయున్న గురునిదర్శించి. మనుసున నా గురుమూర్తిని స్మరించి, భయార్తులై తన్ను శరణుపొందిన గ్రామవాసుల రక్షింపనెంచి, నర్వదానదీ దేవతను ప్రార్థించి, ఆ నదీ ప్రవాహమునంతను తన కమండలములోనికి గ్రహించి వేసెను.

169. అంత నా జనులందరును శ్రీ శంకరునిచే రక్షింపబడినవారై, ఆనందాశ్చర్యములతో ''ఏమీ యీ శంకరుని మహాత్మ్యము. నిజముగ శంకరుడు సాక్షాత్పరమేశ్వరుడే, కాకున్న నెట్లీతడు మహాభయంకరమగు నీ నదీజలమునంతను, తనజలపాత్రములోనిరి గ్రహించ గలుగును?''

171. అని పలుకుచు. శ్రీ గోవింద భగవత్పాదులజేరి ఆశ్చర్యకరమగు నీ వృత్తాంతమును ఆనందముతో వారికి నెరుకపరచిరి.

172. శ్రుత్వా శంకర మహాత్మ్య, మువాచేదం గురుస్తదా

పురావ్యాసస్స్వ సూత్రాణాం, భాష్యంకర్తుం మయార్థితః

173. ఉవాచ మాం బ్రహ్మలోకే, గోవింద! శృణు, శంకరః

కలౌచ మానుషో భూత్వా, తవ శిష్యో భవిష్యతి ||

174. నర్మదాయాః ప్రవాహం స, గ్రహిష్యతి కమండలౌ

తదా తం శంకరం విద్ధి, భాష్య కర్తా స ఏవహి ||

175. దక్ష స్స ఏవ నా న్యోస్తి, భాష్యం కర్తుం కలౌ యుగే

ధన్యా భవతి తేనైవ, బ్రహ్మ విద్యా పరం పరా ||

176. ఇదానీం త్వామహం జానే, శిష్యం వ్యాసోదితం పురా ||

ప్రస్థాన త్రయ భాష్యాణి, కాశీం గత్వా కురుష్వ భోః ||

శ్రీశంకరస్య కాశీక్షేత్రనివాసః

177. గురూపదేశం స్వీకృత్య, చా7నుజ్ఞాం తద్గురో స్తదా

శంకరో గతవాన్‌ కాశీం, సో7వస్తత్ర వైముదా ||

178. విశ్వేశ దర్శనం కాశ్యాం, గంగాస్నానం దినే దినే

తత్వ బోధం చ కుర్వన్‌ స, సు ప్రతిష్ఠాం చ లబ్ధవాన్‌

179. తత్రత్యాః పండితా స్తస్య, దృష్ట్యా ధీశక్తిమద్భుతాం

విశ్వేశ్వ రావతారో7య, మితి విస్మయ మాయయుః ||

172 నుండి 175.అంత నా గురుదేవుడు శంకరుని మాహాత్మ్యమును గూర్చి విని ఆతనితో నిట్లనెను. ''పూర్వమొకప్పుడు బ్రహ్మలోకమున వ్యాసభగవానుడు స్వవిరచిత సూత్రములకు భాష్యరచనచేయ నాచే ప్రార్థింపబడినవాడై ''గోవిందా! వినుము. కలియుగమున పరమేశ్వరుడౌ శంకరుడు, మానవరూపమును దాల్చి నీకు శిష్యుడు కాగలడు. నర్మదానదీ ప్రవాహము నాతడుతన కమండలములోనికి గ్రహించగలడు.అతడే మానుషరూపమును ధరించి వచ్చిన పరమేశ్వరరుడని నీవుతెలిసికొమ్ము. మా సూత్ర ములకు భాష్యకర్తయాతడే. కలియుగమున బ్రహ్మసూత్రములకు భాష్యము రచింప నాతడొక్కడే సమర్ధుడు. అతనిచే బ్రహ్మవిద్యా పరంపర ధన్యము కాగలదు.'' అని చెప్పెను.

176. నాకు వ్యాసభగవానుడు సూచించిన ఆ శిష్యుడు నీవేయని నేనిపుడు తెలిసికొనుచున్నాను. నీవు సత్వరము కాశీక్షేత్రమునకేగి, ప్రస్థాన త్రయ భాష్యములను రచింపుము'' అనిరి.

శంకరుల కాశీక్షేత్ర నివాసము :-

177, 178. అంత శంకరుడు గురూపదేశమును గ్రహించి. వారిచే ననుజ్ఞాతుడై కాశీక్షేత్రమునకేగి యట నివసంచుచు, దినదినము గంగా స్నాన విశ్వేశ్వర దర్శనాదుల జేయుచు స్వసమీపాగతలగు జిజ్ఞాసువులకు తత్త్వావబోధము కలిగించుచు, నాక్షేత్రమున గొప్ప ప్రతిష్ఠకలవాడాయెను.

179. కాశీక్షేత్రమున పండితులందరు ఈ బాలకుని యొక్క అసదృశమగు బుద్ధి సామర్ధ్యాదులనుజూచి, ఆశ్చర్యచకితులై ఈతడు విశ్వేశ్వరావతారమేకాని, మానవమాత్రుడు కాదని నిశ్చయించుకొను చుండిరి.

180. ఏకదా బాలక శ్చైక స్తం నమస్కృత్య భక్తితః

ప్రాహేదం ''స్వామిన శ్చోళ##దేశీయో బ్రాహ్మణోహ్యహం

181. కావేరీ వాస్తవ్యో వేదశాస్త్రాణ్య ధీతవాన్‌,

వైరాగ్యేణా గతో7స్మ్యద్య శిష్యం మాం స్వీకురుప్రభో!''

182. దృష్ట్వా తం శంకర స్తస్య, జ్ఞాత్వా వైరాగ్య సంపదం

సన్యాసార్హం చ తం బుద్ధ్వాసన్యాసం దత్తవాంస్తతః ||

183. అయం సనందనః ఖ్యాత, స్సూక్ష్మ బుద్ధిశ్చ భక్తిమాన్‌

ముముక్షుశ్చ క్రమేణౖవం, శిష్యా ఆసం శ్చతుర్దశ ||

184. తే సర్వే స్యవసం స్తత్ర కుర్వన్తశ్శ్రవణాదికం

చకాశేశంకర శ్ఛాత్రైః కిరణౖశ్చ రవిర్య థా ||

185. ఏకదా శంకర శ్శిషై#్శ,ర్యుక్తో గచ్ఛన్‌ దదర్శ సః

పఠంతం ''డు కృఞ్‌ కరణ'' వైయాకరణ పండితం ||

186. మూఢం తం శంకరోజ్ఞాత్వా, బోధనా యోపచక్రమే

యచ్ఛాస్త్రం పఠ్యతేవిద్వన్‌! త్వయా తద్విద్ధి నిష్ఫలం ||

180, 181. అంత నొకదినమున నొక బాలకుడు శంకరసన్నిధికి వచ్చి, భక్తితో నమస్కరించి, ''స్మామీ! నేను చోళ##దేశీయ బ్రాహ్మణుడను. కావేరీతీర వాస్తవ్యుడను. వేదములను శాస్త్రములను కూలంకషముగ నధ్యమనముచేసినవాడను. వైరాగ్యముదయింప మీ శిష్యత్వమును వాంఛించి, యిటకు వచ్చితిని. నన్ను శిష్యునిగా పరిగ్రహించి యనుగ్రహిపుడు'' అని ప్రార్థించెను.

182. అంత శంకరు లాతనిజూచి, యాతని దృఢవైరాగ్య సంపన్నునిగా సన్యాసాశ్రమ స్వీకారార్హత గలవానినిగా గ్రహించి ఆతనికి సన్యాసము నిచ్చిరి.

183. అతనిపేరు సనందనుడు, ప్రశస్తమగు గురుభక్తిగలవాడు. కుశాగ్రబుద్ధి. తీవ్రమోక్షేచ్ఛకలవాడు. ఇట్లు ఒకరివెంట నొకరుగ వెంటనే పదునలుగురు ప్రఖ్యాతపురుషులు, వైరాగ్యాద్యుత్తమ గుణసంపన్నులు, నానా దేశవాసులు, క్రమముగ నటకువచ్చి శంకరునకు శిష్యులైరి.

184. వారందరు యథావిధిగ గురుడగు శంకరుని సన్నిధానమున శ్రవణాదికముల నెరపుచు నచటనే యుండిరి. బహు సంఖ్యాకులగు నా శిష్యులచే పరివేష్టితుడైన ఆ శంకరుడుసహస్రకిరణుడగు సూర్య భగవానునివలె నాకాశీక్షేత్రమున ప్రకాశించుచుండెను.

185. ఒకనాడు శిష్యగణ పరివృతుడై విధివెంట నడచుచున్న శంకరుడు ''డుఞ్‌-కరణ'' యని పఠించుచున్న ఒక వ్యాకరణ పండితుని జూచెను.

136 to 190. ఈతడు విద్వాంసుడయ్యును, తత్త్వజ్ఞాన శూన్యుడుగ నున్నాడని గమనించి యాతనికి తత్త్వబోధ చేయ నారంభించెను. ''ఓ విద్వాంసుడా! నీవు శాస్త్రమును బహుశ్రమలకోర్చి యధ్యయనము చేయుచుంటివి. ఇది యంతయు వ్యర్థము. శబ్ధశాస్త్రమున నీవుకృషిచేయుచుంటివి. ఈ శాస్త్రమును. ఈశాస్త్రమునకు విషయమైన శబ్దజాలమును దుర్గమమగు మహారణ్యమువలె చిత్త భ్రమణమునకు కారణమగును - గాని, దీనివలన ముక్తి లభించదు. ఇది కేవలము అంగశాస్త్రము మాత్రమే. అంగిశాస్త్రము వేదాంతము. అది ప్రధానమైనది. ఆ వేదాన్తశాస్త్రము గురుసమ్ముఖమున శ్రవణము చేయదగినది. దాన జ్ఞానంము లభించగలదు. జ్ఞానముచేతనే ముక్తిలభించునుగాని, సాధనాంతరమునలభించనేరదు. మోక్షోపయోగి జ్ఞానసాధనములలో భక్తి ముఖ్యతమమైనది. కాన నో పండితుడా! ''గోవిందుని భజింపుము'' అని ''భజగోవిందం'' అను మకుటముతో పన్నెండు శ్లోకముల రచించి, తద్ద్వారా తత్త్వమును బోధించి. యా విద్వాంసుని యజ్ఞానమును తొలగించెను.

187. శబ్దజాలం మహారణ్యం, చిత్త భ్రమణకారణం

అంగశాస్త్రేణ చైకేన, నముక్తిర్టభ్యతే క్వచిత్‌

188. విద్ధ్యంగి శాస్త్రం వేదాంతం శ్రవంన గురు సన్నిధౌ

కర్తవ్యం తస్య శాస్త్రస్య జ్ఞానం తేనైవ జాయతే ||

189. జ్ఞానా దేవతు కైవల్యం, పన్థా నాన్యో7త్ర విద్యతే

జ్ఞాన కారణ సామగ్ర్యాం, భక్తి రేవగరీయసీ ||

190. తస్మాద్భజ సదా విద్వన్‌! గోవింద మితి సమ్మతైః

శ్లోకైస్తత్వం బోధయిత్వా, చావిద్యాంతస్య చాచ్ఛినత్‌ ||

191. ఏకైకేన చశ్లోకేన, శిష్యా స్తస్య చతుర్దశ

బోధయామాసురద్వైత, తత్త్వం హృద్గ్రంధి భేదకం ||

192. ఇదం మంజరికాస్తోత్రం, జ్ఞాన వైరాగ్య బోధకం

తేన సంజాయతే బోధః పాణిస్థామలకం యథా ||

శ్రీశంకర ప్రతి చండాలవేషేణ విశ్వేశ్వరాగమనం

193. శంకరశ్చైకదా గంగాం, గచ్ఛన్‌ దృష్ట్వా చ పుల్కసం

శ్వానయుక్తం చ ప్రాహేదం, ''రే దూరం గచ్ఛ పుల్కస|''

యధ్యయనము చేయుచుంటివి. ఇది యంతయు వ్యర్ధము. శబ్దశాస్త్రమున నీవు కృషిచేయుచుంటివి. ఈ శాస్త్రమును, ఈ శాస్త్రమునకు విషయమైన శబ్దజాలమును దుర్గమమగు మహారణ్యమువలె చిత్త భ్రమణమునకు కారణమగును - గాని, దీనివలన నీకు ముక్తి లభించదు. ఇది కేవలము అంగశాస్త్రము మాత్రమే. అంగిశాస్త్రము వేదాంతము. అదిప్రథానమైనది. ఆ వేదాన్తశాస్త్రము గురుసమ్ముఖమున శ్రవణము చేయదగినది. దాన జ్ఞానము లభించ గలదు. జ్ఞానముచేతనే ముక్తిలభించునుగాని, సాధనాంతరమునలభించనేరదు. మోక్షోపయోగి జ్ఞానసాధనములలో భక్తి ముఖ్యతమమైనది. కాన నో పండితుడా! ''గోవిందుని భజింపుము'' అని ''భజగోవిందం'' అను మకుటముతో పన్నెండు శ్లోకముల రచించి, తద్ద్వారా తత్త్వమును బోధించి, యా విద్వాంసుని యజ్ఞానమును తొలగించెను.

191. అదే సమయమున శంకర శిష్యులు పదునలుగురును. ఒక్కొక్క రొక్కొక్కశ్లోకము చొప్పున మరి పదునాలుగుశ్లోకములనుచెప్పి యా పండితునకు హృదయగ్రంధి విచ్ఛేదకమగు నద్వైత తత్త్వమును భోదించిరి.

192. ఈ మొత్తము శ్లోకములకు ''మంజరికా స్తోత్ర''మని పేరు. ఇది జ్ఞానవైరాగ్యములనుకలిగించి, కరతలామకమువలెతత్త్వమును స్ఫుటముగ బోధింపగలదు.

ఈశ్వరుడు చండాల వేషమున వచ్చుట:-

193. ఒకనాడు శంకరుడు స్నానమునకై గంగకు పోవుచుండ, మార్గమధ్యమున కుక్కలను వెంటనిడుకొని వచ్చుచు, నొక చండాలుడు సమీపించుట జూచి, 'ఓచండాలుడా! దూరముగ పొమ్ము' అని అనెను.

194. చండాలరూపస్తచ్ఛ్రుత్వా, ప్రహసన్నిద మబ్రవీత్‌

కం గచ్ఛేతి భవా నాహ, శరీరం వాశరీరిణం ||

195. పంచ భూతాత్మకో దేహ స్సర్వ భూతేషు దృశ్యతే

దేహీతు సర్వ దేహేషు, నిత్య శ్చైక స్సనాతనః ||

196. యతివ ద్దృశ్యసే స్వామి న్నాత్మ విద్వచ్చ భాసి భోః

తథాచేద్వదయుక్తం వా, హ్యేవం వక్తుం తవాజ్ఞపత్‌ ||

197. తచ్ఛ్రుత్వా పుల్కసోనాయ, మితి మత్వాద సో7బ్రవీత్‌ ||

న దేహీ నచ దేహోవా, మయా హ్యుక్తో7ధునా శృణు ||

198. జన స్సామాన్యతో లోకే, దేహతాదాత్మ్యవాం స్తతః

తాదృశం జన ముద్ధర్తుం. ధర్మశాస్త్రం ప్రవర్తితం ||

199. తాదృశం త్వా మహం మత్వా, ధర్మశాస్త్రాను సారతః

మయా హ్యుక్తో7 ద్య జానే త్వాం, సత్వం సామాన్య మానవః ||

200. దేహాత్మభ్రాంతి రహీతా, స్సర్వత్ర మసదర్శిత ః

సర్వాత్మ భావ సంపన్నా, నూనం తే గురవో మమ ||

194. వెంటనే ఆతడు శంకరుని మాటలువిని నవ్వుచు నిట్లనెను. 'ఏమీ దూరుముగ పొమ్మంటివే? నా దేహమునా? లేక దేహమున గోచరించు దేహి (జీవు)ని దూరముగ పొమ్మంటివా? దేహము పృధివ్యాది పంచభూతముల పరిణామముగదా. అది సర్వప్రాణులకు సాధారణమే.

195. 'మరియు, దేహియైతే, సర్వదేములయందు ఆతడు గోచరించుచున్నాడు. ఆతడు అద్వితీయుడు; నిత్యుడు; సనాతనుడును.

196. 'ఓ స్వామీ! నీవు యతివలెను. ఆత్మవేత్తవలెను గూడ కాన్పించుచున్నావుగదా! ఇదియేమి? అజ్ఞునివలె నిట్లంటివి?' అని యిట్లుపలుచున్న నా పుల్కసుని మాటలు విని. ఇతడు చండాలుడు కాదని తెలిసికొని యా యతివరుడిట్లనెను.

197. 'అయ్యా! దూరముగ పొమ్మ'ని నే నన్నది దేహమును మాత్రమే గాని, ఆ దేహమున గోచరించు దేహిని (ఆత్మను) ఉద్దేశించి మాత్రముగాదు. నా భావములను వివరింతును; వినుము.

198, 199. 'సామాన్యముగ జనుడు దేహతాదాత్మ్యమును పొందినవాడై యుండును. అట్టివారి నుద్ధరించుటకై ధర్మశాస్త్రములు మహాత్ములచే ప్రవర్తింప జేయబడుచున్నవి. నిన్నును అనాత్మయగుదేహాదులయందు మిధ్యా రూపమగు నాత్మతత్వాభిమానముగల ప్రాకృత మానవునిగ నెంచి, ధర్మశాస్త్ర నియమముల ననుసరించి, నాచే నట్లు పలుకబడినది. నీవు సామాన్య మానవుడవు కావని యిపుడు గుర్తించితిని.

200. 'ఓయీ! దేహాత్మ భ్రాంతిలేనివారు. సర్వమును సమమగు బ్రహ్మవస్తువును దర్శించువారు. సర్వ ప్రపంచ కల్పనాధిష్ఠాన మగు నాత్మస్వరూపము నెరిగినవారును, వారెవరైనను నాకు గురువులేయని నిశ్చయము.

201. తాదృశానాం వర్ణభేదః, నో జాతిర్నైవ చాశ్రమః

త ఏవ పండితా జ్జేయా, నూనం తే గురవో మమ ||

202. చండాలే బ్రాహ్మణ వాపి, బ్రహ్మవశ్యంతి యే జనా ||

ఆత్మరామాశ్చ యే భాంతి, నూనంతే గురవో మమ

203. బ్రహ్మైవ సత్యం నాన్యత్తన్మాయయా కల్పితం జగత్‌

ఏవం ధియా చబ్రహ్మిష్ఠా యే తే మే గురవ శృణు ||

204. మనీషా పంచకాఖ్యేన, శ్లోక పంచక శోభినా

సాష్టాంగం ప్రణిపత్యా హ, హ్యాత్మతత్త్వం చ శంకరః ||

205. తదా శ్రీ శంకరో7పశ్య, దగ్రతో నైవ పుల్కసం

నాపి నా శునకాన్‌ కింతు, కాశీ విశ్వేశ్వరం ప్రభుం ||

201. ''అట్టివారలే పండితులు, వారికి జాతివర్ణాశ్రమాది విశేషములతో ననుబంధముండదు. అనాత్ములగు దేహాదులయందు అధ్యాస (ఆత్మత్వ భ్రాంతి) వారికి నివృత్తమగును. అట్టి వారెవరైనను నాకు గురువులని నా నిశ్చయము.

202. ''మరయు బ్రాహ్మణ చండాలా ద్యుత్తమాధమాది రూపముల నానా విధములగు నుపాధులయందు అనుగతమై సాక్షీభావమున వెలుగు ప్రత్యగభిన్న బ్రహ్మస్వరూపము నెవరు గుర్తించి యాత్మారాములై వెలుగుచున్నారో, వారు నాకు గురువులేయని నా నిశ్చయము.''

203. ''బ్రహ్మయే సత్యము, త్రికాలబాద్యము, నిర్వికారము. తద్భిన్నముగ భాసించుచున్న ఉత్పత్తి వినాశశాలి¸° నీ దృశ్య ప్రపంచ మంతయు మాయచే కల్పింపబడి (అధ్యస్తమై)నది. కాన నది మిధ్యాభూతము అను నివ్చయజ్ఞానముతో కృతకృత్యులై బ్రహ్మ నిష్ఠులగు మహాత్ములెవరు గలరో వారందరు నాకు గురువలేయని నా నిశ్చయము.''

204. అని యిట్లు ఆత్మతత్వ ప్రతిపాదకమగు ''మనీషా పంచక'' మను పేరుగల స్తోత్రమును పఠించుచు, శంకరుడావచ్చిన వ్యక్తికి సాష్టాంగ నమస్కారము జేసెను.

205. అట్లు నమస్కరించి లేచి చూచునప్పటికి ఆ పుల్కసుడుగాని అతనితోనున్న ఆ శ్వానములుగాని శంకరునకు గానరాలేదు. కాని మూర్తిమంతమైన వేదములచే పరివేష్టింపబడిన శ్రీ విశ్వేశ్వర ప్రభువు, కల్యాణరూపుడు కానవచ్చెను.

206. వేదై ర్యుక్తం శివం దృష్ట్వా, భక్త్వా, స్త్యుత్వాతమ బ్రవీత్‌.

అద్యమే సఫలం జన్మ, భవత్సం దర్శనా ద్విభో; ||

207. దేహ బుద్ధ్యాతుదా సో7హం, జీవబుద్ధ్యా త్వదంశకః

ఆత్మ బుద్ధ్యాత్వ మేవాహ, మితి మే నిశ్చితా మతి ||

208. విశ్వేశ్వర స్తదో వాచ, కృత మేపం మ యా తవ

పరీక్షార్థం ప్రహృష్టో7స్మి, మదనుగ్రహ భాగ్భవ ||

209. బదరీం గచ్ఛ సేవస్వ, తత్ర నారాయణం ప్రభుం

ప్రస్థానత్రయ గ్రంథానాం, కురు భాష్యా ణ్యనంతరం ||

210. లోకేస్థాపయ చాద్వైతం ,మతా న్యన్యాని ఖండయ

బౌద్ధాదీన చ సర్వాణి, తతో మాం ప్రాప్స్యతే భవాన్‌ ||

భాష్య రచనార్థం బదరీం ప్రతి గమనం

211. తదాదేశం పురస్కృత్య, గత్వా7 సౌ బదరీం తతః

నారాయణం చ సంసేవ్య, కర్తుం భాష్యం ప్రచక్రమే ||

212. ద్వాదశాబ్ద వయస్కో7యం, ద్వాదశాదిత్యదీప్తిమాన్‌

తదా శ్రీశంకర శ్చాసీ, ద్యదా భాష్యం ప్రచక్రమే ||

206, 207. అంత నత్యంత భక్తితో పనాదేవుని స్తుతించి, ''ప్రభో! మీ దర్శన మున నా జన్మము సఫలమయ్యెను ప్రభూ! దేహమునబట్టిచూడ నేను నీకు దాసుడను, దేహమున గల యీ జీవునిబట్టిజూడ నేను నీ యంశమును. ఓ ప్రభూ. వాస్తవముగ నాత్మ తత్త్వమునుబట్టి జూడ. నీవే నేను (జీవేశ్వరులకు భేదము ఉపాధినిబట్టి గాని, వాస్తవముగ కాదుగదా) ఇది మానిశ్చయము'' అని తన భావ మును వెల్ళడించెను.

208. అంత శ్రీవిశ్వేశ్వరుడు శంకరునితో నిట్లనెను. ''ఓయీ. శంకరా! నిన్ను పరీక్షంచుటకై నే నిట్లు చేసితిని. నీ యనుభూతికి నేనానందించితిని. మా యనుగ్రహమునకు నీవు పాత్రుడవైతివి.

209. ''ఓ శంకరా, నీవు బదరికాశ్రమమునకు పొమ్ము. అచట సన్నిహితుడైయుండు ఆ నారాయణ ప్రభువును సేవించుము. తరువాత ప్రస్థానత్రయ భాష్యములను రచింపుము.

210. లోకమున వైదికమగు నద్వైతమును సుప్రతిష్ఠితముగజేయుము. బౌద్ధాదికములగు నవైదికమతమలు ఖండిపుము. అనంతరము నీవు నన్ను పొందగలవు.'' అని యాదేశించెను..

భాష్యరచనకోఱకు బదరికేగుట :-

211. అంత శ్రీ విశ్వేశ్వరుని ఆదేశము ననుసరించి శంకరుడు బదరి కాశ్రమమునకు వెళ్ళి, శ్రీ నారాయణ ప్రభువును సేవించి, భాష్య రచనమున కుపక్రమించెను.

212. భాష్యరచనము చేయునాటికి శ్రీ శంకరుని వయస్సు ద్వాదశాబ్ద పరిమితము. అట్టి సమయమున శంకరుడు ద్వాదశాదిత్య సమానకాంతితో వెలుగొందుచుండెను.

213. సూత్రాణాంప్రథమం భాష్యం శ్రుత్యంతానా మనంతరం

గీతాయాశ్చతతశ్చక్రే, భగవాన్‌ శంకరో యతిః ||

214. కించ భాష్యాణి చాన్యేషాం, కృతవాన్‌ శంకర స్తదా

గ్రంథాన్‌ శతాధికాంశ్చ క్రుహ్యద్వైత స్థాపనాయసః

కాశీం ప్రతి పునరాగమనం

215. ఏతాన్‌ గ్రంథా నసౌ సర్వాం, శ్చక్రు వర్ష చతుష్టయే

రచనా నంతరం చాయం, పునః కాశీం సమాగతః ||

216. అద్భుతా రచనాశక్తి ర్భాషా మాధుర్య మద్భుతం

బోధనే భేదనే వాదే, తస్యే ధీశక్తి రద్భుతా ||

217. క్వషోడశవస్కో7యం, గ్రంథా శ్చైతాదృశాః క్వదా

సాక్షాద్విశ్వేశ్వర శ్చాసౌ, నోచేత్కధ మరీరచత్‌ ||

213. శ్రీ వేదవ్యాస విరచితములగు బ్రహ్మసూత్రములకు ప్రప్రథమమున భాష్యమును రచించి, అటు పిమ్మట నపౌరుషేయములౌ నుపనిషత్తులకును ఆ పిమ్మట శ్రీకృష్ణ భవన్ముఖోద్గీతమగు భగవద్గీతా గ్రంథమునకును భాష్యములను రచించెను.

214. అద్వైతస్థాపనోద్యుక్తుడౌ నాశంకరుడు ఇంక నెన్నియో భాష్యములను, అద్వైతస్థాపమనమున కనుకూలమగునట్లుగ నితర ప్రకరణాది గ్రంథములను గూడ శతాధికముగ రచించెను.

తిరిగి కాశీక్షేత్రమునకు వచ్చుట :-

215. ఇట్లు గ్రంథరచనా నిమగ్రుడై శ్రీ శంకరుడు నాలుగుసంవత్సరములు గడపి తిరిగి కాశీక్షేత్రమునకు వచ్చెను.

216. శంకరుని భాష్యాది గ్రంధములనుజూచి పండితులెల్ల రాశ్చర్య చకితులై యిట్లనుకొనజొచ్చిరి. :- ''ఏమీ, యీతని గ్రంథరచనాశక్తి! సుధా మాధుర్యమును ధిక్కరించుచున్న యీతని భాషాబాధుర్యమేమి? తత్త్వలబోధనమునగాని, ప్రతివాది మతగతయుక్తి గాఢతాభేదనమునగాని, వాద ప్రసంగములందుగాని మొక్కవోక నవనవోన్వేషములతో బహుముఖముల విస్తరించు నీతని ధీశక్తియేమి? అన్నియు సత్యద్భుతములుగ గానవచ్చుచున్నవి.

217. ''పదునారు సంవత్సరముల గల యీ చిరుతవాడెక్కడ - మహాప్రౌఢములై ప్రతివాది ముఖస్తంభనదక్షములైన, పరశ్శత సంఖ్యాకములగు నీ గ్రంథములెక్కడ? ఎట్లీతడీ గ్రంథములను రచింప గల్గెను? ఇది అమానుషశక్తి సంకలితకార్యముగాని, మానవ సాధారణముకాదు.ఈ శంకరుడు వారణాసీవాసుడౌ శ్రీ విశ్వేశ్వరుడే యయియుండును. లేకున్న యిట్లు యీ భాష్యాదికముల నెటుల రచింపగలడు? సందేహములేదు.'' అని శంకరుని విశ్వేశ్వరునిగ నిశ్చయించుకొనినవారై ఆ కాలపు పండితులెల్లరు శంకరునకి శిష్యులై సేవింపజొచ్చిరి.

218. ఇత్యేవం విస్మితా స్సన్తః,న పండితా శ్శిష్యతాం గతాః

చిత్రమేతాదృశం దృశ్యం, వృద్ధాశ్శిష్యా గురుర్యువా ||

219. తేషాం మధ్యే బభౌ చాయం, నక్ష త్రాణాం శశీయధా

వారణాసీ నగర్యాశ్చ, దీప కోమణి రా బభౌ ||

220. శిష్యాణా మపి సర్వేషాం, బుద్ధిమాన్‌ వై సనందనః

భక్త్యాశు శ్రూషయానిత్యం, సమ్యగ్గురు మతోషయత్‌ ||

231. సనందనే గురుస్తస్మా, ద్వాత్సల్యం చాప్య దర్శయత్‌

ప్రధాన శిష్యం తం కృత్వా, గ్రంథాన్‌ సర్వా నభోదయత్‌ ||

232.దృష్ట్వా తదితరే శిష్యా, అసూయాగ్రస్త మానసాః

అభవన్‌ తద్విదిత్వాత, న్నివారయితు మిచ్ఛయా ||

223. వినా సనందనం శిషై#్య, ర్యుక్తో గంగాం సమేత్య సః

గంగాయా అన్యత స్తీరే, విలోక్య చ సనందనం ||

218. శిష్యభావమునొంది శంకరుని పరివేష్టించియున్న పండితులెల్లరు వృద్ధులు. శంకరుడుపదునాలుగేండ్ల బాలుడు. చూచువారలకిది మిక్కిలి ఆశ్చర్యమునుకలిగించుచుండెను.

219. శంకరుడు వారణాసీ క్షేత్రమున విద్యాప్రకాశ విరాజమానులగు శిష్యులు తన్ను పరివేష్టించియుండ, నక్షత్రగణ మధ్యమునున్న సుధాకరునివలెను, వారాణసీనగర మధ్యమున నుంచబడిన కాంతి వంతమౌ మహోజ్జ్వలమణి దీపమువలెను ప్రకాశించుచుండెను.

220. శంకరుని శిష్యులందిరిలోను సనందనుడు మహాబుద్ధిశాలి. ఆతడు అనన్యమగు గురుభక్తి విశేషముచేతను. నిరంతర శుశ్రూషాచరణముచేతను తన గురువును విశేషముగ సంతోష పెట్టుచుండెను.

221. శంకరులును. ఆ సనందునియందు విశేషవాత్సల్యమునుంచి శిష్యులలో ప్రధానునిగా నాతనిజేసి సమస్తగ్రంధములను పఠింపజేసి. తర్ధములను సంపూర్ణముగ నాతనికి దయతో బోధించెను.

222 to 226. సనందునియందు గురువులకు వాత్సల్యాతిశయము గలదని గ్రహించి యాతనియందు మిగిలిన శిష్యులసూయాగ్రస్త మానసులైరి. ఆ సంగతి తెలిసికొని. గురుడు వారి భావమును నివర్తింప జేయుటకై యొకనాడుతదితర శిష్యులందరిని వెంటనిడుకొని గంగా తీరమునుజేరి గంగ కావలి యొడ్డుననున్న సనందనుని. ''ఓ సనందనా! వేగమె యిటు రమ్మ''ని శంకరుడు పిలిచెను. అంతవెంటనే గురుభక్తిపూర్ణుడౌ సనందనుడు క్షణమైనను విలంబముచేయక సాధనాంతరములకొఱకు ప్రతీక్ష చేయకయే గంగాజలముపై పాద విన్యాసము జేయుచు వేగముగ గురుసన్నిధికి వచ్చెను. అతని కాసమయమున గుర్వాజ్ఞా నిర్వహణ వ్యగ్రతయేగాని, గంగాజల మున పాదప్రక్షేపముజేసిన, జలమున మునిగిపోదుమేమో అన్న విచారముకూడ కలుగలేదు. భక్తియున్న నిట్టిదికదా! గంగాజలముపై పాదములిగి పయనించుచున్న ఆతని పాదముల అడుగుభాగమున అతడు ప్రమాదము పొందకుండ పద్మములు వచ్చిచేరి సహాయపడెను. నిశ్చలమగు గురుభక్తి కలుగవలెనేగాని సంపదలు కోరబడకయే తమంత తాముగవచ్చి సమయము వచ్చినప్పుడెల్ల సహకరించుచుండగలవు. దాని కిదియే నిదర్శనము. గరుభక్తి యీతని కిపుడు నదాతరణమునకు సాధనమయ్యెను. అట్లు భక్తి, సంసార సాగర తారకముకూడ కాగలదు.

అది మొదలలు సనందునకు పద్మపాదుడని ప్రఖ్యాతి యేర్పడెను. ఆశ్చర్యావహమగు నీసన్నివేశమునుజూచి, శిష్యులాసనందుని యందలి అసూయను విడనాడి నిష్కల్మష బుద్ధిగలవారైరి.

224. సనందన! సమామాహీ, త్యాహ్వయ త్కృపయా గురూ

సనందన స్తదాశీఘ్రం, గురుభక్తివిశేషతః ||

225. జలస్యోపరి నిక్షిప్య, పాదౌ చాగతవాన్‌ ముదా

తదా థం పాదయో స్తస్య, పద్మాన్యాసన్‌ సమంతతః ||

226. ఈ దృశీ గురుభక్తిర్హి, భక్తి రేవ హి తారికా

సనందనస్తదారభ్య, పద్మపాద ఇతి విశ్రుతః ||

227. దృష్ట్వా త మర్భుతం కర్మ, శిష్యావిగతకల్మషాః

భక్త్యా హ్రియా నమ శ్చక్రుస్సనపందనయుతం గురుం ||

వేదవ్యాససమాగమః

228. పాఠవాచన వేళాయా, మేకదా వృద్ధభూసురః

ఆగత్యాకర్ణ్యతం పాఠ, మిదం వచన మబ్రవీత్‌ ||

229. భోస్వామిన్‌! వదకర్తారం. మాత్రభాష్యస్య చాప్యచ

అహ మేవేతి ప్రోవాచ, వినయేన స శంకరః ||

227. అంత నా శిష్యులు సనందుని విశిష్టగురు భక్త్యాదుల తెలిసికొనిన వారై లజ్జాభయములతో కూడుకొనినవారై, సనందునితో కూడు కొనియున్న ఆ శంకరునకు నమస్కరించిరి.

వేదవ్యాసుల సమాగమము

228, 229. అంత నొకనాడు శంకరులు శిష్యులకు పాఠముల ప్రవచించుచున్న సమయమున నొక వృద్ధ బ్రాహ్మణుడువచ్చి సాకల్యముగ నా పాఠమును తిలకించి, ''స్వామీ! తాము ప్రవచించుచున్న ఈ బ్రహ్మసూత్ర భాష్యమునకు కర్తయెవరు?'' అని ప్రశ్నించెను. వెంటనే శంకరులు''నేనేబాబు'' అని బదులు చెప్పెను.

230. తథాచే చ్ఛ్రోతు మిచ్ఛామి, భాష్యం స్వామి9! త్వయా కృతం ||

తృతీయధ్యాం సూత్రస్య, ప్రథమ స్యార్థ ఉచ్యతాం||

231. తద్భాష్యం శంకరా చ్ఛ్రుత్వా, వాక్యార్థం కృతవా నయం

వివాదేస్మిన్‌ తయోర్మధ్యే. దని న్యస్టౌ గతా న్యహో ||

232. వివాద మీదృశం దృష్ట్వా, విస్మితో7భూ త్సనందనః

తదా ముహూర్త మాలోచ్చ చూవం నిశ్చితవానయం ||

233. అస్మదాచార్యవర్యేణ కర్తుం వాక్యార్థ మీదృశం

న మానవస్య ప్రజ్ఞాస్తి. నాయం వృద్ధస్తు మానవః

234. య స్సుత్రకర్తా భగవాన్‌, వ్యాసో నారాయణో హరిః

సాక్షాత్సేవ వృద్ధో7యం, పరీక్షార్థ మిహా గతః ||

235. ఏవం నిశ్చిత్య ప్రాహేదం, బుద్ధిమాన్‌ వైసనందనః

భోవృద్ధా స్స్వామినోయూయం, శృణుధ్వం ప్రార్థనా మియాం ||

230. అంత నావృద్ధభూసురుడు ''స్వామీ! మీరే ఈ భాష్యకర్తలగుచో బ్రహ్మసూత్రములయందలి తృతీయాధ్యామందలి ''తదంతర ప్రతి వత్తౌరంహతి సంపరిష్వక్తః. ప్రశ్న నిరూపణాభ్యాం'' అనునీ ప్రథమసూత్రముయొక్క అర్థమును వివరింపుడు. నాకు విన కోరిక గలదు'' అని యనెను.

231. అంత శంకరులు తాము రచించిన భాష్యమును ప్రదర్శించుచూ, ఆ సూత్రముయొక్క అర్థమును విస్పష్టముగ వివరించిచెప్పెను. దానినివిని, లోనసంతోషించిన వాడయ్యును. నా వృద్ధుడు శంకరుని వాదకౌశల్యమును జూడదలచివాడై అతనితో వాక్యార్థమును సాగించెను. అప్పట్టున నిరువురకును ఒకరిపై నొకరు ఉత్తరోత్తర పక్షములను అసదృశరీతిని ప్రదర్శింపజేయుచు. యుక్తిగాఢతలోగాని ప్రమాణ ప్రదర్శనమునగాని. తీసిపోనిరీతిని ఎనిమిది రోజులు వాదమునుజరిపిరి.

232. ఇట్టి అమానుష ప్రజ్ఞావిశేషములతో జరుగుచున్న వారి యసదృవమగు నా వాదోపవాద వైఖరిజూచి, సనందనుడు విస్మయావిష్ట హృదయుడై కొచెమాలోచించి ఇట్లు నిశ్చయించెను.

233. ''మా యీ గురువర్యులతో నిట్లు వాక్యర్థముజేయ మానవునకు శక్యమా? అట్టి ప్రజ్ఞావంతుడు మానవలోకమున నుండుట యసంభవము. ఈ వృద్ధుడు ప్రాకృత మానవుడుగాదు.

234. ''శ్రీమన్నారాయణాంశ సంభూతుడును, బ్రహ్మసూత్ర కర్తయునగు శ్రీ వేదవ్యాస భగవానుడే ఈ భూసమున మా గురువర్యుల బరీక్షింపదలచివచ్చి యుండును.''

235. అని నిశ్చయించి, బుద్ధిశాలి¸° సనందనుడు - '' భూసురోత్తమా! ఓ స్వామీ! తా మిరువురును మా ప్రార్థనమునాలకింపుడు.

236. శంకర శ్శంకర స్సాక్షా, ద్వృద్ధో7యం కేవలం హరిః

ద్వయో రస్య వివాదస్య, కస్సమర్థోనివారణ.

237. విరమంతు భవంతో7ద్య, వివాదా ద్భీకరా త్తతః

భూత్వా ప్రసన్నా రక్షన్తు, చాస్మా నజ్ఞాన బంధనాత్‌ ||

238. ఏవముక్తే ప్రశాంతౌ తౌ, విరతౌ వాదసంభ్రమాత్‌

తత శ్శ్రీశంకరో వ్యానం, ప్రణిపత్యేద మబ్రవీత్‌ ||

239. మయా కృత మిదం భాష్యం, సూత్రాణాం భవతాం ప్రభో!

పరీక్ష్యతా మిదం సమ్య, గ్రచితం సాధువా నవా ||

240. వృద్ధో సౌ స్వేన రూపేణ తదా తసై#్మస్వదర్శనం

దత్వా తం ప్రాహ భగవాన్‌, భద్రం తేశృణు శంకర ||

241. ఆగతోస్మి పరీక్షార్థం, ధీశక్తి స్తవ వాదనే

బోధనే భేదనే చాపి, సమ్యక్తుష్టోస్మి సర్వదా ||

242. ఇత్యుక్త్వా స్వస్య మాత్రాణాం, భాష్యం శంకరనిర్మితం

ఆమూలాగ్రం పరీక్ష్యైత ద్బ్రహ్మానంద మవావ సః ||

243. ఏవం ప్రహృష్ట స్సూత్రాణాం, కర్తాన భగవాన్‌ హరిః

వేదవ్యాస స్సవ్యం ప్రాహ భాష్యకర్తార మీదృశం ||

244. ఈశ్వరస్యా పతారో7సి, తస్మాత్స్పష్టీకృత స్త్వమా

భాష్యే త్వదీయే మద్భావో యథా మే మనసిస్థితః ||

236. స్వయముగ కైలాసగిరి నిలయుడౌ నా శంకరుడే యీ శంకరుడు ఈ వృద్ధభూసురుడు శ్రీహరియే. మీ వివాదమును తీర్ప మానవ లోకము నేరికిని సాధ్యముగాదు.

237. మీరీ భయంకర వివాదమునుండి విరమించి మాపట్ల ప్రసన్నులై మాయాజ్ఞానముల పారద్రోలుడు'' అని సవినయముగ ప్రర్థించెను.

233, 234. ఇట్లు సనందనుడు ప్రార్థింప, వారుభయలును వాదసంరంభమును విరమించి ప్రశాన్తుతులైరి. అంత శంకరుడు వృద్ధబ్రాహ్మణ రూపముననున్న వ్యాసభగవానునకు సాష్టాంగ నమస్కారమాచరించి ''అయ్యా! తమరు రచించిన యీ బ్రహ్మసూత్రములకు నాచే భాష్యము రచింపబడెను. తాము దీనిని పరీక్షించి, దీని సాధుత్వా సాధుత్వములను నిర్ణయింపుడు'' అని ప్రార్థించెను.

240 to 243. వృద్ధభూసుర రూపముననున్న వేదవ్యాసులప్పుడు తమ నిజ స్వరూపమునుప్రదర్శించి. శంకరునినతో నిట్లనెను. ''శంకరా! నీకు క్షేమమగుగాక! ప్రతివాదులతో వాదముచేయుటయందును. బుభుత్పువులగు శిష్యులకు తత్త్వమును బోధించుటయందును, మతాంతరులచే ప్రయోగింపబడు యుక్తి ప్రయుక్తులను భేదించుటయందును. నీ దీశక్తి గరిమను పరీక్షీంపగోరి వచ్చితిని. వాదన భేదన ములయందుగల నీవిశిష్ట ధీ శక్తిని, ఈవాద సంరంభముతో సర్వదా గ్రహించి సంతసించితిని.'' అని పలికి, శంకర నిర్మితము లగు నా భాష్యములన నా మూలాగ్రముగ పరీశీలించి, సూత్రకర్త¸° వేదవ్యాస భగవానుడు బ్రహ్మానంద సంభరితుడై ఇట్లనెను

244, 245. ''ఓ శంకరా! నీవుపరమేశ్వరావతార రూపుడవు కావుననే నా హృదయాన్తర్గత భావమును ఉన్న దున్నట్లుగ నీభాష్యమున వివరించితిని. యీ నీ భాష్యము సూర్యచంద్రాదు లున్నంతవరకు వెలయగలదు. శ్రుతి సమ్మతమగు నీ అద్వైత సిద్ధాంతమును అప్రతిహతముగ. సర్వలోక వ్యాప్తిగ స్థాపించుము.

245. ఇదం భాష్యం స్థిరం భూయా, ద్యావచ్చంద్రిదివాకరే

స్థాపయా ద్వైతసిద్ధాంత, మనేన శ్రుతి సమ్మితం ||

246. అన్యాని వేద బాహ్యాని, నాశయ త్వంవ మతా చ

స్థాపనే బ్రహ్మవిద్యాయా, స్సర్వవాదిజయీ భవః ||

247. షోడవాబ్దవయస్క స్త్వ మాయుస్తే సూర్ణతాం గతం

అద్వైతస్థాపనార్థం తే వయో దాస్యామి షోడశ ||

248. ఇత్యుక్త్వాన్తర్దధే వ్యాస, శ్శంకరో హృష్టమానవః

స్వమతస్థాపనార్థాయ జయయా త్రాం ప్రచక్రమే ||

శ్రీ శంకరస్య విజయ యాత్ర-కుమారిల భ##టేన సంవాదః

249. కర్మబ్రహ్మేతి సిద్ధాంత, స్సర్వత్ర ప్రాచల త్తదా

కుమారిలస్తు తత్కర్త, ప్రయాగే వసతీతి చ ||

250. శ్రుత్వాగత్వాద తత్‌క్షేత్రం, సహశిషై#్యశ్చ శంకరః

ప్రవిశంతం తుషాగ్నౌ తం, సందదర్శ కుమారిలం ||

246. ''శ్రుతి సమ్మతములుగాని ఇతర మతములను ఖండించుము. ప్రత్యగభిన్న బ్రహ్మవిద్యాస్థాపన వ్యాపారమున నీవుసర్వవాది విజయ మును పొందుము.

247. ''నీవిపుడు పదునారు సంవత్సరముల వయస్సుగలవాడవైతివి. నీ యాయుర్దాయము పూర్ణమయ్యెను. నీ కిపుడు నేనద్వైత మత స్థాపనమునకై మరియొక పదునారు వత్సరము లాయుర్దాయము నిచ్చుచుంటిని.''

248. అని పలికి శ్రీ వేదవ్యాస భగవానుడు అంతర్థానము నొందెను. అంత శంకరుడు సంతుష్టాంతరంగుడై వేదవ్యాసాజ్ఞానుసారము అద్వైతమతస్థాపనముచేయబూని, విజయాత్ర చేయ నారంభించెను.

*శంకరుల దిగ్విజయ యాత్ర*

కుమారిల భట్టుతో సంభాషించుట

249.250. ఆ కాలమున శ్రౌతములగు దర్శనములందు ప్రసిద్ధమగు పూర్వ మీమాంసాదర్శనము లోకమున విశేషప్రచారములోనుండెడిది. ఆ దర్శనమువారు కర్మ బ్రహ్మవాదులు, ఆవాదమును ధ్రువపరచి, ఆ కాలములో మిక్కిలి ప్రచారములోనికి తెచ్చిన మహాత్యుడు కుమారిలభట్టు, ఆయన ప్రయగక్షేత్రమున నివసించువాడు. ఈ సంగతి విని శంకరుడు శిష్యగణసమేతుడై ఆతనితో వాదము జేయ నా క్షేత్రమునకు జనెను.

251. భట్టార్య! మావిశాగ్నౌత్వ. మాతగోస్మి జగీషయా

ప్రవేశ మీదృశం ఘోరం, కస్మా తగ్నౌకరోషి భోః ||

252. ఏవం పృష్ట స్సభట్టార్య, ఇదంవచన మబ్రవీత్‌

అపరాధద్వయం స్వామిన్‌! జీవితే తరితం మయా ||

253. బౌద్ధాన్‌ గురూంస్తు సంప్రాప్య, జ్ఞాత్వా తేషాంచ సన్నిధౌ

సర్వాన్ధర్మాంశ్ఛ విద్యాశ్చ, బౌద్ధ మున్మూలితం మయా ||

254. ఏవం యమా గురుద్రోహః కృతశ్చ తదనంతరం

కర్మ బ్రహ్మేతి వాదేన, హ్యాత్మద్రోహః కృత స్తధా ||

251. ఆ సమయమున కుమారిలుడు తుషాగ్ని (ఊకయందగ్ని) నేర్పరచు కొని, దానియందు ప్రవేశము చేయబోవుచుండెను. ఘోరమగు నా పరిస్థితిలోనున్న కుమారిల భట్టుని జూచి, ''కుమారిలా! నీవు విట్లు అగ్నిని ప్రవేశింపవలదు. నిన్ను వాదమున జయించి, కర్మ బ్రహ్మవాదమును నిరసించి, సర్వవేదసమ్మతమౌ నద్వితీయవాదమును స్థాపింపవచ్చితిని. నీవు ఘోరముగ నిట్టగ్ని ప్రవేశమొనర్చుటకు కారణమేమి?'' అని యడుగగా, కుమారిలభట్టిట్లనెను.

252 to 254. ''స్వామీ! శంకరా! నేను నా జీవితములో రెండపరాధము లను జేసితిని. అందు వైదకమత విధ్వంసకులగు బౌద్ధుల వాదములు పూర్ణముగ లెలియనిది. తత్ఖండనము పరిపూర్ణముగాదని యెంచి, తన్మత విజ్ఞాన సముపార్జన కొఱకు ప్రచ్ఛన్నవేషమున వారి శిష్యత్వమును వహించి, ఆ విద్వాంసులవద్ద తన్మతమును సాకల్యముగ గ్రహించి, ఆ గురువులను ధిక్కరించి, వారి ధర్మములకు, వారి విజ్ఞానమును, వారిమతమును నిస్సారములని ధ్రువపరచి, ఖండిచి, ఆ బౌద్ధమతమునిర్మూలించి వైచితిని. ఇట్లు గురుద్రోహము చేయుట ఒక అపరాధము.

మరియొకటి అపరాధమేమన, వేదప్రామాణ్యము నంగాకరింపక, తదుక్తధర్మములందు శ్రద్ధలేక, తదనుష్ఠానము సర్వాత్మనాశూన్యమూన ఈ లోకమున వేదములయందు ప్రామాణ్యబుద్ధిని, తదుక్తధర్మములయందు శ్రద్ధాతిశయమును, ధర్మానుష్ఠానాభి నివేశమును కలిగించవలెనను. తలంపుతో, కర్మ బ్రహ్మవాదమును యుక్తి ప్రదర్శనములతో ప్రమాణోపన్యాసములతో లోకమున ధ్రువపడునట్లు చేసితిని. దాన ఆత్మ బ్రహ్మలకుగల వాస్తవమగు నభేదనమును మరగు పరచుటతో నాత్మద్రోహమునూ చేయబడినది. ఇది రెండవ అపరాధము.

255. అపరాధ ద్వయస్యా7స్య, ప్రాయశ్చిత్తార్థ మీదృశః

అగ్నౌమయా ప్రవేశో7యం, క్రియతేధర్మశాస్త్రతః||

256. తదా శ్రీ శంకరః ప్రాహ, ''కృతం ద్రోహద్వయం

మయా||

ఇతియన్మన్యసేభట్ట ! ప్రాయశ్చిత్తం దదామ్యహం||

257. మంత్రోదకేన శుద్ధంత్వాం కరోమి శృణుపండిత !

ఉత్తిష్ఠ మావిశాతగ్నిం త్వం, పాదభిక్షాంచ దేహిమ్‌||

258. కుమారిల స్తదా ప్రాహ, కురుంపూతంచ మాంభవాన్‌

దక్షోనూనం, సమామేవ, సర్వాంశ్చాజ్ఞానబంధవాత్‌||

259. వేదాహం త్వాం శివం సాక్షా, దవతీర్ణం కలౌ యుగే

ఉద్ధర్తుం బ్రహ్మ విద్యాంత్వ మాగతో7సి

జయో7స్తుతే||

260. కింతు ద్రోహద్వయా దద్య, శిక్షితవ్యోస్మి శాస్త్రతః

శాస్త్ర మేవ ప్రమాణంనో, ''దహనాదేవ నిష్కృతిః''

261. తస్మాగ్నిం ప్రవేక్ష్యామి, మానివారయ మాం యతే!

మాహిష్మత్యాం నగర్యాం మే, శిష్యో వసతి పండితః||'

255. ''ఇట్టి అపరాద ద్వయమునకు, ధర్మశాస్త్ర నిర్ణయానుసారము తుషాగ్ని ప్రవేశరూప ప్రాయశ్చిత్తమిపుడు నాచే చేయబడు చున్నది.'' అని చెప్పాకెను

256.257. అంత శంకరుడు ''ఓ భట్టార్య ! నీవు ద్రోహద్వయమును చేసితినని చెప్పుచున్నావుగదా ! నేను నీకు ప్రాయశ్చిత్తమును చేయుచున్నాను. ఇదుగో, మంత్రపూతమగు జలమును నీపై ప్రోక్షింతును; వినుము, నీవు శుద్ధుడవు కాగలవు. నీ వగ్నియందు ప్రవేశింపవలదు. లేని నాకు వాదభిక్షనిమ్ము నాతో [వాదము జేయుము]

258.259. అంత కుమారిలుడు ''స్వామి ! తాము నన్నేగాదు. సర్వులను గూడ నజ్ఞాన బంధములనుండి తొలగించి, పవిత్రు జేయగలదరు. సందేహము లేదు, ఈ కలియుగమున నపతరించిన పరశివుడవే నీవని నేను నిన్ను గుర్తించితిని. బ్రహ్మవిద్య నుద్ధరింప నిటకు దయచేసినాడవు. నీకు జయమగుగాక !

260. 261. ''ఓ యతిపుంగవా! నేను ద్రోహద్వయమునుచేసి యుంటినని తమతో జెప్పియుంటిని. దానికి నేను యధాశాస్త్రముగనిష్కృతి (ప్రాయశ్చిత్తము) జేసికొనవలసి యున్నది. కర్తవ్యములను గూర్చి మన కందరుకును శాస్త్రమేకదా ప్రమాణము. ఆ శాస్త్రము ''దహనాదేవ నిష్కృతిః|| అని చెప్పుచున్నది. కాన నే నగ్నిని ప్రవేశింతును. నన్ను తాము నివారింపవలదు. మాహిష్మతీ నగరమున నుప్రసిద్ధ పండితుడు. నుగృహీతనామధేయుడు, మచ్చిష్యుడు గలరు.

262. సోయం మండనమిశ్రాశ్యో, మత్సమో నాత్రసంశయః

తం ప్రాప్య తేన వాక్యార్థం, కృత్వా జేష్యసితంశృణు||

263. ద్వితీయ సూత్ర భాష్యస్య, వార్తికం కర్తు మప్యయం

దక్ష స్తేన్తెన తత్సర్వం, కారయ త్వం యతీశ్వర!||

264. మను భాగ్యవశా దేవ, చాంతకాలేర7ద్య దర్శనం

ఈశ్వరస్యా వతారస్య, తన ప్రాప్తం మయా ప్రభో||

265. అద్య మే సఫలం జన్మ, ధన్యం చ మమ జీవితం

కృత్వా బ్రహ్మూపదేశం మే, ముక్తం సర||జ్ఞ! మాంకురు||

266. తదా బ్రహ్మోప్రదేశం శ్రీ శంకర స్తస్య చాకరోత్‌

సోపిముక్తిం గతో దేహం త్యక్త్వా శంకరసన్నిధౌ||

మండవ విశ్రేణ సహవాదః

267. మాహిష్మతీపురం ప్రాప్త, శ్శిషై#్య స్సహ తదాంజ సా

ఆకాశమార్గ మాలంబ్య, యోగశక్త్యా స శంకరః

268. మాహిష్మతీ పురీ రమ్యా, సర్వవైభవశోభితా

బహి రాస్తే నదీ రేవా, తస్యాస్తీరే శివాలయః||

262. ''అతని పేరు మండన మిశ్రుడు. అతడు విద్యాప్రాభవాదుల నన్నింట నాకు సముడు. సందేహము లేదు. అతనిని సమీపించి అతనితో శాస్త్రర్ధవాదముల జరుపుడు. ఆ వాదమున మీరాతనిని జయింపగలరు.

263. ''ఓ యతీశ్వరా! వినుడు. తాము రచించిన సూత్రభాష్యమునకు వార్తికమును కూడా నాతడు రచింపగలడు. అతడు కడుంగడుదక్షుడు. అతనిచే వార్తిక గ్రంథరచనాది కార్యముల నిర్విర్తింపజేయుడు.

264.265. ''ఓ ప్రభూ ! పురాకృత పుణ్య భాగ్యాతిరేకమున పరమేశ్వరుని యవతారమగు తమ దర్శనము నాకు లబ్ధమయ్యెను. ఇపుడు నాజన్మ సఫలమయ్యెను. నా జీవితము ధన్యతనొందెను. ఓ సర్వజ్ఞ మూర్తి ! బ్రహ్మతత్త్వము నుపదేశించి నన్ను సర్వబంధ వినిర్ముక్తిని గావింపుము'' అని ప్రార్థించెను.

266. అంత శంకరు డా కుమారిల భట్టునకు బ్రహ్మతత్త్వము నుపదేశింప నాభట్టు శ్రీశంకర సన్నిధానమున దేహసంబంధమును వదలి ముక్తుడయ్యెను.

మండన విశ్రునితో వాదము నెరపుట:-

267. అనంతరము శిష్యగణ పరివృతుడై శంకరుడు యోగశక్తితో ఆకాశ మార్గమున మాహిష్మతీ పురమును చేరెను.

268. మాహిష్మతీపురము మిగుల రమ్యమైనది, ఆ పట్టణము వెలుపల రేవానది (నర్మద) ప్రవహించుచున్నది. దానితీరమున నొక శివాలయముగలదు.

269. తదాలయే నిశాం నీత్వా, స్వానుష్టానా దనంతరం

మండనస్య గృహం ప్రాప్తుం వాదార్థం శంకరో

య¸°||

270. మార్గమధ్యే స్త్రియః కాశ్చి, ద్దృష్ట్వా ప్రపప్రచ్ఛశంకరః||

మండనస్య గృహం కుత్ర, వర్తతే బూత్ర సత్వరం||

271. ప్రత్యూచు స్తా స్తదా స్వామిన్‌ ; యస్య ద్వారే

పరస్పరం

శుకావాదం ప్రకుర్వన్తి, ప్రామాణ్యం చ కథం శ్రుతేః||

272. స్వతో వా పరతః కింవా కథం కర్మఫలపదం

అధికృత్యైవ మా ద్వంశాం, స్తం విద్యాన్మంద

నాలయం||

273. ఆశ్చర్యేణ సతచ్ఛ్రుత్వా, చిహ్నై శ్చైతాదృశై

శ్చతత్‌

ప్రాప్తవాన్‌ శంకరోగేహం, మధ్యాహ్న సమయేతదా||

274. మండ నస్య గృహే తస్మి, న్దినే నైమిత్తికం పితుః

తస్మాత్కవాటం గేహస్య బంధితం చా7భవత్తదా ||

275. తస్మాదాకాశి మార్గేణ, మందిరే7స్మిన్‌ ప్రవిశ్యసః

అపశ్యజ్జైమినం వ్యాస, మర్చయంతం చ మండనం||

269. శంకరులాశివాలయమున అరాత్రిగడవి. మరుదినము ప్రాతఃకాలికా నుష్ఠానములను నిర్వర్తించుకొని వాదోద్యతుడై శంకరుడు మండనుని గృహమునకు బయలుదేరెనె.

270. మార్గమధ్యమున శంకరుడు కొందరు స్త్రీలను జూచి, ''మండవ మిశ్రుని గృహ మెచట?'' యని వారి నడిగెను.

271. 272. అంత నాస్త్రీలు ''స్వామి, యతివరా ! ఇటుపొండు. పోగా. యే గృహప్రాంతమున నలంకరింపబడిన పంజరములయందలి చిలుకలు ''వేదములు స్వతః ప్రమాణము'లా? లేక 'పరతః ప్రమాణములా?' మానవులకు సుఖదుఃఖాది ఫలముల నిచ్చునది కర్మయా లేక దైవమా?'' ఇత్యాది గహనాతి గహనములైన విషయములను గూర్చి వాదోపవాదములను జేయుచుండునో-అదే మండన మిశ్రుని గృహము అని తెలిసికొనుడు'' అని చెప్పిరి.

273. ఆ మాటలకు శంకరు డాశ్యర్యమునొంది. ఆ చిహ్నములను పరికించుచు, మధ్యాహ్నసమయమునకు మండనమి శ్రుని గృహమునకు చేరెను.

274. శంకరు డచటికి చేరినదినమున మండవ మిశ్రుని యింట నాతని తండ్రియొక్క ప్రత్యాబ్దిక శ్రాబ్ధము చేయవలసి యుండుటచే నాతడు తదా చరణవ్యగ్రుడై అంతర్గృహమున నుండెను. అతని గృహద్వారము మూయబడియుండెను.

275. ఆ కాఱమున శంకరుడు యోగశక్తితో ఆకాశమార్గమున వెళ్ళి గృహమధ్యమునకుజేరి. యటనున్న జైమిని వ్యాసులను. వారి నర్చించుచున్న మండవ మిశ్రుని జూచెను.

276. మండవ శ్శంకరం దృష్ట్యా, కాషాయాంబర దారిణం

మత్వా నైమిత్తికం భ్రష్టం, క్రుద్ధ శ్చాభూద్విశేషతః||

277. కాషాయాంభ వస్త్రాణి, బౌద్ధసన్యాసిన స్తదా

ధృత్వాచా వైదికం మార్గమాలం బ్యాసం శ్చ

నాస్తికాః||

278. యతీ నేతాదృశాన్‌ ద్రష్టుం, వేదమార్గం ప్రవర్తకః

మండనోవిముఖ స్తస్మా త్క్రుద్ధ శ్శంకరదర్శనే||

279. క్రుద్ధస్సన్‌ మండన శ్చైవం, నిందా వాక్యాని చా

బ్రవీత్‌

తంశ్రుత్వాకునితో వ్యాస, ఏవం మండన మాదిశత్‌||

280. ఆస్తికః కర్మకాలేతు, నైవం కుపితు మర్హతి

న సాధారణ సన్యాసీ, బ్రహ్మజ్ఞానీ త్వయం యతిః||

281. తస్మాత్తసై#్మ ప్రదాతవ్యం, విష్ణుస్థానం త్వయాదరాత్‌

కోపం సంత్యజ్యంతంశీఘ్రం, పూజ్య భావేన చార్చయ||

276. గృహమధ్యమున వచ్చియున్న కాషాయాంబరధారియైన యతి పుంగవుడగు శంకరునిజూచి, మండన మిశ్రుడు తానాచరించుచున్న శ్రాద్ధము భ్రష్టమైనదని తలంచి, క్రోధో ద్రిక్తుడయ్యెను.

277. నాటికాలమున నా స్తికులు, వేదనిందకులునైన బౌద్ధులనేకులు వేదములయందు, తదుక్తధర్మమునందు, విశ్వాసములేనివారై, వర్ణాశ్రమాచారవిరహితులై, కాషాయాంబరముల ధరించి, కర్మభ్రష్టులై సన్యాసులుగ చలామణి యగుచుండెడివారు.

278. కర్మభ్రష్టులై పతితులైన వారినిజూచుట ధర్మశాస్త్రసిద్ధాంతానుసారము అపవిత్రతా హేతువు, పాపజనకమని మండనుని యాశయము. కాన యీ సన్యాసినిం జూచుటచే తన కపవిత్రతత కలిగినదని, తా నాచరించుచున్న సత్క్రియ భ్రష్టమైనదనియు కోపమువచ్చి శంకరుని బహువిధముగ నిందింప నారంభించెను.

279. ఆ నిందా వాక్యములను పలుకుచున్న మండనునిపై వ్యాసులు కోపించి యిట్లాదేశించిరి.

280. ''మండన మిశ్రా ! నీవు గొప్ప ఆస్తికబుద్ధి కలవాడవు. సత్కర్మానుష్ఠాన మధ్యమున నిట్లు కోపయుక్తుడవగుట నీకు తగదు ఈ వచ్చినవాడు సామాన్య సన్యాసిగాదు. ఈయతి పుంగవుడు బ్రహ్మతత్త్వ సాక్షాత్కారముకల మహానుభావుడు.

281. 'కాన నీవు కోపము నుపసంహరించుకొని ఈ నీ పితృ శ్రాద్ధ కర్మయందీతనికి విష్ణుస్థానమిచ్చి అత్యాదరమున పూజ్యభావముతో నీతని నర్చింపుము.''

282. అనుసృత్య త మాదేశం, మండవ శ్శాంతమానసః

భూత్వా, జలం చ సంస్సృశ్య, యతిం భిక్షార్థ

మాహ్వయత్‌||

283. తదా శ్రీ శంకరః ప్రాహ భిక్షార్థం నాగతోస్మిభో||

దేహి మే వాద భిక్షాం త్వం, పశ్చాద్భిక్షాం

కరోమ్యహం||

284. సర్వవిద్యాసు నిష్ణాతః, పండితో మండన స్తదా

సంతోషేణ తథేత్యుక్త్వా, మాధ్యస్థ్యం ప్రతి

పృష్టనాన్‌||

285. మాధ్యస్థ్యార్థం తదా తాభ్యాం, ప్రార్థితౌ

వ్యాసజైమినీ

తౌ తదా ప్రాహతుశ్శక్య మేవం స్థాతుం న

చావయో||

286. సతీ మండవ మిశ్రస్య, సాక్షా దేషా సరస్వతి

సైవ నూనం సమర్థా7త్ర, మాధ్యస్థ్యం సా కరిష్యతి||

287. తౌ నియుజ్య తదర్థం తా, మునుమాన్య చశంకరం

తే త్రయః పైతృకం పూర్ణం కృత్వాపశ్చా

త్తతో యయుః||

282. ఇట్లు వ్యాసభగవాను లాదేశింప మండన మిశ్రుడు శాంతచిత్తుడై అచమనముచేసి, ఆ వచ్చిన యతీశ్వరుని దయచేసి, భిక్షను స్వీకరింపుడని సగౌరవముగ నాహ్వానించెను.

283. అంత శంకరుడు ''ఓ మండనమిశ్రా ! మేము యీ అన్న భిక్షకై వచ్చి యుండలేదు, మాకు ప్రధానమైనది వాదభిక్ష. ముందు దానిని మాకిమ్ము. ఆ తరువాత మీభిక్షను మేమంగీకరింతుము'' అనెను.

284. సర్వవిద్యా పారంగతుడగు నా మండన మిశ్రుడు సంతోషముతో 'నట్లే' యని యంగీకరించి, ''మనవాదమునకు మధ్యస్థులు నుండదగినవారెవ''రని శంకరుని ప్రశ్నించెను.

285. అంత శంకరులు ''మాధ్యస్ధ్యమున కెవరినో వెదుకనేల, ఈ సన్నిహితులైన పెద్దలు, జైమనివ్యాసులు చాలరా?'' అని యనగా, మండలనునకది సమ్మతమయ్యెను. మండన శంకరు లిద్దరును, వ్యాసజైమినులను మాధ్యస్ధ్యము వహింప ప్రార్థించిరి.

286. అంత వారు ''మాకిచట నిలచుట కవకాశములేదు. ఈ మండన మిశ్రుని భార్య సాక్షాత్తుగ విద్యాధిదైవతమగు సరస్వతి యంశమున బుట్టినది. ఆమె మీ యుభయుల వివాదమున మాధ్యస్థ్యము [జయాప జయముల నిర్ణయించు స్థానము]ను వహింప సమర్ధురాలు'' అని చెప్పి, ఆమె నా కార్యమున నియోగించి, శంకరు నంగీకపరింపజేసిరి.

287. ఆ పిమ్మట శంకర వ్యాసజైమినులు మువ్వురును మండనుని యింటిలోని పితృకార్యమును పూర్తి చేసి యటనుండి వెడలిపోయిరి.

288. రాత్రిం శివాలయే నీత్వా, ప్రాతః కాలే పరేహని

మండసస్య గృహం గత్వా, శంకరో వాద మాదదే||

289. జిత శ్చే న్మండనో వాదే, స సన్యాసా శ్రమం తదా

స్వీకృత్య శంకర చ్ఛాత్రో, భ##వే తితి పణః కృతః||

290. జితశ్చే చ్ఛంకరో వాదే స గృహస్థాశ్రయం తదా

స్వీకృత మండనచ్ఛాత్రో, భ##వే దితి పునః పణః||

291. మాధ్యస్థేనచ భారత్యా, వాదః ప్రాచల దంజసా||

వాదినో ర్గళయో ర్మాలే, సా సంస్థాప్యా7వదన్ముదా''

292. యదా యస్య గళే మాలా, వ్లూనా భవతి తం జితం

మన్యేథాం చ యువాం నూనం' గృహకృత్యం కరో

మ్యహం||

293. వాక్యార్థ స్సర్వవిద్యాసు, తయోర్మధ్యే చ | పాచలత్‌

చతుర్దశ దినా న్యాసన్‌, వాదే చాస్మి న్గతౌ న్యహౌ||

294. కర్మశ్రద్ధా చ పాండిత్యం, మండసస్య ముఖె బభౌ||

సర్వజ్ఞత్వం చ ధీశక్తి, శ్శంకరస్య ముఖే బభౌ||

288. శంకరుడు వెనుక తాను మకాము చేసిన శిశమందిరముననే ఆరాత్రి గడిపి. మరుదిన ముదయమున మండనుని యింటికి జేరి వాదమునకు గడంగెను.

289. 290. వాదరంభమున, మండన మిశ్రుడు వాదమున నోడినచో శంకరునకు శిష్యుడై సన్యసింప వలయుననియు, శంకరుడోడిన గార్హస్థ్యమును స్వీకరించి మండనునకు శిష్యుడు కావలెననియు వారిరువురును పందెములను నిర్ణయించుకొనిరి

291. మండనమిశ్రుని భార్యారూపమున నున్న భారతీదేవి మాధ్యస్థ్యము వహింప వాద మారంభమయ్యెను. ఆ సమయమున భారతి ఉభయుల యెడల యందును పుష్పమాలికల నుంచి ఇట్లుపలికెను.

292. ''ఓ పండితోత్తములారా! మీగళసీమల నాచేనుంచబడిన పుష్పమాలిక లలో ఎవనిమెడలోని మాలిక యెప్పుడు వాడిపోవునో, అప్పుడా తడు ఓడిపోయినట్లు మీరు నిశ్చయించకొనుడు. నేను నా గృహ కృత్యములలో నుందున''ని చెప్పి యామె లోపలకు వెళ్ళెను.

293. అంత నాపండితేంద్ర యతీంద్రుల మధ్య సర్వశాస్త్రముల యందును మహాప్రౌఢముగా, వాక్యార్ధరూపవాదములు జరుగుచు, పదునాలుగు రోజులు గడచెను. విస్మయావహమగు నీ వృత్తాంతమును విని యెందరో మహాపండితోత్తములు వచ్చి యావాదుల వాదసారముల నాదరముగ పరికించుచుండిరి.

294. చూచువారలకు కర్మశ్రద్ధయు పాండితీగరమయు సనదృశముగ మండన మిశ్రుని యందును. సర్వజ్ఞత్వము. అనంతమగు ప్రజ్ఞా పాటవమును శ్రీశంకరుని యందును కాన్పించినవి.

295. మండనో వృషభో వేతి, మృగేంద్రో వేతి శంకర||

బభతు స్తా వుభౌ వాదె, విస్మితాః పండితా స్తదా||

296. అంతేనిరుత్తర స్సో7 భూ, న్మండన స్తస్య మాలికా

వ్లూనా చాసౌ జిత స్తస్మా, త్తదా ప్రోవాచ మండనః||

297. జితో7స్మీతి భయం మే7ద్య, నకించిదపివర్తతే

కింతు జైమిని సూత్రాణాం, వైయర్థ్యం స్వాదితివ్యధా||

298. ప్రత్యువాచ యతీంద్ర స్తం, వచోమేశృణుపండిత !

నాస్తి జైమిని సూత్రాణాం, వైయర్ధ్యం చ కదా

ప్యహో||

299. జ్ఞానా దేవతు కైవల్యం, కర్మ తద్‌ జ్ఞానసాధనం

కర్మణా చిత్తశుద్ధి స్స్యా త్తేన నాన్యెన పండిత!||

295. వాదము చేయు పట్టులలో మండనపండితుడు వృషభమువలెను, శంకరులు మృగరాజువలెను శాస్త్రార్థసారముల నెరిగిన పండిత తల్లజులకు భాసించు చుండిరి.

296. చివరకు మండనమిశ్రుడు శంకరుని వాదమునకు సమాధానము చెప్పలేక నిరుత్తరుడయ్యెను. అంత నతని గళమున వ్రేలాడుచున్న పుష్పమాలిక వ్లూనయై కాంతి దొరగెను.

297. అంత మడన మిశ్రుడు తన ఓటమిని ఒప్పుకొనును. ''స్వామీ ! నేనోడితిని. జయము మీయదిమే. నే నపజయము నందితినినని నాకేమియు భయముగాని, పరాభవముగాని లేదు. కాని మీవాదయే యధార్థమగుచో జైమినిమహర్షి ప్రణీతసూత్రములు వ్యర్ధములు కావలసి యుండును. అట్లగునాయని మాత్రము విచారించుచుంటిని'' అని అనెను.

298. అంత శంకరుడు ''ఓ పండితుడా! నామాట వినుము. జైమిని మహర్షకృతసూత్రములు వ్యర్ధములని తలుప సవరములేదు. అని వ్యర్థములుగావు.

299. ''ఆవిద్యారోపిత గుణాదులు విద్యాప్రాభవమున ఆత్మస్వరూపము నుండి తొలగించబడగా నేర్పడిన నిర్గుణ. నిష్క్రయ, కేవలాత్మ స్వరూపమగు మోక్షము జ్ఞానమున మాత్రమే యేర్పడును. అట్టి జ్ఞానమున సంపాదించుటకు కర్మసాధనము. శాస్త్రవిహిత కర్మాచరణమున చిత్తశుద్ధి యేర్పడునుగాని, మరియే ఇతర సాధనమునను చిత్తశుద్ధి కలుగనేరదు. శుద్ధచిత్తమున వైరాగ్యాది సాధనములద్వారా జ్ఞానలాభము కలుగును.

300. సాధనత్వేన ప్రాథాన్యం, కర్మణ స్స్యా త్సదా భుమి

జైమిని శ్చాపితత్‌ జ్ఞాత్వా, స్వయం సూత్రాణ్యరీరచత్‌

301. పండితేంద్ర స్తదా77కర్ణ్య, దేశికేంద్రంచ జైమినిం

ధ్యాత్వాతద్దర్శనం చైచ్ఛ, త్ప్రత్యక్షో7భూత్స జైమినిః||

302. మండనస్య మనశ్చంకాం, జ్ఞాత్వా జైమిని రబ్రవీత్‌

ఈశ్వర స్వావతారో యం. నచ సామాన్యమానవః||

303. కించ వ్యాస్య సూత్రాణాం, భాష్యకర్తాస ఏవ హి

వ్యాస స్తుష్టో దదావాయు, స్తధ్భాష్యవ్యాప్తయేభువి||

304. వ్యాసో మమ గురు ర్నూనం, తస్య సూత్రాణి సర్వధా

ప్రమాణం నో న భిన్నాని, తేభ్య స్సూత్రాణి మే

శృణు||

305. కుమారిల స్తవా చార్యో, జ్ఞాత్వా తం పరమేశ్వరం

లబ్ధ్వా బ్రహ్మోపదేశం స, శరీరం త్య క్తవా న్ముదా||

300. జైమిని మహర్షియ ఈ సంగతిని గ్రహించి, కర్మసాధనమని గుర్తించియే, దానికి ప్రాథాన్యమును నిరూపించుచూ సూత్రములను రచించెను గాని. కర్మయే సర్వ ప్రధానమనికాదు.

301 పండితేంద్రుడైన మండనుడు ఈ మాటలను విశ్వసింపజాలక తన గురువగు జైమిని మహర్షిని ధ్యానించి ''మాగురుదేవులు మాకిపుడు ప్రత్యక్షంమగుదురు గాక'' యని సంకల్పించి తద్దర్శమును వాంఛించెను.

302. అంత కృపాళువగు నాజైమిని శిష్యవాత్సల్య ప్రేరితుడై, వారిరువురి యెదుట ప్రత్యక్షమై మండనుని మనుసునగల శంకను నివా రింపజేయ నిట్లనెను.

303. ''ఓ మండన పండితా! ఈ శంకరుడు మానవమాత్రుడు కాదు. పరమశివుని యవతారము. మరియు, వేదవ్యాస విరచిత బ్రహ్మ సూత్రములకు ముఖ్య భాష్యకర్త ఈయనయే. వ్యాసభగవానుడు సంతసించి. భూమండలమున ఈతని భాష్యవ్యాప్తికొఱకై ఈతనికి పదునారు సంవత్సరముల ఆయుర్దాయమునుకూడా నను గ్రహించెను.

304. ''వ్యాసభగవానుడు నాకు గురువు. ఆ వ్యాససూత్రములు మనకు ప్రమాణతమములుగాన. ఆ సూత్రములకు నా సూత్రములు విరుద్ధములు కానేరవు.

305. నీ గురువగు కుమారిలభట్టు కూడా ఈ శంకరుని పరమేశ్వరావతాముగ గుర్తించి యీయనవలన అంతకాలమున బ్రహ్మోప దేశమును పొంది బ్రహ్మానందముతో శరీరమును వీడెను.''

306. ఇత్యుక్త్వా న్తర్దధే మౌనీ, నిశ్శంకో7భూత్స మండనః

కర్మఠత్వం చ సంత్యజ్య, శంకరచ్ఛాత్రతాం గతః||

307. మాలాం వ్లూనాం గళె భర్తు, ర్దృష్ట్వాచోభయభారతీ

యతిం భర్తార మపి సా, భిక్షార్థం చాహ్యయ న్ముదా||

ఉభయ చారత్యాసహవాదః

308. తదా ప్రోవాచ సావాణీ భర్తు ర్భార్యాహి శాస్త్రతః

అర్ధాంగీ, త్వం తత స్స్వామిన్‌! జిత్వామాం

విజయీ భవ||

309. సర్వజ్ఞ శ్శంకర శ్శీఘ్రం, తధేత్యుక్త్వా ముదా7న్వితః

భారత్యా సహ వాక్యార్థ, కర్తుం సముప చక్రమే||

310. సర్వవేదేషు వాక్యార్థం, సర్వశాస్త్రకళాస్వపి

సభాయాం ప్రాచల త్తీవ్రో, వాణీశంకరయో స్తదాః

306. అన్ని చెప్పి జైమిని మహాముని అంతర్థామున నొందెను. అంత నా మండన పండితుడు శంకనువీడి, కర్మతత్వమును విడనాడి. శంకరుని శిష్యుడయ్యెను.

307. మధవ్యర్తిత్వమును వహించియున్న మండనుని ధర్మ, పత్ని యగు నుభయభారతి తనభర్త యొక్క కంఠభాగమున వాడి వ్రేలాడుచున్న పులమాలనుజూచి, తాను ఆహారస్వీకారమునకు శ్రీ శంకరుని 'భిక్షకు దయచేయుడు' అనియు, తనభర్తను 'వైశ్యదేశమునకు దేవతార్చనమునకు దయచేయుడు' అనియు ఆహ్వానించుపద్ధతినిమాని యతీంద్రుడౌ శంకురుని, వాదారంభమున జేసికొన్న పందెము ప్రకారము సన్యాసికానున్న తన భర్తనుగూడ ''భీక్షకు దయచేయుడు'' అని ఆహ్వానించెను.

ఉభయ భారతీదేవితో సంవాద మొనరించుట

308. ఆ తరువాత ఉభయభారతి ఇట్లనెను. ''స్వామి, యతివరా ! భార్య భర్తయొక్క అర్థాంగి (సగము దేహము) కదా! కాన నన్ను కూడ జయించినకదా నీవు ఈతనిని పూర్ణముగ జయించినట్లగుట. కాన వాదమున నన్ను కూడా జయించి, పరిపూర్ణ విజయమునందికొమ్ము'' అనెను.

399. 310. వెంటనే శంకరుడు వల్లెయని సంతోషముతో నంగీకరించి భారతిదేవితోసహ. వాక్యార్థము చేయనారంభించెను. సర్వవేదముల యందు, సర్వవేదాంగములందు, సర్వదర్శన శాస్త్రములందు, సర్వ కళలయందును సర్వజ్ఞుడగు శంకరునకును, శారదావతారమగు నుభయ భారతీదేవికిని, తీవ్రమగు వాక్యార్థము జరిగెను.

311. పూర్వపక్షే చ చతస్యా వా, గ్వీణాగీతి రివ శ్రుతా

గంగా ఝరీవ సిద్ధాంతే, సంయమీంద్రస్య వాగ్బభౌ||

312. ఏవం తయో ర్వివాదే7స్మి, న్దశ సప్తదినా న్యహో

గతాని, పండితా స్సర్వే, విస్మితాశ్చముహుర్ముహుః||

313. విషయే ష్వసి సర్వేషు, భారతీ సా నిరు త్తరా.

కృతా, తదా జితాస్మీతి, సాతో షేణా బ్రవీద్వతిం||

314. ఏవం తౌ దంపతీ వాదే, జితౌ భూత్వా చ శంకరం

ఆవందేతాం తయోః ప్రాహ, భారతీతం ముదాన్వితా||

315. శంకర ! త్వా మహం జానే, సర్వజ్ఞం పరమేశ్వరం

మానవం ధర్మ మాలంజ్య, కృతమేవం త్యయా7ధునా||

316. అద్వైత స్థాపనార్థం త్వ, మాగతో హి కలౌ యుగే

జ్ఞానావతార రూపేణ, సర్వధా విజయో7స్తు తేః

311. అసభయందు బహు మనోహరమగు వీణానాదమా యన్నట్లు మండన ధర్మపత్నియగు నుభయభారతీ ముఖమునుండి వాక్కు ప్రవర్తించుచుండెను. శంకరుని ముఖమునుండి గంగాఝురివలె న ప్రతివాతగతిని వాక్కు ప్రకాశించుచుండెను. సర్వజ్ఞమూర్తియై శంకరుని మాటలు సిద్ధాంతరూపమునను, భారతీముఖ విస్సృతము లైన వాక్కులు పూర్వపక్షగతము లగుచును. వాదము నడచెను.

312. ఇట్లు పండితజన విస్మయాపాదకమగు రీతిన వారిరువురిమధ్య పదునేడు దినములు వాదము జరిగెను.

313. బహువిధములుగ నడచిన యా వాద సంరంభమున సర్వప్రసంగ ముల యందును నా భారతి సర్వజ్ఞుడగు నా శంకరునకు సమాధానము చెప్పజాలక నిరుత్తరస్థితినే పొందెను. చివరకు నామెయే స్వయముగ నా యతీశ్వరునితో ''స్వామీ ! మీనుండి నేను పరాజయమును పొందితిని'' అని సంతోషమున నంగీకరించి బల్కెను.

314. ఇట్లాదంపతు లుభయులును శంకరునితో వాదమునెరపి జితులై, లోకశంకరుడగు నా శంకరుని పాదపద్మములకు సాష్టాంగ ప్రణిపాతమును గావించిరి.

315. అనంతరము భారతీదేవి శంకరునితో నిట్లనెను. ''ఓ శంకరా! సర్వ జ్ఞు డౌశంకరునిగా నిన్ను నేను తెలిసికొంటిని. నీవు మానవరూపమున నవతరించిన పరమేశ్వరుడవు.

316. ''కావుననే మానవధర్మములతో నిట్లు సంచరించుచుంటివి. ఈ కలియుగమున అద్వైతస్థాపనముకై జ్ఞానావతారముగ భూమికి దిగి వచ్చినవాడ వీవు. నీకు విజయము చేకూరుగాత !

317. మయా దుర్వాసన శ్శాషా, త్స్వీకృతా మానవాకృతిజ

భవద్భి ర్వాదసంబన్థా , దద్య ముక్తా7స్మిసంయమిన్‌!

318. జిత్వా సర్వా నరీన్‌ లోకే, పీఠాని స్థాపయా7ధునా

స్థాపయో7 ద్వైత సిద్ధాంతం, సత్యలోకం వ్రజా మ్యహం||

319. తదా శ్రీ శంకరః ప్రాహ, న గంతవ్యం త్వ యాంబికే

ముఖ్యే చైతాదృ శే పీఠే, క కర్తవ్యా సన్నిధి స్త్వయా||

320. ప్రార్థితా భారతీ చైవం, తథేత్యుక్త్వా య¸° తతః||

సన్యాసం విధివత్‌ ప్రాప్య, శిష్యో7భూన్మండనోయతేః||

321. పాండిత్యస్య వివేషాచ్చ, చిత్తశుద్ధేశ్చ బ్రహ్మవిత్‌

గురూపదేశ మాత్రేణ, హ్యగ్రగణ్యశ్చ సో7భవత్‌||

అద్వైత మతసాపనాయ నానాదేశ గమనం

322. జిత్వా మతాంతరాణ్యాశు, చా7ద్వైతం స్థాపితుం

భువి

శంకర స్సహ శిష్యేశ్చ, జయయాత్రాం చకార సం||

317. ''దూర్వాస శాపవశమున నాచేత నిట్లు మానవశరీరము దాల్చబడి నది. పూజ్యులగు మీతో జరిగిన యీ వాదముతో నేనాశాపబంధము నుండి విముక్తనైతిని.

318.''ఓ వంయమీంద్రా ! నీవు అద్వైత సిద్ధాంతమును స్థాపించుము. ఈ లోకమున వైదికధర్మ ప్రతిష్ఠాపనమునకై పీఠములను స్థాపించుము. ఇక నేను నా లోకమగు సత్యలోకమునకు పోవుచున్నాను.''

319. అని భారతీదేవి చెప్పగా శంకరుడు ''ఓ వాగ్దేవీ! అంబికా! నీవు వెడలవలదు పీఠములస్థాపించుమంటివి. ముఖ్యమగునాపీఠముననీవు సర్వదా సాన్నిధ్యమునను గ్రహించవలెను.'' అని ప్రార్థించెను.

320. అంత భారతీదేవి అట్లే యగుగాతమని యంగీకరించి వెళ్లెను. అటుపిమ్మట ముదమున నోడిన మండనమిశ్రుడు వాదారంభమున జెప్పిన పణము ప్రకారము యతీశ్వరుడౌ శంకరునికి శిష్యుడై యధావిధిగ సన్యాసమును స్వీకరించెను.

321 సర్వోత్కష్టమగు పాండిత్యము గలవాడగుటచేతను, సత్కర్మానుష్ఠాన సంపన్న చిత్తశుద్ధి ప్రాబల్యము గలవాడగుట చేతను, ఆ మండనమిశ్రుడు గురూపదేశమాత్రముననే. ఆప్రతిబద్ధ బ్రహ్మజ్ఞాన సంపన్నుడై వెలసెను.

అద్వైత ప్రతిష్టాపనము కొఱకు నానాదేశ గమనము :-

322. అనంతరము శ్రీ శంకరుడు శిష్యగణ పరివృతుడై అవైదికములగు సర్వమతములనుజయించి, అద్వైతమును భూమండలమున స్థాపింపగోరి యటనుండి బయలుదేరి విజయయాత్ర సాగించెను.

323. జిత్వా ప్రథమతో దేశం, మహారాష్ట్రం తతో య¸°

గోకర్ణాఖ్యం మహాక్షేత్రం, తతో హరిహరం య¸°||

324. మూకాంబాఖ్యం తతః క్షేత్రం గత్వాతత్ర చ

బాలకం

మృతం చ పితరౌ తస్య విలపంతౌ దదర్శసః||

325. పిత్రోశ్చజీవతో రస్య, కథ మకాలికీ మృతిః

భ##వే దితి విచింత్యా ముం, జీవయుక్తం చకారసః||

326. బలిక్షేత్రంతతో గత్వా, సహస్రాధిక పండితాన్‌

దృష్ట్యా చాద్వైత సిద్ధాంతా లంబిన స్తాంశ్చ కార సః||

327. తేషు ప్రభాకర శ్చైకో; దర్శయిత్వా సుతం జడం

తజ్జడత్వ విముక్త్యర్థం, ప్రార్ధయామాస శంకరం||

328. శంకరో దయయా బాలం, దృష్ట్యా బుద్ధ్వా త మద్భు

తం

హస్తం నిక్షిప్యతన్నూర్ధ్ని, ''క స్యం బాలే'' తి

పృష్టవాన్‌||

329. ప్రత్యు వాచ దతా బాల, ఆత్మతత్త్వం ప్రపంచయన్‌

శ్లోకైర్ద్వాదశభి స్తచ్చ, హస్తామలకవత్స్ఫుటం||

323,324,325. ప్రప్రథమున శ్రీ శంకరులు మహారాష్ట్ర దేశమునకుబోయి యచటనుండి గోకర్ణక్షేత్రమునకును, ఆ తరువాత హరిహర క్షేత్రమునకును, జని ఆయాస్థానమలుగల అద్వైత ప్రతికక్షులను జయించి, అద్వైతసిద్ధాంతమును స్థాపించుకొనుచు, మూకాంబా క్షేత్రమునకుజని, యచట నొక మృతబాలకుని అతనిముందిడుకొని దుంఖించుచున్న అతని జననీ జనకులజూచి, 'మాతాపితరులు జీవించియుండ అకాలమృత్యు వీతనికేలగలల్గెను ? వీరలు దుఃఖించుచున్నారే. దయనీయులుగదా వీరు' అని కరుణామయుడగు నా శంకరుడు జాలిగొని ఆ బాలకుని జీవయుక్తుని జేసెను.

326. అనంతరము శంకరులు బలిక్షేత్రమునకు బోయిరి. ఆ క్షేత్రమున పండితులు వేల సంఖ్యలో గలరు. వారినిజూచి, వారందరితో ప్రసంగములను జరిపి వారినందరిని అద్వైత సిద్ధాంతావలంబుల గావించెను.

327. అందు ప్రభాకరుడను పండితోత్తముడు శంకరుని మహిమను గుర్తించి, జడుడగు తన పుత్రునిజూపి, 'యీ పిల్లవాని జడత్వమును తొలిగించి రక్షింపుడ'ని ప్రార్థించెను.

328. దయామూర్తి¸° నా శంకరుడు బాలకునిజూచి, ఈతడు విచిత్ర చరిత్రగలవాడని తెలిసికొని, అతని శిరమున తన పవిత్ర హస్తము నుంచి ''ఓయూ, నీ వెవరవు?'' అని యడిగెను.

329. అంత నా బాలకుడు ఆత్మతత్త్వమును హస్తామలకమువలె స్ఫుటముగ గోచరింపజేయుచున్నట్లు పన్నెండు శ్లోకములతో తన స్వరూపమును విశదపరచెను.

330 పితరం శంకరః ప్రాహ, బ్రహ్మజ్ఞానీ సుత స్తవ

సంసారస్య నయోగ్యో7య. మేనం మే దాతు మర్హసి||

331. బాల స్యాస్య జడత్వస్య, కారణం శృణు పండిత!

బాల్యే వయసి చైతస్య, జాయా తవ కదా చన||

332. స్నాతుం పర్వణి చానేన, సాకం గత్వా నదీం ద్రుతం

సమాధినిష్ఠం తత్తీర, వాసినం మునితల్లజం ||

333. దృష్ట్వా తం ప్రణిప త్యాథ. బాలేన సహ, బాలకం

మునే స్సమీపే నిక్షిప్య, నదీం గచ్ఛామి రక్ష భో.||

334. ఇత్యుక్త్వా సా గతా స్నాతుం, స్నాత్వా77 గత్య

దదర్శ సా

పుత్రం మృతం జలేతత్ర, మునే స్తస్యనిస్న ధౌ||

335 శవమాదాయ పుత్రస్య, మునే ర్నిక్షిప్య పాదయో||

ప్రార్ధయామాస సా సాధ్వీ, తాడయన్తీ హ్యురశ్చ సా||స

336. సమాధేర్ముని రుత్థాయ, దృష్ట్వా బాలశవం పురః||

విలపంతీం చ తాం సాధ్విం, జ్ఞాతవాం త్సర్వ మంజసా||

330. అప్పుడా పిల్వాని తండ్రితో శంకరుడు ''నీ సుతుడు బ్రహ్మజ్ఞాని. ఈతడు సంసారమునకు యోగ్యుడుకాడు. ఈతనిని నాకిమ్ము ఓ పండితుడా ! నీ బాలకుడిట్లు జడుడగుటకు కారణమును వినుము.

331.332. ''ఈతని బాల్యమున నీ భార్య ఒకానొక పర్వదినమున ఈ బాలకునితో సహా నదికి స్నానముచేయుటకై వెళ్ళి. ఆ నదీ తీరమున సమాధి నిష్ఠుడైయున్న ఒక ముని శ్రేష్ఠునిజూచి, బాలకుని చేత నుంచుకొని యాతనికి నమస్కరించి, యా బాలకుని ముని సమీపమున నుంచి-

333. 334. ''స్వామీ ! ఈ బాలుని రక్షింపుడు. నే నిపుడే స్వానకృత్య మును నిర్వర్తించుకొఇ వచ్చి తీసికొందును'' అని చెప్పి. నదికి బోయి స్నానముచేసి ముని సన్నిధికివచ్చి చూడగా బాలుడచట కానరాలేదు. ఆతడు నీటిలో పడి మరణించియుండెను.

335. మృతుడైన తన తనయుని శరీరమును జూచి దుఃఖార్తయైగుండెలు మోదుకొనుచు. పెద్దగ రోదనముచేయుచు, నాశవమునుతెచ్చిముని పాదములపై బదవైచి, ఆ సాధ్వీమణి సకరుణముగ ''స్వామీ ! కరుణించుము. రక్షింతువని విశ్వసించి, ఈ బాలకుని తమ సమీప మున నుంచి. నేను నదికి స్నానార్థమై వెళ్ళితిని. దానికి ఫలితమిట్లయ్యెను. స్వామీ, రక్షింపుము. పుత్రభిక్ష నొసంగుము'' అని ప్రార్థించుచుండ-

336. 337. ''ఆ ధ్వనికి సమాధి విఘ్నముకలిగి వ్యుత్థితుడై యెదుటనున్న నా బాలుని శవమును. దుఃఖార్తయైన సాధ్వినిజూచి. సంగతి

337. తస్యా శ్శోకేన సంతప్తో, దయార్ధ్ర హృధయ శ్చసః

పరకాయ ప్రవేశేన, బాల దేహం వివేశ తం||

338. సోయం తవ సుతో విద్వన్‌ ! దేహే7స్మిన్‌ భాతి

తన్మునిః

మునే రతి విరక్తత్వా, జ్జడవ ద్దృశ్యతే7ద్యసః||

339. ఏవముక్త్వాగృహీత్వాతం, దత్వాయత్యాశ్రమంతదా

హస్తామలక నామానం,చక్రేతం శంకరో ముదా||

340. ప్రభాకరేణ తత్పిత్రా, ప్రార్థితస్సన్‌ స శంకరః||

భాష్యోపదేశం కృతవాన్‌, విధినా7ధ్యయనస్యచ||

337. నంతనూ తెలిసికొని, దయారూర్ణుడై యాముని ఆమె శోకమును జూచి సంతప్త హృదయుడై. ఆమె దుఃఖమును తొలగింపనెంచి. పరకాయ ప్రవేశానుకూల యోగశక్తితో నాబాలుని శరీరమున ప్రవేశించెను.

338. ''ఓ విద్వాంసుడా ! అతడే యీ నీ సుతుడు. ఈ దేహమున ఆ ముని శ్రేష్ఠుడు విలసిల్లుచున్నాడు. ఆముని మహోత్కృష్టవైరా గ్యాది సద్గుణఖనియగుటచేత నీ ప్రపంచమునందుగాని, ప్రాపంచిక పదార్థములయందుగాని, ఆస్థ యేమాత్రము లేనివాడుగనుక జడుని వలె ప్రాకృతమానవులచే చూడబడుచున్నాడు.''

329. అని యిట్లాతని పూర్వవృత్తాంతమును జెప్పి. శంకరులు అతనిని తన శిష్యునిగా పరిగ్రహించి, అతనికి సన్యాసాశ్రమము నిచ్చి హస్తామలకుడని పేరిడిరి.

340. ఆ బాలకుని తండ్రి¸° ప్రభాకర పండితుడు ప్రార్థింప శంకరు లను గ్రహించి, ఆతనికి భాష్యోపదేశమును గావించిరి.

''సన్యస్య శ్రవణం కుర్యాత్‌'' అను ప్రమాణవచనము ననుసరించి, వేదాంత శ్రవణమునకు సన్యాసులే అర్హులుకాని, గృహస్థులు అర్హులుకారని కొందరి అభిప్రాయము. కాని కొన్నిస్మృతులలో గృహస్థులకుకూడా కర్మవిరామ కాలములలో వేదాంత శ్రవణము కర్తవ్యముగా చెప్పబడుచున్నది. ఈ ఉభయ విదప్రమాణము లను బట్టి వేదాంత శ్రవణమునకు సన్యాసులు ముఖ్యాధికారులనియు వారికా శ్రవణము, మనననిది ధ్యాసనములను కలిగించి ముక్తి హేతువు కాగలదనియు, గృహస్థులుచేయు శ్రవణమట్లుగాక, పాప

వివర్తకమై ముఖ్య శ్రవణాధికార సంపాదకమై క్రమముగ ముక్తి

341.యతిభ్య ఏవ భాష్యాణాం కార్యం శ్రవణ మీదృశం

కింతు తేషా మధ్యయనం. కర్తవ్యం గృహమేధిభిః||

342 ప్రభాకర చరిత్రేణ, భవత్యేయం సునిశ్చితం

తధైవ సంప్రదాయశ్చ, లోకే భాత్యద్య పర్వతః||

343. తత శ్శృంగగిరిం గత్వా, తత్రత్యా నాస్తి కోత్తమాన్‌

దృష్ట్వా చ పండితాం స్తేషాం, భాష్య పాఠం ప్రచక్రమే||

344. తత్రత్యానాం చ శిష్యాణాం, గురా వత్యంత భక్తిమాన్‌

ఆసీదేకో మందబుద్ధి, ర్గురు సేవారత స్సదా||

345. అత్యన్త ముందబుద్ధిత్వా, త్తదీయా స్సమపాఠినః

గిరి రిత్యాహ్యయంత స్తం. జహసుశ్చ ముహర్ముహుః||

346. ఏకదా పాఠసమయే, వస్త్రాణి క్షాళయన్‌ గురోః||

గిరి ర్నద్యా స్తటే చాస్తే, గురు స్తంచ నిరీక్షతే||

హేతువు కాగలదు. కావున నది గౌణ శ్రవణమే. అధ్యయన మాత్రమే యగుననియు పెద్దల నిర్ణయము.

శ్రీ శంకరులు ప్రభాకర పండితునకు అధ్యయనరూపమగు నా గౌణ శ్రవణమునే గావించిరి.

341,342. ఇట్లు శంకరుని సన్నిధానమున ప్రభాకర పండితుడు భాష్యాధ్యయమును చేయుటతో యతీశ్వరులనుండే భాష్యశ్రవణము చేయవలెననియు, గృహస్థులు భాష్యాధ్యనార్హత కలిగియున్నవారే యనియు. స్ఫూటముగా భాష్యాధ్యయనాధ్యపన సంప్రదాయము వ్యక్తమగుచున్నది. లోకమున నిప్పుడట్టి సంప్రదాయము కాన్పించుచునే యున్నది.

343. అనంతరము శంకరులు శృంగగిరికిపోయి యచటనున్న ఆస్తికులౌ పిండితోత్తములచే భాష్యాధ్యయనము చేయింప నారంభించిరి.

344. అచటనున్న శ్రీశంకర శిష్యులలో నొడు మిక్కిలి మందబుద్ధి; కాని అతని యందు గురుభక్తి పరాకాష్ఠనొంది యుండెడిది.

345. అతని సహధ్యాయులందరు నాతడు బుద్ధిమాంద్యము కలవాడగుటచే నాతని 'గిరి', 'గిరి' (రాళ్ళగుట) యని పిలచుచు, పరిహసించు చుండెడివారు.

346. ఒకరోజు పాఠసమయయైనది. శుశ్రూషువులై పండితులందరు వచ్చిగురుని నమస్కరించి, వినమ్రులై గ్రంథములనువిప్పి కూరుచుండిరి. 'గిరి' మాత్రము రాలేదు. ఆతడు నదియందు గురుని వస్త్రముల నుతుకు చుండెను. శంకరులు పాఠము నారంభించక, అతని రాకను విరీక్షించు చుండిరి.

347. అసూయయా సతీర్థ్యాశ్చ, దృష్ట్యా హ్యేతన్నిరీక్షణం

నిందా యుతాని వాక్యాని శ##నైరూచుం పృథక్‌||

348. గురు స్తేషాంచ కౌటిల్యం, ప్రక్షాళయితు ముత్సుకః||

గిరిం సంకల్ప మాత్రేణ, పండితేంద్రం చకార సః||

349. గురుం ప్రాప్య గిరి శ్సీఘ్రం, శ్లోకైస్తోటక నామకైః

తత్త్వం ప్రపంచయన్‌ భక్యా, నమశ్చక్రే7థ శంకరం||

350. కవిత్వం తస్య పాండిత్యం, దృష్ట్వా విస్మయ

మాయయుః

సతీర్ధ్యా గర్వరహితా, సమశ్చక్రు స్తదా గురుం||

351. గిరే ర్యత్యాశ్రమం తద్వా, శిష్యం కృత్వా యధావిధిస

తోటకాచార్య నామానం, చక్రే తం శంకర స్తదా||

352. శూశ్రూషాయాశ్చ మాహాత్మ్య, మహోమందో7

భవత్‌క్షణాత్‌

విద్వాన్‌, జ్ఞావీచ, కర్తవ్య గురుసేవా తతస్సదా||

347. పాఠమునకు వేచియున్న సతీర్థ్యులెల్లరును కాలమతి క్రమించుచుండుటచే ''ఇదియేమి? ఈతనికైనిరీక్షించుట ! ఈ మందబుధ్ధిపైనింత దయయా గురువులకు !'' అని యేమేమో యసూయతో గుస గుస లాడ జొచ్చిరి.

348. దయాసముద్రుడగు నా గురువు. వారి మనోగతమగు నా కుటిల భావమును శుభ్రముగ తొలగింపనెంచి, ఆ 'గిరి'కి ఆమోఘమగు తన సంకల్పబలముని ఆక్షణముననే మహాపాండిత్యము కలుగునట్లను గ్రహించిరి.

349. గుర్వనుగ్రహలబ్ధ సర్వవిద్యుడై యా 'గిరి' గరుసమీపమునకు వచ్చి మహాభక్తితో, తోటక సంజ్ఞకములగు వృత్తములతో పరతత్త్వ ప్రతిపాదన పురస్సరముగ శ్రీశంకరుని స్తుతించి, నమస్కరించెను.

350. అతని ముఖము నుండి వెలువడిన ఆ శ్లోకములను విని అతని సతీర్థ్యులు అందరి కవితా నైపుణిని పాండితీ ప్రాభవమును చూచి, ఆశ్యర్యమునొంది, తమ హృదయముయందలి గర్వమును తొలిగించుకొన్నవారై, గురుశుశ్రూషా గుర్వను గ్రహముల యందలి పరాభవమును గుర్తించినవారై గురువునకు నమస్కరించిరి.

351. అంత శంకరుడు 'గిరి'కి సన్యాసాశ్రమము నను గ్రహించి, ముఖ్య శిష్యులలో నొకనినిగా జేసికొని యతనికి తోటకాచార్యుడను పేరు పెట్టెను.

352. గురు శుశ్రూషా మాహాత్మ్వము వర్ణనాతీతము. దానగదా క్షణకాలములోనే మందబుధ్ధియైన గిరి, మహావిద్వాంసుడై తత్త్వపాక్షాత్కారముగలవాడయ్యెను. అందువలలనే. శ్రేయస్కాములచే నవశ్యము సర్వదా గురుసేవ చేయదగియున్నది.

353. ఏవం శ్రీ పద్మపాదశ్చ , హస్తామలక తోటకా

సురేశ్వరశ్చ చత్వారో, ముఖ్యశిష్యా బభుర్గరోః||

354. ఏవం విజయ యాత్రాయాం, సహశిష్యంచ శంకరం

మహారాజ సుధన్వాత, మన్వగచ్ఛ ద్ధనుర్దరః||

355. తత స్సర్వే గతాః క్షేత్రం, శ్రీమధ్యార్జున నామకం

ద్వైతినో బహవ స్తత్ర, తేషాం ముఖ్యంచ తత్‌ స్థలం||

356. వాక్యార్థేతే జితా స్సన్తో, దర్శయైకం నిదర్శనం

అద్వైతౌత్కష్ట్యవిషయ , ఇత్యూచు శ్శంకరం యతిం||

357 మధ్యార్జునేశ్వరం ప్రాప్య, త్రై స్సహ ప్రాహ శంకరః

అద్వైత ద్వైతయో స్సత్యం, కిం, నో బ్రూహీశ్వర

ప్రభో||

358. సత్య మద్వైత మిత్యేవం, స్ఫుటం లింగా దిజాయత

ధ్వని రేకాత మాకర్ణ్య, దైతినో7ద్వైతినో7భవన్‌||

353. ఇట్లేర్పడిన శ్రీ శంకర శిష్యులందరిలో -పద్మపాదుడు. సురేశ్వరుడు, హస్తామలకుడు తోటకాచార్యుడు-అనువారు ముఖ్యులై ప్రకాశించుచుండిరి.

354. ఇట్లు అద్వై తసిద్ధాంత స్థాపనేచ్ఛతే శంకరులు శిష్యగణ సమేతులై విజయయాత్ర జరుపుచుండ, సుధన్వుడను మహారాజు ధనుర్ధారియై వారి ననుసరించి వచ్చుచుండెను.

355. ఆ తరువాత వీరందరును మధ్యార్జునక్షేత్రమునకు వెళ్ళిరి. ద్వైత మతమువారి కాకాలమున అది ముఖ్యక్షేత్రముగనుండెడిది. అచట ద్వైతమత విద్వాంసులత్యధికులుగ గలరు. అద్వైతాచార్యుడౌ శంకరునితో ద్వైతపండితులందరును వాదమునకు పూనుకొని పరాజయము నందిరి.

356. వాక్యార్థ ప్రసంగములలో నోడిపోయిన ఆ ద్వైతవిద్వాంసులు శంకరునితో నిట్లనిరి: ఓ ''శంకరా ! వాదమున జయాజపయములు వాదుల బలాబలా యత్తముల్తె యుండును. దానసత్యమగు తత్త్వ మును నిర్ధిరించుట కష్టము కావున శంకరా, నీవు నీ పక్షమగు నద్వైతమునందలి యాధార్థ్యమును దైవనిదర్శమున దేనిచేనైన స్థిపరపుము.'' అని యనిరి.

357. అంత శంకరుడు సంతోషముతో ద్వైతవాదుల నందరను గూడ విడుకొని మధార్జునేశ్వరుని జేరి ''ఓపరమేశ్వరా! ద్వైతఅద్వైతము లలో నేది సత్యయో, మాకు నిస్సందిగ్ధముగ, స్పష్టముగ తెలియజేయుడు'' అని ప్రార్థించెను.

358. ఇట్టు శంకరుడు ప్రార్థించినంతనే, మధ్యార్జునేశ్వర లింగమునుండి ''సత్యమద్వైతమ్‌'' అని స్ఫుటముగ నొకధ్వని బయలుదేరెను.

359. తతో రామేశ్వరం గత్వా, తత్రత్యాన్‌ శక్త్యుపాసకాన్‌

జిత్వా7కరోచ్చశాక్తేయం. వైదికంశంకర స్తదాః

360. ఏవం సారస్వతం శైవం షడ్విధం వైష్ణవం తధా

బ్రాహ్మం సౌరం తథాగ్నేయం, గాణాపత్యం చ షడ్విధం||

361. జిత్వామితాని చైతాని తేషు యద్యద వైదికం

తత్సర్వం సంపరిత్యజ్య, వైదికా న్యకరో ద్బువి||

362. కాంచీ క్షేత్రంతతో గత్వా, తత్త్రై కామ్రేశ్వరం శివం

పృధ్వీలింగం తతో విష్ణుం సీషేవే వదరం తథా||

363. శివవిష్ణ్వో రాల¸° స, తదా నిర్మాయ పత్తనే

శివకాంచీ విష్ణుకాంచీ, నామకే చా ప్యరీరచత్‌||

దాని నుభయపక్షములవారును వినిరి. అంత ద్వైతసిద్ధాతులందరును తమ హృదయములను ద్వైతభావములనుండి తొలగించుకొని శంకర శిష్యత్వము నంగీకరించి అద్వైతులైరి.

559. అనంతరము శంకరులుస్వశిష్యులతో సహా రామేశ్వరమునకు జనిరి అచట ఆ కాలములో శక్త్యుపాసనాపరులనేకులుండెడివారు. వారితో సంప్రదించి, వారిని జయించి, శంకరులు వారి శక్త్యుపాసనా పద్ధతి యందిలి అవైదిక ప్రక్రియలనెల్ల తొలగించి వేదసమ్మతమగు రీతులతో సంస్కరించి. శాక్తేయమును [శక్త్యుపాసనా పద్ధతిని] వేదసమ్మతమన దానిని తయారు చేసిరి.

360. ఇట్లే ఆయాక్షేత్రములను దర్శించుచు అచ్చటనున్న ఆవైదిక మతములవారిని వాదమున నిర్జించి వారి వారి మతములందలి ఆవైది కత్వమును తొలగించి వానిని వైదికములుగా జేసిరి.

361. ఈ విధముగ 'సారస్వతమతము,' 'శైవమతము,' 'షడ్విధ [ఆరు విధములగు] వైష్ణవమతము' ''బ్రాహ్మమతము,'' ''సౌరమతము,'' 'అగ్నేయ మతము'' షడ్విధమగు ''గణావత్యమతము'' అను నీ మతమలు నన్నింటినీ వైదికములుగా తయారుచేసి, వైదికమత స్థాపకులై వెలిసిరి.

362, 363. అనంతరము ముక్తిక్షేత్రముగా ప్రసిద్ధగన్న శ్రీ కాంచీక్షేత్రము నకుజని. యచట పృధ్వీలింగమని ప్రసిద్ధిగాంచిన ఏకామ్రేశ్వర స్వామిని శ్రీ వరదరాజు మూర్తిని సేవించి, ఆ పట్టణమున శివ విష్ణుమూర్తుల కుభయులకును ఆలయముల నిర్మింపజేసి, యచట శివకాంచి, విష్ణుకాంచి యను పేర్లతో ప్రసిద్ధములగు రెండు క్షేత్రములను నెలకొల్పిరి.

364. తతస్సంసేవ్య కామాక్షీం, పూజాం తస్యాశ్చ తాంత్రికీం

ఘోరాం దృష్ట్యా7 కరో చ్ఛాంతాం, వైదికీం తాంచ శంకరః ||

365. ఆంధ్రదేశం తతో గత్వా, శ్రీశైలే మల్లాకార్జునం

వేంకటేశం శేషగిరౌ, దాక్షారామేశ్వరం తథా||

366. సంసేవ్యవైష్ణవం వీరం. శైవం మాహేశ్వరం తధా

కాపాలికంచ నిర్జిత్య, వైదికాని చకారసః||

367. తత స్సంస్థాప్య చాద్వైతం, బోధం చక్రే జతేషుచ

ముదాకేచిద్భియ కేచి దాసన్‌ కేచి దసూయయా||

కాపాలికస్య వృత్తాంతః

368. తదా కాపాలికః కశ్చి, దసూయా విష్టమానసః

ఉద్యమ్య శంకరం హంతుం, యతి వేషేణ సో7బ్రవీత్‌

364. అనంతరము శ్రీకామాక్షీదేవిని దర్శించి, యచట నాదేవికి జరుపబడుచున్న ఘోరమగుతాంత్రిక పూజా విధానమును జూచి, దానిని గూడ సంస్కరించి, శాంతమును వైదికమునగు పూజా విధానము నచట నెలకొల్పిరి.

365. 367. అనంతరము శంకరులు ఆంధ్రప్రదేశమునకు జని, యట శ్రీశైల క్షేత్రమున శ్రీ మల్లికార్జునస్వామిని, శేషాద్రియందు శ్రీ వెంకటేశ్వరస్వామిని, దక్షారామమున భీమేశ్వరుని సేవించి, అచ్చటచ్చటతమకంటబడిన వీరవైష్ణవ, వీరశైవ, కాపాలిక, మాహేశ్వరాది మతములయందుగల వేదసమ్మతములుగాని యంశములను తొలగించి, వానినిగూడ వైదికములుగా జేసిరి. అమతములవారి నందరను వాదమున జయించి, వారలకందరకును అద్వైత తత్త్వమును బోధించిరి.

కాపాలిక వృత్తాంతము :

వాదనము పరాజయమును పొందిన వారిలో కొందరు శంకరుని యద్వైతత్త్వమును సంతోషముతో నంగీకరించిరి. కొందరు శ్రీ శంకరులకు ఎదురు పలుకలేక భయముతో నూరకుండిరి. మరి కొంద రనూ యావిష్టహృదయులై దుష్ట సంకల్పములతోనుండ జొచ్చిరి.

368. ఆ సమయమున కాపాలిడొక్కడు అసూయా విష్టమనుస్కుడై శంకరుని హింసింప వలయునను ప్రయత్నముతో యతి వేషమును ధరించివచ్చి శంకరునితో నిట్లనియెను.

369. భోస్సర్వజ్ఞ! మహాదాతర్భవత్సందర్శనా దహం

ధన్యో7స్మి కృతత్యో7స్మి, శృణు వాంఛా

మిమాం మమ||

370. కైలాసం తు శరీరేణ, సహప్రాప్తుం మహత్తపః

కృతం మయా తత స్తుష్టో, భైరవ శ్చాబ్రవీదిదం||

371. త్వదీయ వాంఛా సిద్ధ్యర్థం, మహారా శిరః కురు

హోం మహ్యం తదప్రాప్తౌ, సర్వజ్ఞస్య యతేశ్శిరః||

372. తదాకర్ణ్య తదారభ్య, ప్రయత్నః క్రియతేమయా

మహారాజశిరః ప్రాప్తుం, మాదృశస్య నశక్యతే||

373. సర్వజ్ఞస్య శిరః ప్రాప్తుం, దేశేపర్యటనం కృతం

త్వాం వినా సహిసర్వజ్ఞో, యత్ర కుత్రాపి విద్యతే||

374. సత్యమాత్మా, జగన్మిథ్యా. భవదీయమతే తతః

ఆత్మేతర మిదం సర్వం, హేయం త్యాజ్య మసచ్చ భో||

369. 'స్వామీ తమరు సర్వజ్ఞులు, మహోదారులు, పూజ్యులును. తమ దర్శమున నేను ధన్యుడనైతిని. కృతార్థుడనైతిని. అయ్యా వినుడు : నా కొక వాంఛగలదు.

370. నేను ఈ శరీరముతోనే కైలాసమున కేగవలయునని మహాఘోరమగు తపస్సు జేసితిని. నా తపస్సునకు మెచ్చి శ్రీ భైరవస్వామి సాక్షాత్కరించి యిట్లు పలికిరి.

371. ''ఓయీ, నీకొరిక సిద్ధించవలెనన్న మహారాజుయొక్క శిరమును గాని, అది దొరకుకున్న సర్వజ్ఞుడౌ యతి శ్రేష్ఠుని శిరమునుగాని తెచ్చి, హోమముచేసి నన్ను సంతోష పరపుము'' అని యాన తిచ్చెను.

372. ఆ మాటలు వినిన నాటినుండి నేను ప్రయత్నము చేయచుంటిని మహారాజుల శిరములు మా బోంట్ల కెట్లు లభ్యమగును.

373. ''యతివరా! సర్వజ్ఞుని శిరమును సంపాదింప నేను దేశమును నలుమూలల పర్యటించి వచ్చితిని. కాని యెచ్చటను నాకు సర్వజ్ఞుడు కానరాలేదు. నీవు తప్ప సర్వజ్ఞుడెవ్వరును ఈ భూమండలమున లేరు.

374. ''ఓ సర్వజ్ఞమూర్తీ : భవదీయమగు సద్వైతమతమున బహ్మాభిన్నమగు నాత్మమాత్రము సత్యము. దృశ్యమగు నీ భూత భౌతిక జగత్తంతయు మిథ్యయని నిర్ణయము. కావున నాత్మ భిన్నమగు నీ దృశ్యమంతయు సత్తా శూన్యము. హేయము. కావుననే త్యాజ్యము.

375.మాయాకార్యమయం దేహ, శ్చాస్తిత్వం నాస్తి వస్తుతః

అస్య దేహస్య తస్మాత్తె, శిరో మే దాతు మర్హసి||

376. కించ దేహాభిమానోపి, నాస్తి తేతత్త్వ విద్భవాన్‌

అవి చార్వైవ తస్మాత్త్వం, శిరో మే దాతు మర్హసి||

377. పరోపకార పారీణో, భవాన్‌ తస్మాద్దదాతి చేత్‌

దధీచి వ ద్భవత్కీర్తి, ర్భకూ యా దా చంద్రతారకం||

378. దదాసి చేచ్ఛిర స్తేమే, మహాన్లాభో భవిష్యతిస

తస్యహో మేన కైలాసం, స శరీరం లభేయ భో||

379. ఉపన్యాస మిమం శ్రుత్వా శంకరః ప్రాహ, తం ముదా

శిరో దాతుం సమే శంకా, ప్రీత్యా దాస్వామి స్వీకురు||

380. శ్వోమధ్యాహ్నే7త్ర చైకాంతే సమాధౌచస్థితే మయి చిత్వాశిరో రహస్యం మే, స్వీకురుష్వ యధేప్సితం||

381. కాపాలిక స్తదాకర్ణ్య, హృష్ఠః పరదినే తధా

మధ్యాహ్నం కాల ఆగత్య, సమాధిస్థం దదర్శ తం||

375. ''ఈ దేహము మాయా కార్యమగుటజేసి దీనికి వాస్తవమగు ఉనికి లేదు కావున నీ శిరస్సున నాకిమ్ము.

376. ''మరియు దేహాభిమానముకూడ తమకు లేదు. తమరు తత్త్వసాక్షాత్కారము నొందిన మహాత్ములు. కావు తమరు నిశ్శంకముగ తమ శిరస్సును నా కీయవలయును.

377. ''లోకోపకార పరాయణులగు తాము తమ శిరస్సును నా కిచ్చిన యెడల. వెన్నెముకను పరోపకారార్థమై దేవతల కొసగిన దధీచి మహర్షి కీర్తివలె తమకీర్తి ఆ చంద్రతారకమై స్థిరమై వెలుగొందగలదు.

378. స్వామీ, మీరు మీ శిరమును నాకను గ్రహించిన నాకు గొప్ప లాభము కలుగగలదు. దానిని భైరవమూర్తి కొఱకు హోమమును జేసి నేను యీ శరీరములతోనే కైలాసము నధిష్ఠించగలను.''

379.కాపాలికుని ఈఉపన్యాసమునువిని సంతోషముతో శంకరు లిట్లనిరి. ''ఓయీ, శిరము నిచ్చుటకు నాకేమియును సందేహము లేదు. అతి ప్రీతితో నిత్తును. తీసికొమ్ము.

320. రేపు మధ్యాహ్నకాలమున మేము ఏకాంతమున సమాధిని పొంది యుండుగా, నీవు రహస్యముగా వచ్చి నీకు కావలసిన నాశిరమును నీ యిచ్ఛ వచ్చినట్లు తీసికొని వెళ్ళవచ్చును.''

381. అని చెప్పగా నా కాపాలికుడు సంతసించినవాడై మరుదినము మధ్యాహ్న సమయమునవచ్చి, శంకరులు సమాధిస్థితులై యుండుట జూచి, తన మనోరథయు సిద్ధించినదని సంతోషించుచు, ఖడ్గము

382. స తదా ఖడ్గమాదాయ, శిరశ్ఛేత్తుం ప్రయత్నవాన్‌

శిష్యా స్తదైన స్నానార్థం , గతా స్తస్మాన్నతత్ర తే||

383. మార్గే శ్రీపద్మపాదశ్చ, నృసింహో పాసకో యతః

బుద్ధ్వా గురో రసాయంతం, ప్రాప్తవాన్‌ గురు

మంజసా||

384. స దృష్ట్వా ఛేత్తు మాసన్న, ఖడ్గపాణిం దురుద్యయం

నృషింహానిష్టదేహస్స, న్నవధీ త్తం చ సత్వరం||

385 అహో! శంకరవైరాగ్యం, నిరహంకారతే దృశీ

అహో! ఛాత్రస్య సద్భక్తి, రహో! దుష్టస్యదుర్గతిః||

386. సమాధిం శంకర స్త్యక్త్వా, దృష్ట్వా భీమంచ విగ్రహం

నృసింహం తత్ప్రశాంత్యర్థ్యం, స్తుతవాన్‌ భక్తి

పూర్వకం||

387. భీమాకార పరిత్యాగే, పద్మపాదశ్చ సో7 భవత్‌ః

పృష్టస్స & సో7బ్రవీత్స్సస్య, నృసింహాకార

కారణం||

నెత్తి శంకరుని శిరమును నుంకించి యుండెను.

382 to 384. ఆసమయమున శంకరుని శిష్యులందరును, నదికి స్నానార్ధమై వెళ్ళుచుండిరి. ఆ కారణమున శంకర సన్నిధానమున నొక్కరునులేరు. శంకరశిష్యులలో ముఖ్యుడగు పద్మపాదుడు నృసింహో పాసనా సిద్ధులలో నగ్రగణ్యుడు, తదుపాసనాబలమున మార్గమున నడచుచున్న యాతనికి హృదయమున తన గురువులకేదో ఆపాయము వాటిల్లనున్నదని ఒక స్ఫురణము కలిగెను. అంత నాతడు వెనుకకు తిరిగిరాగా నచట దుష్టోద్యముడై గురుశిరమును ఖండింప ఖడ్గము నెత్తియున్న ఆ కాపాలికాధము డాతనికి కానవచ్చెను. అంత నాతడు తన యిష్టదైవమగు శ్రీనరసింహమూర్తిని ధ్వానింప నాతని దేహమున శ్రీనరసింహదేవుని యావేశము కలిగి, భీకరాకారుడై వెంటనే ఆ కాపాలికాధముని సంహరించి వైచెను!

385. ఆహా ! ఏమీ - శంకరుని వైరాగ్యము, నిరహంకారత ! ఏమీ-శిష్యుడగు పద్మపాదుని గురుభక్తి ! ఆహా ! ఏమీ - దుష్టుల దుర్గతి, ఆసాధువర్తనులు దుర్గతిపాలగుదురు గదా !

386. అంతలో శంకరుడు సమాధినుండి లేచి, యెదుట భయంరాకార ముతో గోచరించుచున్న నరసింహమూర్తిని జూచి వారిని శాంతింపజేయుచు, మహాభక్తితో సంస్తుంచెను.

387. స్తుతి సంప్రీతుడైన ఆ నరసింహమూర్తి తన భయంకరాకారమును పరిత్యజింపగనే అతడు పద్మపాదుడేయని వ్యక్తమయ్యెను. అనంతర మిదేమియని గురువులు ప్రశ్నింప పద్మపాదుడు తనకు నరసింహా కారము కలుగుటకు కారణమును వివరించి చెప్పెను.

క్రకచవృత్తాంతః

388. తతో విదర్భవిషయం శిష్యేస్సహ స శంరః

గత్వా దృష్ట్వాచ తత్రతాన్‌. వీరభైవసేవకాన్‌||

389. జిత్వా తాన్‌ తత్ర చాద్వైతం, స్థాపయామాస సత్వరం

జితానాం నాయక స్తేషాం, క్రకచో నామత స్తదా||

390. శిషై#్య స్సహసై#్స రాగత్య, యోద్ధుం సముప చక్రమే

శంకరస్య చహుంకారాం, త్తదాగ్ని స్సమజాయత||

391. తదగ్నినా హతాస్సర్వే, శత్రవః క్రకచంవినా

తదా చ క్రకచః కోపా త్రార్థయామాస భైరవం||

392. భైరవశ్చ తద గత్య, శంకరం హంతు ముద్యతః

శంకరస్తత్వ వాక్యైస్తం, ప్రసన్నం కృతవాన్‌

క్షణాత్‌||

393. దుష్ట బుద్ధిం తతో జ్ఞాత్వా, భైరవః క్రకచం తదా

శిష్య మప్య వధీ ద్దుష్టం, దుష్టస్య గతి రీ దృశీ||

388 to 390. అనంతరము శంకరులు శిష్యులతో సహా విదర్భదేశములకు జని యచటనున్న వీరభైరవ సేవకులనందరును జయించి, అల్ప కాలముననే యచట నద్వైతమతమును స్థాపించిరి.

అచట శంకరునిచే నోడింపబడిన వారిలో క్రకచుడను నొక వీరభైరవ మతాచార్యుడు గలడు. అతడు తనిశిష్యులు వెయ్యిమందితో వచ్చి శంకరునితో యుద్ధముచేయ సమకట్టెను.

అంత శంకరులు రవ్యంతయైనను వికారమునొందక నొక్క హుం కారమును గావించిరి. వెంటనే అగ్నిజ్వాల లనేకములు బయలుదేరెను.

391. ఆ జ్వాలలచే నాయకుడగు క్రకచుడు తప్ప మిగిలిన వారందరు హతులైరి. అంత క్రకచుడు క్రోధోద్దీపితుడై తన కుపాస్యుడును. గురువునునగు భైరవుని ప్రార్ధించి, శంకరుని సంహరింపుమని కోరెను.

392. స్వసంహరోద్యుక్తుడగు నా భైరవుని తత్వజ్ఞ శిభామణియగు శంకరుడు. తత్త్వ ప్రతిపాదకములగు నుపనిషద్వాక్యముల నుదహరించి తత్త్వబోధమున ప్రశాన్తుని గావించెను.

393. అంత నా భైరవుడు, దుష్టుడౌ నా క్రకచురని దుష్టబుద్ధిగ నెరింగి తన శిష్యుడనియైన తలంపక సంహరించివైచెను. దుష్టులగతి యింతియే గదా!

శాస్త్రవిధి ననుసరించక కామప్రేరితులై కార్యములు జేయవారల కృత్యములకు సిద్ధియుండదు. ఐహికములగు కీర్తి సౌఖ్య సంప

394. తతశ్చార్వాక గురుణా, శంకరో వాద మాహరత్‌

శ్రుత్వా యుక్త్యా చతం జిత్వా, చకారా7ద్వైతినం

చీతం||

395. తత శ్చోత్తర దేశం స, గత్వా శ్రీ శంకరో యతిః

తత్రత్యాన్‌ వివిధా న్బౌద్ధాన్‌, జిగాయ శ్రుతి య్తుభిః||

396. తత్కాలేసుప్రసిద్ధాంశ్చ, నాస్తికాన్‌ పండితో త్తమాన్‌

సర్వాన్వాదేతతో జిత్వా, చకారాద్వైతినశ్చ తాన్‌||

397. ఏవ మసేతు శీతాద్రిం, దేశం భారతనామకం

గత్వా, సర్వత్ర చాద్వైతం, స్థాపయామాస శంకరః||

398. నిర్మూల్య శంకర స్సమ్య, జ్నౌ స్తికాని మతాని షట్‌

షడాస్తకాని సంస్కృత్య తాని స్థాపితవాన్‌ భువి||

దాదులుగాని, ఆముష్మిక శ్రేయస్సులుగాని ఏవియు ఫలించనేరవు. కాన మానవులు శాస్త్రానుసారి ప్రవృత్తి కలవారగుటకును, కామా (రాగద్వేషా)నుసారి ప్రవృత్తికలవారు కాకుండుటకును ప్రయత్నింపవలయును.

394. అనంతరము శంకరులు చార్వాకగురునితో వాదమునడిపి, శ్రుతి జలమునను, యుక్తిబలమునను నాతని జయించి అద్వైత తత్త్వమును బోధించి, అతని నద్వైతిగ జేసెను.

395, 396. ఆ పిమ్మట నా యతిపుంగవుడుత్తదేశమునకు జని యట నున్న నానావిధ బౌద్ధవాదులను, శ్రుతి యుక్త్యుపన్యాసములతో జయించి, ఆ కాలమున లౌకవిఖ్యాతులౌ నాస్తిక పండితోత్తము లందరను వాదమున జయించి, వారినందర శ్రుతిసమ్మతమగు నద్వైత మతావంలబుల గావించెను.

397. ఈ ప్రకారముశంరభగవానుడా సేతు శీతాచాలము వ్యాప్తమైనభారత దేహశమునంతను పర్యటించి, సర్వభారతమునను అద్వైతమతమే శ్రుతిసమ్మతమైనదనియు, ఇదియే సమస్తలోకములకు అభ్యుదయ నిశ్శ్రేయసముల నందజేయగల ఏకైక మతమనియు వనిరూపించి, అద్వైత సిద్ధాంత ప్రతిష్ఠావనము గావించెను.

388. అద్వైతమత సిద్ధాంత విరుద్ధములగు నాస్తికమతముల నారింటిని నిర్మూలనము గావించి, అద్వైత సిద్ధాంతానుగుణముగ శ్రీశంకరులు ధ్యానజపార్చనాది ప్రక్రియలతో గూడిన శైవశాక్త్యాద్యాస్తిక మతముల నారింటిని, అవైదిక ధర్మ సాంకర్యము కలుగకుండా సంస్కరించి, వాని సుపాదేయములుగ నిర్ణయించి స్థాపించిరి.

399. ''షణ్మత స్థాపనాచార్య'' ఇతి సఖ్యాతిమానుభూత్‌

పంచాయతన పూజాఖ్యం, దేవపూజా మరీ రచత్‌||

400. నిర్గుణోపాసనాయాంచ, సర్వే స్యు ర్నాధికారిణఃస

ఉపాసకానాం కార్యార్ధం, బ్రహ్మణో రూపకల్పనా

401. ఇతి శాస్త్రమనుస్మృత్య, షణ్మతస్థాపనం భువి

చకార శంకర స్తద్వ, త్పంచాయతన పూజనం||

మాంత్రికవృత్తాంతః

402.జితేషు మాంత్రికో గుప్తో, హ్యసూయా విష్టమానసః

శంకరం హస్తుముద్యమ్య, కృతవా నాభిచారికం||

403. భగందరేణ రోగేణ, శంకరః పీడిత స్తతః

శాన్త్యర్ధం తస్య శిషై#్యశ్చ, చికిత్సా వివిధాః కృతాః||

404. ప్రార్థితౌ పద్మసాదేన, హ్యాశ్వినౌ కింతు మాంత్రికం||

399. అక్కతమున శ్రీ శంకరులకు షణ్మతస్థాపనాచార్యులను ఖ్యాతి యేర్పడెను. ఇంతియేగాక, దేవపూజా విధామున సర్వశాస్త్రసమ్మత మగునట్లు పంచాయతనపూజా సంప్రదాయమును స్థాపించిరి.

400. 401. నిర్గుణ పరతత్వోపాసనమున నందరకు నధికరాముండదు. కావున మందాధికారులైన వారికొరకై నిర్విశేష పరతత్త్వమగు నా బ్రహ్మమునకు రూపకల్పన చేయబడినది - ''ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూప కల్పనా'' అని శాస్త్రము. దాని ననుసరించి శ్రీశంకరులు షణ్మతస్థాపనమును, పంచాయతన పూజా విధానమును విశిష్ఠరీతిని లోకమునకు ననుగ్రహించిరి.

మాంత్రిక వృత్తాంతము :

402. మాంత్రికులను పేరున నాకాలమున భారతదేశమునందున్న అపై దికులగు మాంత్రికుల నెందరినో శ్రీశంకరులు జయించిరి. జితులగు వారిలో గుప్తుడను నొక మాంత్రికుడు శంకరులపై అసూయగలవాడై వారిని జంపనెంచి, ఒక అభిచారిక (పరులను జంపు) ప్రయోగమును శంకరులపై గావించెను.

203. దాని వలన శంకరుచకు భగందరవ్యాధి యేర్పడి వారి శరీరమును బాధింప జొచ్చెను తద్వ్యాధిని శమింపజేయ తచ్ఛిష్యులు బహు చికిత్సలను చావించిరి. కాని లాభము లేకపోయెను.

404. అంత పద్మపాదుడు ఆశ్వినీదేవతలను ప్రార్థించెను, ఆ దేవవైద్యులాతని భక్తికి సంతోషించి, వచ్చి చూచి, ఇది మాంత్రిక ప్రయుక్తుమగాని, దైహికమగు వ్యాధి కాదని నిరూపించిరి.

405. పద్మపాద స్తదాకర్ణ్య, మన్త్రం తన్నాశ కారకం

జప్త్వా, రోగస్య శాంతిం చ, కృతవాన్‌ శంకరస్య సః||

406. గుప్తం ప్రవిశ్య తద్రోగో, హ్యవధీత్తం చ సత్వరం

ప్రభావో మన్త్రశాస్త్రస్య, చేదృశీతి విబుద్ధ్యతే||

శృంగేర్యాం శారదా పీఠస్థాపనం

407. తతశ్శృంగ గిరిం గత్వా, తుంగాతీరే స శంకరః

మఠం నిర్మాయ చక్రే శ్రీ, శారదా స్థాపనం తతః||

408. దదర్శ, శ్రీశృంగగిరౌ, శంకరో7 ద్భుతదర్శనం

మండూకం ప్రసవాసన్నం. రక్షితం చాహినా తదా||

409. శంకర శ్చతతో జ్ఞాత్వా, స్థలమాహాత్మ్య మీదృశం తత్పీఠం నిర్మమే తత్ర, శారదాయాశ్చ సత్వరం||

410. ఋష్యశృఁగశ్య తపసా, పవిత్రీ కృతపర్వతః

నామ్నా శృంగగిరి శ్చేతి. కథ్యతే మహిమాన్వితః||

405. అంత పద్మపాదుడు ఆ మాటవిని, తన్నివర్తకమగు మంత్రమును జపించి, గుప్తప్రేరితమగు నా అభిచారమును నివర్తింపజేసి తన గురువగు శంకరుని వ్యాధిబాదనుండి తొలగించెను.

406. పద్మపాదమంత్ర నివర్తితమగు నా యభిచారము తిరిగివెళ్ళ ఆ గుప్తునకే ఆ భగందరవ్యాధిని కలుగజేసి అతనిని సంహరించెను మంతశాస్త్ర ప్రభావము ఇట్టిదియేగదా!

శృంగేరియందు శ్రీ శారదాపీఠమును స్థాపించుట-

407 to 410 అనంతరము పీఠస్థాపనముజేయ సమకట్టి యోగ్యస్తలాన్వేషణము జేయుచున్న శ్రీ శంకరులకు ఋష్యశృంగమహర్షి తపస్సు జేసిన స్థలమగుటచే శృంగగిరియని ప్రసిద్ధిగాంచిన మహామహిమా న్వితమైన, తుంగానదీ తీర్థమగు నా స్థలమున నొక విచిత్ర దర్శనము కాననయ్యెను.

అచట ప్రసవార్తయైన మండూకము (కప్ప)ను తన పడగవిప్పి యెండనుండి కాపాడుచున్న యొక మహాసర్పము కానుపించెను. దానిని జూచి శంకరుడు ''ఇయ్యది మహామాహాత్మముతోగూడిన ప్రశాంత స్థానము. పీఠస్థాపన మిచట యుక్తమగున''ని యెంచి ఆ శృంగగిరియందు శ్రీశారదా పీఠమును స్థాపించిరి.

శ్రీ శంకర శిష్యకృత భాష్యటీకాది ప్రణమనవృత్తాంతః

411. తత్పీఠాధిపతి చక్రే పండితేంద్ర సురేశ్వరం

ప్రాదాదాజ్ఞాం చలిఖితుం, సూత్రభాష్యన్య వార్తికం||

412. సతీర్థ్యా శ్చ తదాకర్ణ్య, హ్యూచు రేవ మసూమయా

వార్తికం లిఖీతుం నార్హః, కర్మఠత్వాత్సు రేశ్వరః||

413. కర్మఠో నేతి గురుణా, హ్యుక్తానైచ్ఛంశ్చ తే తతః

గురుస్సురేశ్వరం ప్రాహ, శృణు భో వచనం మమ||

414. లిఖితుం పద్మపాద స్త, దిచ్ఛతి త్వం తు మాలిఖ

లిఖ నైష్కర్మ్య సిద్ధింత్వం, శ్రుత్యం తానాంచవార్తికం||

శ్రీ శంకర శిష్యులు భాష్యటీకాదుల రచించుట :--

411. ఆ పీఠమునకు పండితోత్తముడగు సురేశ్వరాచార్యుల నధిపతిగ జేసి 'అస్మన్నిర్మిత సూత్రభాష్యమునకు నీవు వార్తికమును వ్రాయు'' మని యానతి నిచ్చిరి.

412. సురేశ్వర సతీర్థులగు పద్మపాదాది శంకర శిష్యులు ''సులేశ్వరులకు సూత్రధాష్య వార్తిక రచనానుజ్ఞారూపమగు మహాగౌరవమును గురువులనుగ్రహించిరే. ఇట్టి మహాభాగ్యము మనకు లేకపోయెగదా!'' యిన అసూయగలిగి, గురువులతో ''గురో, ఈసురేశ్వరుడు పూర్వమున మహా కర్మఠుడు, కర్మానురాగము ఏ కొలదిగనో ఇప్పటికిని ఈతనికి ఉండకమానదు. ఈ ముఖ్యాతి ముఖ్యమగు సూత్రభాష్యమున కీతడు వార్తికమును వ్రాయతగడు'' అని యనసాగిరి.

413. శంకరులు ''అట్లుకాదు ఆ కార్యమునకు సర్వధా ఆతడర్హుడు.'' అని చెప్పినను వారంగీకరించలేదు. అసూయ ఇట్టిదిగదా! భగవానుడు భక్తపరాయణుడు. అట్లే గురువులు శిష్యపరాధీనులై యుందురు. శిష్యులపట్ల వారి మనసు నవనీతమే.

శంకరులు బహుశిష్య ప్రార్థననుసరించి, ''సురేశ్వరా! పద్మపాదుడు సూత్రభాష్యటీకారచనోనత్సుకుడగుచున్నాడు. నీవాకార్యమునకు పూనుకొనవద్దు.

414. ''నీవు'' నైష్కర్మ్య సిద్ధి ''యను నొక స్వతంత్ర గ్రంథమును రచింపుము. ఉపనిషద్భాష్యమునకు వార్తికమును రచింపుము.'' అని సురేశ్వరులతో జెప్పిరి.

415. గురుణోక్త ప్రకారేణ, లిఖిత్వైత త్సురేశ్వరః

అర్పణం కృతవాం స్తస్య, తుష్టః ప్రాహ స శంకరః||

416. వ్యాఖ్యాంచ సూత్ర భాష్యస్య, కురుత్వంచ భవాంతరే

ప్రాప్య వాచస్సతిత్వం వై, కృత కృత్య స్తదా భ##వేః||

417. పద్మపాద స్తదా టీకాం, సూత్రభాష్యస్య సత్వరం

లిఖిత్వా గురవే పంచ, పాదా నశ్రావయ న్ముదా||

418. సేతు యాత్రాం తతో గత్వా, మార్గ మధ్యస్థ పత్తనే

మాతులస్య గృహం ప్రాప్య, తన్మైటీ కా మదర్శయత్‌||

419. ప్రభాకరస్య శిష్యత్వా, దీర్ష్యయా మాతులశ్చ తాం

శ్రుత్వా కేనా ప్యుపాయేన, దగ్ధుం తాముద్యత శ్చ సః||

420. స్వగ్రంథా న్టీక యోపేతాన్‌, సర్వా న్నిక్షిప్య తద్గృహే

రక్షార్థం పద్మ పాదస్తు. గతో రామేశ్వరం తదా||

415. ఆంత సురేశ్వరులు వల్లెయని, యనతికాలముననే ఆ గ్రంథముల రచించి గురువుల కర్పించెను.

416. అంత గురువులు సంతసించి, ''నాయనా సురేశ్వరా! నీవు జన్మాంతరమున వాచస్పతి మిశ్రుడవుగా జన్మించి, మా నూత్ర భాష్యము నకు వ్యాఖ్య గావింపుము. దానిచే నీవు కృతకృత్యుడవు కాగలవు అని దయతో పలికిరి.

417. అంత పద్మ పాదుడు సూత్రభాష్య టీకారచన తాను చేయుట కవకాశము కలిగినందుకు మహానందమునొందుచు వేగముగ నాభాష్య టికనురచించితెచ్చి. గురుసన్నిధానమున గూరుచుండి ఐదుపాదముల వరకు తన గ్రంథమున తాను స్వయముగ గురువులకు వినిపించెను.

418. అనంతరము పద్మపాదుడు సేతుయాత్రను చేయుబోవుచు మార్గ మధ్యముననున్న యొక పట్టణమునందలి తన మేనమామగారింటికి జేరి తన సూత్రభాష్యటీకను సంతోషముతో తన మేనమామకు చూపి వినిపించెను.

419. ఈ మేనమామ కర్మమీమాంసా శాస్త్రపండితుడగు ప్రభాకరుని శిష్యుడగుటచేత. పద్మపాద కృతమైన బ్రహ్మతత్త్వ ప్రతిపాదకమగు నా గ్రంథమునుందు ఈర్ష్యగలిగి, ఏదో విధముగ నీ గ్రంథమును దగ్ధముచేయు (కాల్చివేయ ) సమకట్టెను.

420. సేతుయాత్ర జిగమిషువగు పద్మపాదుడు తానురచించిన టీకాసమే తములగు సర్వ గ్రంథములను, ఈమేనమామగారి యింట సురక్షితముగ నుండగలవనువిశ్వాసముతో ఉంచి, రామేశ్వరమునకు వెళ్ళెను.

421. అదహన్‌ మాతులశ్శీఘ్రం, గ్రంథాన్ద గ్ధుంస్వకంగృహం

టీకా ప్రాణ సమాచైవం, దగ్ధే త్యా కర్ణ్యదుఃఖితః||

422. పద్మపాదో గురుం ధ్యాత్వా, ''కాలటీం గతవాన్‌ గురుః

ఇతి జ్ఞాత్వా తత్ర గత్వా, గురౌ సర్వం న్యవేదయత్‌ ||

423. శిష్యాగ్ర్య ప్రంచపాదానం, టీకా యా శ్రావితా త్వయా

సా స్మృతావస్తి, తాం వచ్మి; లిఖశీఘ్రంచ మాశుచః||

424. లిఖిత్వైవం తదా తాం స, పరమానంద సంయుతః

భూత్వా గురుం నమస్కృత్య, ధన్యోస్మీ త్యు క్తవాం శ్చ సః||

425. అద్భుతం విషయం చైత, ద్రాజ శేఖర నామకః

రాజా శ్రుత్వాత మాసాద్య, ప్రాహేదం శంకరం తదా||

421. 422. ఆ మేనమామ ఆ పుస్తకములను తన గృహముతో కూడ కాల్చివేసెను. యాత్రనుండి తిరిగివచ్చిన పద్మపాదుడు ప్రాణ సమానములగు తన గ్రంథముల దగ్ధములగుట విని, మిగుల దుఃఖించి, చేయునదిలేక. గురుధ్యానము చేసి, గురు దర్శనమును కోరి, గురువులు కాలట్యగ్రహారమునకు పెళ్ళిరని తెలిసికొని యటకుజని తనగురుదేవులతో సంగతినంతను మొరపెట్టుకొనెను.

423. 424. అంత శంకరును దయతో ''శిష్రాగ్ర్యా శోకింపకుము. నీచే రచింపబడిన ఆ టీకను .నీవు సేతుయాత్రకు బోవుచు. నాకు ఐదు పాదములు వరకు వినిపించితివి. దానిని నేను మరువలేదు. దానినినిపుడు నేను నీకు సాకల్యముగ వినిపింతును. శీఘ్రముగ వ్రాసికొమ్ము'' అని చెప్పి, తాను విన్నంతవరకు ఒక పదముగాని వర్ణముగాని భేదము లేకుండగ యథా పూర్వముగ గ్రంథమును చూచుచు చెప్పినట్లు చెప్పగా విని, దానినంతను వ్రాసికొని పద్మ పాదుడు పరమానంద సంభరితుడై ''స్వామీ! ధన్యుడనైతిని'' అని చెప్పి, గురుదేవులకు నమస్కరించెను. ఆ గ్రంథమునకే ''పంచపాదిక'' యిన పేరువచ్చెను.

425. అత్యద్భుతమగు నిట్టి శ్రీ శంకరుల ధారనాపటిమను విని జనులెల్లరు నాశ్చర్యము నొందిరి. కేళ##దేశ ప్రభువగు రాజశేఖరుడు పూర్వము తాను రచించి శ్రీ శంకరుల బాల్యావస్థయందు వారిచే సంస్కరింప జేసికొన్న మూడ నాటకములును అగ్నిదగ్ధములు కాగా చేయునదిలేక దుఃకాక్రాంతుడై యుండెను. ఇపుడీ ఆశ్చర్యకరమగు పంచపాదికా వృత్తాంతమును విని, శంకరుని సన్నిధికి వచ్చి, శంకరునితో నిట్లనెను :

426. యతే! త్వయా శ్రుతం పూర్వం, మదీయం నాటకత్రయం

త త్సూర్వ మభవ ద్దగ్ధం గ్రంథ దానం కురు ప్రభో||

427. గ్రంథ త్రయం తదా శీఘ్ర, ముక్తం శంకర యోగినా

స్వీకృత్య తంన్మహారాజ స్సర్వం తసై#్మ ప్రదత్తవాన్‌.

428. తత్సర్వం స పున ర్దత్వాహ్య ''ద్వైతొ ద్ధరణం కురు''

ఇత్యుక్తవాన్‌ తదా రాజా, తధేత్యుక్త్వా జగామ సః||

429. ధారణా మహితా తస్య, గ్రహణం చైక సంథయా

అహో! చిత్రం శంకరస్య, సర్వజ్ఞః ఖలు శంకరః||

430. మాత్రాస్మృత శ్శంకరస్తు కాలటీమాగతొంజసా||

మృత్యోరాసన్న తాంజ్ఞా త్వాత, తస్యా స్తత్వ మబోధయత్‌||

431. సా నర్హాబిర్గుణం జ్ఞాతు, మితి బుద్థ్వా చ శంకరః||

విష్ణుంసం ప్రార్థ్య వైకుంఠం, ప్రాపయామాసతాంముదాః

426. ''ఓ యతీశ్వరా! నాచే రచింపబడిన నాటకత్రయమును పూర్వము మీరు వినియుంటిరి. అవి అగ్నిదగ్ధము లాయెను. అ గ్రంధములను మరల నా కనుగ్రహింప ప్రార్ధించుచున్నాను.

427. అనగానే అత్యాశ్చర్యము కలుగునట్లు శ్రీ శంకరులు ఆ గ్రంధములను మూడింటిని యధాతథముగ నా రాజునకు ఒప్పజెప్పగా వాని నాతడు వ్రాసికొని ఆశ్చర్యానంద సంభరితుడై తన సర్వస్వమును శ్రీ శంకర యతివర్యులకు ధారవోసెను.

428. శంకరులు రాజుతన కర్పణము గావించిన రాజ్యమునంతను తిరిగి యతని కిచ్చివేసి ''ఓ రాజశేఖరా ! నీవు అద్వైత సిద్ధాంతోద్ధరణమును గావింపుము. '' అని ఆరాజున కానతిచ్చితిరి. ఆ రాజు శంకరులతో ''అయ్యా ! తమయాజ్ఞ శిరసా వహింతును. '' అని చెప్పి, శెలవు తీసికొని స్వస్థానమునకు వెళ్ళెను.

429. ఒక పర్యాయము వినినంత మాత్రమున గ్రంధములకు గ్రంథములు గ్రహించగల్గు గ్రహణశక్తికి; గ్రహించిన దానిని బహుకాల వ్యవధానమునను విస్మరింపక, తు-చ-తప్పకుండ తిరిగి యధా పూర్వకముగ నప్పగించగల ధారణాశక్తికి జనులత్యంత విస్మయమునంది శంకరులను నిజముగ నీతడు సర్వజ్ఞమూర్తియే యని కొనియాడసాగిరి.

430. తల్లియగు నార్యాంబిక తన్ను స్మరించిన కారణమున శంకరులు కాలటికి వచ్చియుండిరి. ఆమెకు కాలమానస్నమైనదని తెలిసికొని శంకరులు తల్లికి పరతత్త్వమును బోధించిరి.

431తనతల్లి నిర్గుణ పరతత్త్వమును గ్రహింపజాలదని యెంచి, శంకరులు శ్రీ మహావిష్ణువును ప్రార్ధించి ఆమెకు వైకుంఠ లోకనివాసము కలుగునట్లు చేసిరి.

శ్రీ గౌడ పాదసందర్శనం

432. తత ఆకాశ మార్గేణ, గంగాతీరం గతః క్షణాత్‌

దదర్శ తత్ర యోగీంద్రం, గౌడపాదం గురోర్గురుం||

433. విధివత్తం నమస్కృత్య, రండవ త్సతితో భువి

తదా తం ప్రాహ ధన్యోస్మి, భవత్సందర్శనా ద్గురో!

434. హృష్ట శ్ర్శీ గౌడపాదస్తం, మూర్థ్ని సంస్పృశ్య ప్రీతితః

ఉతాతప్య ప్రాహ యోగీన్ద్రః ప్రశిష్యం యతిశేఖరం||

435. మాండూక్య కారికాణాం చ మత్కాఋతానాం కృతం త్వయా

భాష్య మత్యద్భుతం చేతి, త్వర్గుదోశ్చ శ్రుతం మయాః

436. శ్రోతు మిచ్ఛామి తద్భాష్య, పఠ్య తామద్యత త్త్వయా

శ్రుత్వా తత్పఠితం తుష్టః, పాహేదం వచనం ముదా||

437. మత్కారికాణాం మద్భావ, స్తద్భాష్యే సుప్రకాశితః

త్వద్భాష్యం శ్లాఘితం సద్భిఃజీయదాచంద్ర తారకమ్‌ ః

438. ఇదానీం కృతకృత్యోస్మి, త్వద్భాష్య శ్రవణా దహం

సర్వజ్ఞ పీఠ మారోహ! దేశే కాశ్మీర నామకే||

శ్రీ గౌడపాదుల దర్శించుట

432, 433, తాను తల్లికిచ్చిన వాగ్ధానము ననుసరించి యామెయొక్క అంత్యకాలమున కామె సన్నిధికివచ్చి యామెకు నుత్తమ గతులను కల్గించి, శ్రీ శంకరులు అకాశమార్గమున యోగశక్తితో క్షణకాలములో గంగా తీరమునకు బోయి, యట యోగీంద్రులగు తమ పరమ గురువుల గౌడవాదుల దర్శించి, వారికి సాష్టాంగ నమస్కారముల యథావిధిగ నాచరించి, ''గురో, తమ దర్శనభాగ్యమున నేను ధన్యుడనైతిని''అని వినయముతో పలికి తన శిష్యభావమును ప్రకటించిరి.

434. అంత నా యోగివర్యులు గౌడపాదులు వినయావనతుడైన తనప్ర శిష్యునిజూచి, సంతసించి, ప్రీతితో నాతని శిరమున స్పృశించి

435, 436. ''శిష్యశిఖామణీ! మత్కృతమాండూక్యోపనషత్కారికలకు నీవు భాష్యమును ఆశ్చర్యకరముగ రచించితివని నీగురువగు గోవిందుల వలన వింటిని, దానిని వినవలయునని కోరికగలదు. పఠింపుము'' అని యానతిచ్చిన నాశంకరు డట్లుచేసెను. గౌడపాదుల దానిని విని సంతుష్టాంతరంగులై --

437. ''నాయనా ! ఆ కారికలను మేము ఏభావముతో రచియించితిమో ఆ భావము స్పష్టముగ నీ భాష్యమునందు వ్యక్తమయినది. త్వత్కృత భాష్య మాచంద్ర తారకముగ సుస్థిరముక కాగలదు.

438. ''నాయనా మా శిష్యుడవు నీవు మా భావములను స్ఫుటపరచుచు సంప్రదాయశుద్ధముగ భాష్యరచనము గావించితివి. తచ్ర్ఛవణమున మేము ధన్యులమైతిమి నీవు కాశ్మీరముబోయి యచట సర్వజ్ఞ పీఠము నధిరోహింపుము.''

439. ఇత్యుక్తాన్తర్దధే యోగీ, గౌడపాదో మహాముని ః

తతోగచ్ఛత్స కాశ్మీరం, శంకర శ్శిష్య సంయుతః||

సర్వజ్ఞ పీఠాధిరోహణం

440. జంబూ ప్లక్ష కుశ క్రౌంచ, శాక శాల్మల పుష్కరాః

ద్వీపా యత శ్చ మేదిన్యాం, సప్తద్వాపా వసుంధరాః

441. ఏతేషు జంబూద్వీపం వై, ముఖ్యం భరతనామకం

వర్షం ముఖ్యంతు తద్దీపే, వర్షే తత్ఖండ ముత్తమం|

442. ఏతా దృశేచ భరత, ఖండే కాశ్మీర నామకః

దేశో విఖ్యాత నిలయ, స్సర్వశాస్త్ర విపశ్చితాం||

443. తద్దే శే శారదా దేవ్యా , అ సీ ద్దేవాలయో మహాన్‌ ||

తస్మి న్దేవాలయే పీఠం, బభౌ సర్వజ్ఞనామకం||

444. చతుర్ద్వా రాణి తస్యా సం, శ్చతుర్దిక్షు చ పండితా ః

సర్వతంత్రేషు నిష్ణాతా, అభవన్‌ సుయశస్వినః||

445. తత్రత్యాన్‌ పండితాన్‌ సర్వాన్‌, జిత్వాయశ్చాధిరోహతి

పీఠ మేత త్స సర్వజ్ఞ, ఇతి ఖ్యాతిం గమిష్యతి.

446. అని చెప్పి గౌడపాదు లంతర్ధానము నొందిరి. అంతట పరమగురువుల యాజ్ఞచొప్పున శంకరులు స్వశిష్యులతో సహా కాశ్మీరమును గూర్చి వెళ్ళిరి.

సర్వజ్ఞ పీఠారోహణము

440. ఈ భూమండమున జంబూద్వీపము,ప్లక్షద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, శాకద్వీపము, శాల్మలీద్వీపము, పుష్కరద్వీపము అను ఏడు ద్వీపములు కలవు. కావుననే భూమికి సప్తద్వీప యను పేరు గలదు.

441. వీనిలో జంబూద్వీపము మిక్కిలి ప్రశంసనీయమైనది, ఆ జంబూద్వీపము నందలి భరత కింపురుషేలా వృతాదివర్షములలో భరత వర్షము ముఖ్యమైనది.

442. ఆ భరతవర్షమున భరతఖండము ఇంకను ముఖ్యమైనది, ఆ భరత ఖంమునగల వివిధ దేశములలో కాశ్మీరము సర్వోత్కుష్టమైనది, ఆ దేశము ప్రఖ్యాత సర్వశాస్త్ర విశారదులకు నిలయము.

443. ఆ దేశమున గొప్ప శారదాదేవి ఆలయము గలదు. ఆ దేవాలయమున నొక సర్వజ్ఞ పీఠము గలదు.

444. దాని నాలుగు ద్వారముల యందును సర్వతంత్ర నిష్ణాతులైన ప్రఖ్యాత పండితులుందురు.

445. అచట పండిత ప్రకాండుల నందరను ఎవడు సర్వతోముక పాండిత్యమున జయించి అపీఠము నధిష్ఠించునో, అతడు ''సర్వజ్ఞ'' డను ప్రఖ్యాతిని పొందగలడు.

446. ఆ సం స్తత్కాల పర్యన్తం , సర్వజ్ఞా స్తయ ఆగతాః

ప్రాకృశ్చిమోత్తరాశాభ్యో, ద్వారత్రయ మపావృతం

447. పిహితం దక్షణద్వారం, సచ కే నాప్య పావృతం

తత్ర శ్రీ శంకరోగచ్ఛ, త్పీఠారోహణ కాంక్షయా

448. తత్రత్యైః పండితైస్సాకం, వివాదః ప్రాచల త్తదా

తస్మి న్వాదేజితా స్సన్త, స్సర్వే చాద్వైతినోభవన్‌

449. తదా శ్రీ శారదా దేవీ, ప్రత్యక్షా ప్రాహ శంకరం

సర్వజ్ఞ స్త్వం నమే శంకా, పీఠ మారోహ! సత్వరం||

450. తద్ద్వార మప్యపావృత్య, జయశ##బ్దైస్స శంకరః

సర్వజ్ఞ పీఠ మారుహ్య, లోకే విఖ్యాతి మాగతః||

446. శంకరులా పీఠము సమీపమును జేరునాటికి ముగ్గురు మహాత్ములివ్విధముగ సర్వజ్ఞపీఠము నధిరోహించి, సర్వజ్ఞులను ఖ్యాతినొందియుండిరి. వారిలో నొకరు తూర్పుదిక్కుననుండి, మరియొకరు పడమటి దిక్కుననుండియు, ఇంకొకరు ఉత్తరదిక్కునుండివచ్చిన వారై యుండిరి. వారిచే నా మూడుదిక్కుల యందలి ద్వారములు మూడు మాత్రము తెరువబడియుండెను.

447. దక్షిణదిక్కుననున్న ఆ శారదాలయమునందలి సర్వజ్ఞపీఠద్వారము ఇంత వరకు ఎవరిచేతనుగూడ తెరువబడి యుండలేదు.

448. ఆ ద్వారమును తెరచి, పీఠము నధిరోహింప నెంచి, దక్షిణ దిక్కునుండి యిపుడు శంకరులకు, అచటి పండితోత్తములతో మహాప్రౌఢములగు వాదములన్ని విద్యలయందును సాగెను అనతికాలములోనే శంకరులచేత నందరు జితులైరి. జితులైన నా పండతులకందరకు నద్వైత తత్త్వమును బోధించి, శంకరులు వారి నద్వైత సిద్ధాంత నుయాయులనుగ జేసిరి

449. అంత శ్రీ శారదాదేవి ప్రత్యక్షమై శంకరునితో, ''శంకరా ! నీవు సర్వజ్ఞుడవు సందేహము లేదు. ఈ సర్వజ్ఞపీఠమును నీ వధిరోహింపుము.'' అని స్వయముగ పలికి, శంకరునకు ''సర్వజ్ఞ'' యను బిరుదము నొసంగెను.

450. అంత పండితేంద్రుల జయ శబ్దములు పలుకుచుండ నా శంకరుండు దక్షిన ద్వారమును తెరచి, సర్వజ్ఞపీఠము నధిరోహించెను. వాటినుండి శంకరుడు సర్వజ్ఞుడును సార్ధకబిరుదుముతో సర్వోత్కృష్టముగ ప్రకాశించుచుండెను.

451. తత్ర త్యైః పండితై స్సమ్య, క్పూజిత శ్శంకరో ముదా

త మువాచ తదా వాణీ 'కలౌ భవ జగద్గురుః'||

పీఠరాంతరాణాం సంస్థాపనం

452. తత స్సం స్థాప్య పీఠాని, జగన్నాధే స శంకరః

బద ర్యాంద్వారకాయాంచ, శిష్యాంశ్చక్రే చ తత్పతీన్‌ ||

453. జగన్నాధే పద్మపాదో, హస్తామలక తోటకౌ

శ్రీ ద్వారకా బదర్యోశ్చ, గురుణా స్థాపితాః క్రమాత్‌ ||

454. యుజుర్వేద మహావాక్యం శ్రీ శృంగేర్యాం ప్రతిష్టితం

బుక్సామాథర్వ వాక్యాని, స్థాపితానిఈ తరేషుచ||

451. శారదాలయము నందున్న సర్వజ్ఞమూర్తులౌ పండితేంత్రులందరును తమకు అద్వైతతత్త్వమును బోధించి, అజ్ఞానమును తొలగించిన ఆ శంకరుని సాక్షాద్భగవానునిగా నిశ్చయించి, గురుభావముతో పూజించిరి. శ్రీ విద్యాధిదేవతయగు శారదాదేవి '' ఈ యుగమున నీవు జగద్గురుడవై విలసిల్లుము'' అని యాశీర్వదించెను. ఇట్లు శ్రీ శంకరులకు 'సర్వజ్ఞ' యనియు, 'జగద్గురు' అనియు బిరుదములు సాక్షాత్‌ శ్రీ శారదాదేవి చేతనే ప్రసాదింపబడినవి.

పీఠాంతర స్థాపనము

452, 453. తరువాత శ్రీ శంకరులటనుండి బయలుదేరి శ్రీ జగన్నాధ క్షేత్రనమునను శ్రీ ద్వారకాక్షేత్రమునను, శ్రీ బదరీ క్షేత్రమునను అద్వైతసిద్ధాంత ప్రాచారార్థము పీఠములను స్థాపించి, ఆ పీఠముల యందు పద్మపాదుని జగన్నాధమునను, హస్తామలకుని ద్వారక యందును, తోటకచార్యుని బదరియందును, పీఠాధిపతులనుగా జేసిరి.

454. అంత శంకరులా నాల్గుపీఠములందున్న తమ నలుగురు శిష్యులకును, నాల్గువేదములయందులి నాల్గు మహావాక్యములను ఒక్కొక్కరికి ఒక్కొక్క మహావాక్యము ప్రధానముగా జేసి ఆయాపీఠ సంప్రదాయములను వ్యవస్థాపన జేసిరి.

అందు శృంగగిరియందు యజుద్వేదస్థ మహావాక్య సంప్రదాయమున్ను, జగన్నాదమునందు బుగ్వేదస్థ మహావాక్య సంప్రదాయమున్ను, ద్వారకయందు.. సామవేదస్థ మహావాక్య సంప్రదాయమున్ను, బదరికయందు అధర్వవేదస్థ మహావాక్య సంప్రదాయమున్ను ప్రతిష్ఠింపబడినవి.

455. ఏవ మాసేతు శీతాద్రిం, దేశం గత్వాచ శంకరః

సంస్థాప్య మత మద్వైతం, కృత కృత్య స్తదాభవత్‌|

456. తతో గత్వా బదర్యాం స, శీతాధిక్యేన బాధితైః

తజ్జనైః ప్రార్థిత స్తత్ర, చోష్ణగుండం వినిర్మమే||

శ్రీ శంకరాచార్యాణాం - కైలాస గమనం

457. ద్వాత్రింశ ద్వత్సరా ణ్యాసన్‌, వయ స్తస్య తదా గతః

దత్తాత్రేయశ్చ భాస్యాణి, దృష్ట్వా ప్రీత్యేద మబ్రవీత్‌ |

458. జీయా ద్భాష్యత్రయం లోకే, తేసదాచంద్రతారకం

కర్తవ్యంచ త్వయా సర్వం, కృతం సమ్యక్చ శంకర!||

459. తతః కైలాస వాసోద్య, త్వయా కార్యశ్చ తంకురు!

తదానీ మాగతా స్సర్వే, బ్రహ్మశ క్రాది దేవతాం|

460. గంధర్వా బుషయ స్సిద్ధా, స్సర్వే, చాగత్య తుష్టువుః

తైరేవంస్తూయమాన స్సన్‌, కైలాసం స్వం జగామసః||

455. ఇట్లు శంకరులాసేతు శీతాచరములను పర్యటించి, యావద్భారతమున అద్వైతమతమును స్థాపించి కృతకృత్యులైరి.

456. పిమ్మట బదరీక్షేత్రమునకువెళ్ళి శీతాధిక్యమును బాధితులైన ప్రజలు తన్ను ప్రార్ధింప నచట నొక ఉష్ణగుండమునున నిర్మించిరి.

దత్తాత్రేయ సమాగమయు - కైలాసగమనము

457. అప్పటికి శంకరునకు మప్పదిరెండు సంవత్సరములు నిండియుండెను. ఆ సమయమున శ్రీ దత్తాత్రేయుల ప్రత్యక్షమై శ్రీ శంకర నిర్మితభాష్యములను జూచి సంతసించినవాడై యిట్లుపలికెను.

458. ''ఓ శంకరా ! త్వత్కృతభాష్యత్తరయము, లోకమున చంద్రతారాదికము లున్నంతవరకు వెలయుగాత ! నీవు భూలోకమున నవత రించి, నిర్వహిందలచిన కృత్యములన్నియు పూర్తిగ నీచే చేయబడినవి. ఇక నీవు నిజమగు నీపారమేశ్వర రూపముతోకైలాసమునకు చేరవలసియున్నది.

459, 460. ఆ సమయమున బ్రహ్మేంద్రాది దేవతలున్నూ, బుషులు, గంధర్వులు, సిద్ధులు మున్నగు వారందరున్నూ వచ్చి స్వస్థానోన్ముఖులైన శ్రీ శంకరులను స్తుతించిరి.

ఇట్లు వారందరిచే స్తుతింపబడుచున్నవాడై శ్రీశంకర భగవానుడు నిజనివాసమగుకైలాసమును చేరికొనియెను.

శ్రీశంకర ద్వాదశ మంజరికా స్తోత్రమ్‌

శ్లో|| ఆర్యామ్యా గర్భ సంభూతం శివం శివగురో స్సుతం|

''పూర్ణాతీరే కాలటీస్థం తం వన్దే శంకరం గురుం||

శ్లో|| సర్వ విద్యాసు నిష్ణాతం బాల్యే సప్తమ హాయనే

సన్యాసిన మష్టమాబ్దేతం వందే శంకరం గురుం||

శ్లో|| ద్వాదశాబ్దే ధియాభక్త్యా గోవింద గురు సేవినం

విశ్వేశాను గృహీతం తం వందేహం శంకరం గురుం||

శ్లో|| భాష్యాది గ్రంత కర్తారం శ్రీ బదర్యాం స్వమేధయా

ఊన షోడశ వర్షం తం వందేహం శంకరం గురుం||

శ్లో|| వ్యాసాను గ్రహ పాత్రం చ వాక్యార్థేన చ ప్రజ్ఞయా

షోడశాబ్ద వయస్కం తం వందేహం శంకరం గురుం||

శ్లో|| వ్యాస దత్తాయుషం బాలం పునష్షోడశ వర్షిణం||

సేవితం పద్మ పాదాద్యై స్తం వందే శంకరం గురుం||

శ్లో|| గత్వాచాసేతుశీతాద్రిం కృత్వా దుర్మత ఖండనం

అద్వైత స్థాపకం ధీరం తం వందేశంకరం గురుం||

శ్లో|| వేదధర్మ ప్రబోధార్థతం చతుర్దిక్షు చ భారతే

పీఠ స్థాపన కర్తారం తం వందే శంకరం గురుం||

శ్లో|| సర్వజ్ఞ పీఠ మారుహ్య సర్వజ్ఞ ఇతి విశ్రుతం

షణ్మత స్థాపకాచార్యం తం వందే శంకరం గురుం||

శ్లో|| వాది మత్తేభ పంచాస్యం భక్తి సాధ్యం ఘృణాకరం

జ్ఞానవైరాగ్యమూర్తిం చ తం వందే శంకరం గురుం||

శ్లో|| సర్వజ్ఞం శంకరం సాక్షా చ్ఛంకరం లోక శంకరం

జగత్ప్రఖ్యాత ధీమ న్తం తం వందే దేశికో త్తమం ||

శ్లో|| యస్యానుగ్రహ మాత్రేణ మూలావిద్యాపి నశ్యతి

జగద్గురు మహం వందే వంకరాచార్య సద్గురుం||

జగద్గురు శంకరాచార్య నామ సంకీర్తనం

1. ''జయ! జయ! శంకర! జగద్గురో! -- సంయమివర్య! జగద్గురో!

2. కాలటివాసిన్‌! జగద్గురో! - కరుణామూర్తే! జగద్గురో

3. శివగురు తనయ! జగద్గురో!-శివావతార! జగద్గురో!

4. విద్యామూర్తే! జగద్గురో!- వాదకేసరిన్‌! జగద్గురో!

5. భాష్యకృదగ్ర్య! జగద్గురో! -- భక్తజనావన! జగద్గురో!

6.దుర్మత ఖండన! జగద్గురో!- షణ్మతస్థాపక జగద్గురో!

7. వ్యాసతోషక! జగద్గురో! - గౌడానందక ! జగద్గురో

8. యోగేశ్వర! శ్రీ జగద్గురో-యతివర్య! శ్రీ జగద్గురో!

9. జగదేకగురో! జగద్గురో! -- జగదానందక! జగద్గురో!

10. జయ! జయ! శంకర! జగద్గురో! - సంయమివర్య! జగద్గురో!''

స ర్వే జ నా స్స ఖి నో భ వ న్తు

శ్రీశంకరచిద్విలాసః

శంకరస్మృతిః

-

1. శ్రుతిస్మృతి పురాణానా, మాలయం కరుణాలయం

స్మరామి భగవత్పాదు, శంకరం జగతాం గురుఁ||

2. అసత్కీర్తన వాక్పంకం, లోక వృత్త్యా చిరార్జితం

కథారచనతో యేన, క్షాళయామి జగద్గురో||

3. తత్పంక క్షాళ##నే నాస్తి, గురుస్తోత్రం వివాజలం

జిహ్వాయా యస్యకస్యాసి, తస్మా త్కార్యాగురుస్తుతిః||

4. మూకం కరోతి వాచాలం, కరోత్యజ్ఞం చపండితం

యత్కృపా, తమహం వందే, శంకరాచార్య సద్గురుం||

sri Shankara chidvilasamu    Chapters